RTC Employees Union
-
కేసీఆర్ గారూ.. పేస్లిప్స్ చూడండి
సాక్షి, నిర్మల్ : ఆర్టీసీలో సీనియర్ ఉద్యోగులు రూ.50వేల వేతనం తీసుకుంటున్నారని సీఎం కేసీఆర్ ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ నాయకులు పేర్కొన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని బస్‌డిపో వద్ద బుధవారం ఆందోళన చేపట్టారు. పే స్లిప్పులను చూపిస్తూ వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు. 20 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నామని, ప్రస్తుతం రూ.25వేలే జీతం ఉందన్నారు. సీనియారిటీ ఉన్నవారందరికీ రూ.50 జీతాలు తీసుకుంటున్నారని సీఎం అబద్దపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సీనియారిటీ ఉన్నప్పటికీ రూ.25 వేలకు మించి లేవని, దీనికి రుజువులు తమ పేస్లిప్‌లేనన్నారు. సీఎం కేసీఆర్ ఒకసారి పేస్లిప్‌లను పరిశీలించి చూసుకుని మాట్లాడాలని హితవు పలికారు. ఆర్టీసీ కార్మికులకు భారీగా వేతనాలు ఉన్నాయని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. తప్పుడు ప్రచారం మానుకోవాలని, లేని పక్షంలో రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఇందులో ఆదిలాబాద్ జిల్లా జేఏసీ కన్వీనర్ ఏఆర్ రెడ్డి, జేఏసీ నాయకులు గంగాధర్, చందర్, నారాయణ, జమీర్, శ్రీనివాస్, రాజేశ్వర్, పోశెట్టి, శంకర్ తదితరులున్నారు. -
‘ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడండి’
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం తరఫున జరిపిన చర్చలు విఫలం కావడంతో.. వారు శనివారం నుంచి సమ్మె చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించారు. మంత్రి అజయ్, డీజీపీ మహేందర్‌రెడ్డితో కలిసి.. కలెక్టర్లు, రవాణా, ఆర్టీసీ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చలు జరిపారు. ఒకవేళ ఆర్టీసీ కార్మికుల సమ్మె అనివార్యమైతే.. పండుగలను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. కార్మికులు బస్సులకు ఆంటకం కలిగించకుండా డిపోలు, సరిహద్దు చెక్‌పోస్ట్‌ల వద్ద తగిన బందోబస్తు ఏర్పాటు చేసి.. 144 సెక్షన్ విధించాలని సూచించారు. అవసరమైతే ప్రైవేటు డ్రైవర్లను తీసుకుని అద్దె బస్సులు, విద్యా సంస్థల బస్సులు నడిపేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను నియమించుకోవాలని ఆదేశం.. ఆర్టీసీ కార్మికులు శనివారం నుంచి సమ్మెకు దిగనున్న నేపథ్యంలో.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ సభ్యులు, ఆర్టీసీ, రవాణా శాఖల ఉన్నతాధికారులు ఎర్రమంజిల్‌లోని రోడ్లు భవనాల శాఖ కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. పండుగల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. తక్షణమే తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను నియమించుకోవాలని అధికారులు ఆదేశించారు. అయితే ఇప్పటికే దూరప్రాంతాలకు వెళ్లాల్సిన సర్వీసులు నిలిచిపోయాయి. రాత్రి వరకు మరిన్ని సర్వీసులు నిలిచిపోయే అవకాశం ఉండటంతో.. పోలీసు బందోబస్తు మధ్య బస్సులను నడపాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ప్రైవేటు బస్సులు, స్కూల్ బస్సులను అందుబాటులోకి తెచ్చేలా చూడాలని అన్నారు. అలాగే క్యాబులు, ప్రైవేటు బస్సులు ప్రయాణికుల నుంచి ఎక్కువ చార్జీలు వసూలు చేయవద్దని కోరారు. చదవండి : చర్చలు విఫలం, అర్థరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె -
