హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మెను కొనసాగిస్తామని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. తమ సమ్మె చట్టబద్ధమేనని, హైకోర్టులో మంగళవారం తమ వాదనలు వినిపిస్తామని ఆయన సోమవారమిక్కడ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరిన మూడు వారాల గడువు ఇవ్వలేమని ఎంప్లాయిస్ యూనియన్ నేత పద్మాకర్ తెలిపారు. సమ్మె జరుగుతున్నప్పుడు ఆర్టీసీలో నియమకాలు చేపట్టడం చట్టవిరుద్ధమన్నారు. కాంట్రాక్ట్ కార్మికులు కూడా తాము చేస్తున్న సమ్మెకు మద్దతు ఇవ్వాలని పద్మాకర్ కోరారు. ఆర్టీసీ ఆదాయాన్ని పన్నుల రూపంలో ప్రభుత్వం దండుకుంటుందని వారు ఆరోపించారు. సమ్మె కొనసాగిస్తామని, వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.