padmakar
-
బీజేపీలోకి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే
రాబోయే లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సిద్దమవుతున్న సమయంలో మాజీ మంత్రి 'పద్మాకర్ వల్వి' (Padmakar Valvi) బీజేపీలో చేరుతున్నట్లు షాకిచ్చారు. వల్వి బీజేపీలోకి మారనున్నట్లు గత రెండేళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు 'చంద్రశేఖర్ బవాన్కులే'ను కలిసిన ఆయన ఎట్టకేలకు బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. దీంతో రేపు (మార్చి 13) భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరుతున్నట్లు సమాచారం. పద్మాకర్ వల్వి 2009లో నందుర్బార్లోని షహదా నియోజకవర్గం నుంచి మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. మాజీ క్రీడా మంత్రిగా కూడా పనిచేసిన వాల్వి, నందుర్బార్ & ఉత్తర మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రముఖ నేతలలో ఒకరు. ఈయన ఆ తరువాత 2014లో జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. -
ఆర్టీసీ అభివృద్ధిపై దృష్టిసారించాలి
నెల్లూరు టౌన్: ఆర్టీసీ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించాలని, సంస్థను ఆర్థికంగా ఆదుకునేందుకు మంత్రుల ఉపసంఘంతో సమావేశం ఏర్పాటు చేయాలని ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పద్మాకర్ విజ్ఞప్తి చేశారు. నెల్లూరులో శనివారం జరిగిన ఈయూ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన ప్రసంగించారు. ఆర్టీసీని పరిపాలనాపరంగా రెండుగా విభజించినందున కార్మికసంఘం గుర్తింపు ఎన్నికలు నిర్వహించేందుకు లేబర్ కమిషనర్, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. 240 రోజులు సర్వీసు పూర్తిచేసుకున్న కాంట్రాక్టు డ్రైవర్లు, కండక్టర్లను ఒప్పందం ప్రకారం రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈయూ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, ఎమ్మెల్సీ పి.జె.చంద్రశేఖరరావు మాట్లాడుతూ ఆర్టీసీ నష్టాలకు, అప్పులకు కార్మికులు బాధ్యులు కారని, ప్రభుత్వ విధానాలే కారణమని చెప్పారు. ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రోజురోజుకు నష్టాల్లోకి పోతున్న ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చేందుకు కార్మికులందరూ చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. ఈ సందర్భంగా ఈడీని యూనియన్ నాయకులు సత్కరించారు. సమావేశంలో13 జిల్లాలకు చెందిన యూనియన్ నాయుకులు పాల్గొన్నారు. -
సమ్మె కొనసాగిస్తాం, వెనక్కి తగ్గేది లేదు..
హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మెను కొనసాగిస్తామని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. తమ సమ్మె చట్టబద్ధమేనని, హైకోర్టులో మంగళవారం తమ వాదనలు వినిపిస్తామని ఆయన సోమవారమిక్కడ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరిన మూడు వారాల గడువు ఇవ్వలేమని ఎంప్లాయిస్ యూనియన్ నేత పద్మాకర్ తెలిపారు. సమ్మె జరుగుతున్నప్పుడు ఆర్టీసీలో నియమకాలు చేపట్టడం చట్టవిరుద్ధమన్నారు. కాంట్రాక్ట్ కార్మికులు కూడా తాము చేస్తున్న సమ్మెకు మద్దతు ఇవ్వాలని పద్మాకర్ కోరారు. ఆర్టీసీ ఆదాయాన్ని పన్నుల రూపంలో ప్రభుత్వం దండుకుంటుందని వారు ఆరోపించారు. సమ్మె కొనసాగిస్తామని, వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. -
ఆర్టీసీ కార్మికులకు 50% ఐఆర్ ప్రకటించాలి: ఈయూ
సాక్షి, హైదరాబాద్: ఆప్రకటించాలని, ప్రభుత్వం ఇప్పటికే భృతిని నిర్ధారించి ఉంటే ఇతర శాఖల ఉద్యోగుల కంటే ఆర్టీసీ కార్మికులకు వేర్టీసీ కార్మికులకు 50 శాతం మధ్యంతర భృతి(ఐఆర్)ని వెంటనే తనంలో ఉన్న 19 శాతం వ్యత్యాసాన్ని కలపాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ) సర్కారును డిమాండ్ చేసింది. జీతభత్యాల సవరణపై యూని యన్ నేతలతో పే కమిటీ శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఈయూ ఈ మేరకు డిమాండ్ చేసినట్టు ఈయూ ప్రధాన కార్యదర్శి పద్మాకర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. శాశ్వత ప్రాతిపదికనే పోస్టుల భర్తీ: ఎన్ఎంయూ డిమాండ్ ఆర్టీసీలో శ్రామిక్, మెకానిక్స్, జూనియర్ అసిస్టెంట్ వంటి పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేస్తూ డ్రైవర్, కండక్టర్ పోస్టులకు మాత్రం కాంట్రాక్టు పద్ధతిలో నియామకాలు జరపడం ఏమిటని ఎన్ఎంయూ ప్రశ్నించింది. ఈ విధానానికి వెంటనే స్వస్తి పలకాలని యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు నాగేశ్వరరావు, మహమూద్లు డిమాండ్ చేశారు.