చర్చలు విఫలం, అర్థరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికుల చర్చలు మరోసారి విఫలం అయ్యాయి. వరుసగా మూడో రోజు కూడా అధికారుల కమిటీ, కార్మిక సంఘాల జేఏసీ మధ్య చర్చలు విఫలం కావటంతో సమ్మె కొనసాగనుంది. దీంతో శనివారం నుంచి సమ్మె యథాతథంగా కొనసాగనుందని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ స్పష్టం చేసింది. ఎస్మాకు భయపడేది లేదని, ఆర్టీసీని బతికించడానికే తాము సమ్మె చేస్తున్నట్లు పేర్కొంది. ఎస్మా, పీడీ యాక్టులు తమకు కొత్తకాదని, ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందనటం తప్ప ఒక్క డిమాండ్‌కూ హామీ ఇవ్వటం లేదని కార్మిక సంఘాల నేతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్టీసీ జాక్ నేత అశ్వత్థామ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీ సమ్మెకు అన్ని సంఘాలు కలిసి రావాలని కోరారు. డిపో మేనేజర్లు కూడా సమ్మెలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీని బతికించడానికే తాము సమ్మె చేస్తున్నామన్నారు. తాము ఎవరి చేతిలో కీలు బొమ్మలు కాదని, ప్రస్తుతం సకల జనుల సమ్మును మించిన సమ్మె అవసరమని అన్నారు. తమ సమ్మె ద్వారా ప్రజలకు కలిసి ఇబ్బందికి చింతిస్తున్నామని తెలిపారు. మరోవైపు సమ్మెల్లో పాల్గొనే వారిని ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేస్తామని ఆర్టీసీ ఎండీ ఆదేశాలు జారీ చేశారు. -
బస్సొస్తదా.. రాదా?
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. వరుసగా రెండో రోజు కూడా అధికారుల కమిటీ, కార్మిక సంఘాల జేఏసీ మధ్య చర్చలు విఫలం కావటంతో ఇక సమ్మె తథ్యమన్న భావన వ్యక్తమవుతోంది. తమ డిమాండ్లకు అధికారుల కమిటీ సానుకూలం వ్యక్తం చేయనందున, ఆర్టీసీ పరిరక్షణకు సమ్మె చేయక తప్పదని, ముందుగా ప్రకటించినట్లు శనివారం నుంచి సమ్మె మొదలవుతుందని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ స్పష్టం చేసింది. తమ డిమాండ్లకు అనుకూలంగా నిర్ణయం వెల్లడించేలా తదుపరి చర్చలు ఉంటే కచ్చితంగా హాజరవుతామని, లేదంటే శనివారం ఉదయం 5 గంటల నుంచి సమ్మె మొదలవుతుందని ప్రకటించి కార్మిక సంఘాలు చర్చల నుంచి నిష్క్రమించాయి. శుక్రవారం కూడా చర్చలు జరుపుతామని అధికారుల కమిటీ ప్రకటించింది. సమ్మెకు దిగితే ఎస్మా ప్రయోగించటంతో పాటు ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని వెల్లడించింది. కమిటీ హామీ లేఖ.. కార్మిక సంఘాలతో చర్చించటంతో పాటు వారి డిమాండ్లను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వటం కోసం మంత్రివర్గం ఏర్పాటు చేసిన ముగ్గురు ఐఏఎస్ అధికారుల కమిటీ కార్మిక సంఘాలు బుధవారం జరిపిన తొలిరోజు చర్చలు విఫలం కావటంతో గురువారం మధ్యాహ్నం 3 టలకు మరో దశలకు ఆహ్వానించింది. దీంతో ఎర్రమంజిల్‌లోని రోడ్లు, భవనాల శాఖ ప్రధాన కార్యాలయానికి కార్మిక సంఘాల జేఏసీ ప్రతినిధులు వచ్చారు. అప్పటికే త్రిసభ్య కమిటీ సభ్యులు సోమేశ్‌కుమార్, సునీల్‌శర్మ, రామకృష్ణారావు అక్కడ ఉన్నారు. అయితే వెంటనే చర్చలు ప్రారంభించకుండా సాయంత్రం వరకు ఆపారు. సమ్మె ప్రారంభమైతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై రవాణా శాఖ అధికారులతో ఈలోపు ఆ శాఖ కమిషనర్, త్రిసభ్య కమిటీ సభ్యుడు సునీల్ శర్మ సమావేశమయ్యారు. దీన్ని తప్పుపడుతూ జేఏసీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో జేఏసీలోని 4 సంఘాల నుంచి ఒక్కొక్కరు చొప్పున నలుగురు ప్రతినిధులతో రెండుసార్లు కమిటీ సభ్యులు మాట్లాడారు. డిమాండ్ల పరిష్కారానికి కొంత సమయం అవసరమని, ప్రభుత్వం వాటి పరిష్కారం కోసం చర్యలు తీసుకునేందుకు సానుకూలంగానే ఉందని చెప్పారు. తొలిరోజు చెప్పినట్లే అదే విషయం చెప్పటం సరికాదని, తాము కోరినట్లు స్పష్టమైన హామీ ఇవ్వాలని ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఇలా రెండు మూడు సార్లు స్పల్పకాలిక చర్చలు నడిచాయి. కానీ ఫలితం తేలలేదు. దీంతో తాము చర్చల నుంచి వైదొలగబోతున్నట్లు జేఏసీ సంకేతాలిచ్చింది. దీంతో రాత్రి 9 గంటల సమయంలో కమిటీ సభ్యులు లిఖితపూర్వక హామీ పత్రాన్ని జేఏసీకి అందజేసింది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై సూత్రప్రాయ అంగీకారం తెలుపుతూ కమిటీని నియమిస్తున్నట్లు ప్రకటించాలని, మిగతా ప్రధాన డిమాండ్లకు కూడా స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ పరిరక్షణకు ప్రభుత్వం సిద్ధంగా లేనట్లే భావించాల్సి ఉంటుందని పేర్కొంటూ చర్చలు విఫలమైనట్లు జేఏసీ ప్రకటించింది. ఉబెర్, ఓలా వాహనాలు.. హైదరాబాద్‌లో విద్యాసంస్థల బస్సులు, ఉబెర్, ఓలా వాహనాలను కూడా రంగంలోకి దింపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేటు బస్సులు, వ్యాన్లకు రూ.300 రుసుముతో వారం రోజుల తాత్కాలిక పర్మిట్లు అప్పగించి స్టేజీ క్యారియర్లుగా తిప్పాలని నిర్ణయించారు. ఆర్టీసీ చార్జీలే వసూలు చేసే నిబంధనతో ఇందుకు అనుమతివ్వాలని నిర్ణయించారు. సెవన్ సీటర్ ఆటోలను సిటీలోకి అనుమతించాలని భావిస్తున్నారు. పువ్వాడ సమీక్ష.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఆర్టీసీ, రవాణా శాఖ ఉన్నతాధికారులతో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సమీక్షించారు. తాత్కాలిక పద్ధతి లో డ్రైవర్లను తీసుకునేందుకు వీలుగా ప్రకటనలు విడుదల చేశారు. సమ్మెకు సమాయత్తమవుతున్న తరుణంలో ఆర్టీసీ కార్మి కులు, ఉద్యోగులకు ఇప్పటివరకు జీతాలు విడుదల చేయలేదు. కాగా, కార్మికసంఘాలతో శుక్రవారం మధ్యాహ్నం కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ రాజీ చర్చలు జరపనున్నారు. కాగా ఆర్టీసీ కార్మిక సంఘాలు శుక్రవారం నుంచి సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో సమ్మె నివారణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని వివిధ వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ముందస్తు చర్యలు ఆర్టీసీలో ఉన్న 2,200 అద్దె బస్సులకు తోడు ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్లతో మరో 3 వేల బస్సులు తిప్పేలా ఏర్పాట్లు చేశారు కనీసం పదో తరగతి ఉత్తీర్ణత ఉన్న వారిని కండక్టర్లుగా తీసుకోవాలని నిర్ణయించారు. ఇలాంటి వారిని వీలైనంత ఎక్కువ మందిని శుక్రవారం వరకల్లా గుర్తించాలని అధికారులను ఆదేశించారు రోజుకు డ్రైవర్‌కు రూ.1,600, కండక్టర్‌కు రూ. 1,000 ఇవ్వాలని తేల్చారు ప్రైవేటు బస్సులు, లారీలు నడిపే వారి వివరాలు సేకరిస్తున్నారు. ఆర్టీసీ రిటైర్డ్ డ్రైవర్లు, కండక్టర్లను పిలిపిస్తున్నారు నేడూ చర్చలుంటాయి: త్రిసభ్య కమిటీ కార్మిక సంఘాల జేఏసీతో శుక్రవారం కూడా చర్చిస్తాం. 26 డిమాండ్ల పరిష్కారం కోసం చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇదే విషయాన్ని పేర్కొంటూ వారికి లిఖితపూర్వక హామీ ఇచ్చాం. ఇప్పటికిప్పుడు పరిష్కరించమంటే సాధ్యం కాదు. సమ్మెకు దిగితే ఎస్మాకు సిద్ధం. ప్రయాణికులకు ఇబ్బందులు కాకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. మీడియాతో మాట్లాడుతున్న అశ్వత్థామరెడ్డి ఇలాగైతే సమ్మె తథ్యమే: జేఏసీ ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందనటం తప్ప ఒక్క డిమాండ్‌కూ హామీ ఇవ్వటం లేదు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ఆలోచన లేదన్న అనుమానం కలుగుతోంది. నెలన్నర సమయం కావాలని చెప్పిన అధికారులు హామీ పత్రంలో వీలైనంత తొందరగా అని తప్ప ఎక్కడా నిర్దిష్ట గడువు పేర్కొనలేదు. సమస్య పరిష్కారం కోసం అధికారుల్లో చిత్తశుద్ధి కనిపించలేదు. ఇలాగే ఉంటే సమ్మె తథ్యం. ఎస్మాకు భయపడం. కార్మిక సంఘాల జేఏసీ ప్రధాన డిమాండ్లు ఇవే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఆర్టీసీకి బకాయిపడ్డ మొత్తాన్ని ప్రభుత్వం వెంటనే చెల్లించాలి, భవిష్యత్తులో పెండింగ్ పెట్టకుండా నిధులు విడుదల చేయాలి. డీజిల్ భారాన్ని ప్రభుత్వమే భరించాలి, మోటార్వెహికల్ ట్యాక్స్‌ను రద్దు చేయాలి. అన్ని రకాల పన్నులను మినహాయించాలి. కండక్టర్ డ్రైవర్లకు ఉద్యోగభద్రత కల్పించాలి. వేతన సవరణ వెంటనే చేపట్టాలి. 2017 ఏప్రిల్ నుంచి బకాయిలు చెల్లించాలి. ఆర్టీసీలోని అన్ని కేటగిరీల్లో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి. సీసీఎస్, పీఎఫ్, ఎస్ఆర్బీఎస్, ఎస్బీటీల బకాయిలను వెంటనే విడుదల చేయాలి. చనిపోయిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు వెంటనే ఉద్యోగం ఇవ్వాలి. ఆర్టీసీలో అద్దె బస్సులను రద్దు చేసి కాలం చెల్లిన వాటి స్థానంలో కొత్త బస్సులు కొనాలి. కేంద్రప్రభుత్వం బ్యాటరీ బస్సులకు ఇచ్చే రాయితీ ప్రయోజనం ప్రైవేటు సంస్థలకు కాకుండా ఆర్టీసీకే చెందేలా ఆ బస్సులు సొంతంగా సమకూర్చుకోవాలి. తార్నాక ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలి. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేటు వాహనాలను నియంత్రించాలి. మెట్రో రైలుకు ఇచ్చినట్లు వయబిలిటీ గ్యాప్ ఫండ్‌ను ఆర్టీసీకి కూడా ఇవ్వాలి. -
ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు విఫలం
సరిగ్గా దసరా సమయంలో ఆర్టీసీ బస్సుల నిలుపుదల సరికాదు. మీ డిమాండ్ల పరిష్కారానికి చొరవ చూపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సమ్మె ఆలోచన విరమించుకోండి. – ఐఏఎస్ అధికారుల త్రిసభ్య కమిటీ నిర్దిష్ట హామీ లేకుండా సమ్మెను విరమించుకోమంటే ఎలా.. మా డిమాండ్లలో ఆర్టీసీ యాజమాన్యం పరిష్కరించ గలిగేవే ఎక్కువ. వాటిని తేల్చి మిగతావాటిపై హామీ ఇవ్వండి. – కార్మిక సంఘాలు సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మెను తప్పించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐఏఎస్ అధికారులతో కూడిన త్రిసభ్య కమిటీ, ఆర్టీసీ కార్మిక సంఘాల మధ్య బుధవారం జరిగిన తొలిదశ చర్చలు విఫలమయ్యాయి. సమ్మెకు సిద్ధమైన కార్మిక సంఘాలు ప్రభుత్వం ముందుంచిన 26 డిమాండ్లలో ఏ ఒక్కదానికి కూడా కమిటీ నుంచి నిర్దిష్ట హామీ రాకపోవటం, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, కండక్టర్, డ్రైవర్ల ఉద్యోగ భద్రతకు సంబంధించిన ప్రతిపాదన లాంటి కీలక అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందీలేనిదీ చెప్పకపోవటం, అసలు ప్రభుత్వానికి ఈ కమిటీ నివేదిక ఎప్పట్లోగా ఇస్తుందో కాల పరిమితి వెల్లడించకపోవటంపై కార్మిక సంఘాలు ప్రశ్నించాయి. ఇలాంటివేమీ లేకుండా సమ్మె ఆలోచన విరమించుకోవాలని చెప్పడాన్ని తప్పు పడుతూ, సమ్మె విషయంలో తమ ఆలోచన మారదని పేర్కొన్నాయి. దీంతో ఈ చర్చలు విఫలమైనట్లు స్పష్టమవుతోంది. దీంతో గురువారం మధ్యాహ్నం మరోసారి చర్చలకు రావాల్సిందిగా కార్మిక సంఘాలకు సూచించాయి. ఆ చర్చలకు తాము హాజరవుతామని, అందులో కొన్ని డిమాండ్లకైనా హామీ రావటంతో పాటు ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వానికి నివేదిక ఎప్పట్లోగా ఇస్తారు.. వాటిపై ప్రభుత్వం ఎప్పట్లోగా స్పష్టత ఇస్తుందో వెల్లడిస్తే సమ్మె విరమణకు సిద్ధమని కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి. హడావుడి చర్చలతో.. మంగళవారం రాత్రి పొద్దు పోయేవరకు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆర్టీసీ సమ్మె అంశంపై ప్రధాన చర్చ జరిగిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి సూచనతో సీనియర్ ఐఏఎస్ అధికారులు సోమేశ్‌కుమార్, రామకృష్ణారావు, సునీల్‌శర్మలతో కమిటీని ఏర్పాటు చేసిన మంత్రివర్గం.. కార్మిక సంఘాలతో చర్చించాలని ఆదేశించింది. దీంతో పాటు ఆర్టీసీ పరరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక కోరింది. ఈ మేరకు కమిటీ ప్రతినిధులు బుధవారమే రంగంలోకి దిగారు. 5వ తేదీ ఉదయం షిఫ్ట్ నుంచే సమ్మె చేయనున్నట్లు కార్మిక సంఘాలు ఇప్పటికే తేల్చి చెప్పినందున వెంటనే చర్చలకు సిద్ధమయ్యారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు రోడ్లు భవనాల శాఖ ప్రధాన కార్యాలయంలో చర్చలకు గుర్తింపు కార్మిక సంఘంతో కూడిన జేఏసీని ఆహ్వానించారు. అందులో భాగస్వామ్యం ఉన్న నాలుగు సంఘాల ప్రతినిధులు చర్చలకు హాజరయ్యారు. దాదాపు గంట సేపు అధికారులు చర్చలు జరిపారు. ‘కార్మిక సంఘాలు ప్రభుత్వం ముందుంచిన 26 డిమాండ్లను పరిశీలించాం. వాటి విషయంలో చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉంది. అందులో ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం లాంటి చాలా కీలకమైన అంశాలున్నాయి. వాటిపై వెంటనే స్పందించాలని డిమాండ్ చేయటం సబబు కాదు. అందుకు కొంత సమయం అవసరం. మరోవైపు ప్రజలు దసరా పండుగ కోసం ఊళ్లకు పయనమవుతున్న తరుణంలో సమ్మె చేస్తామనటం కూడా సబబు కాదు. ప్రభుత్వం ఆర్టీసీ పరిరక్షణ, కార్మికుల డిమాండ్లపై చర్యలు తీసుకునేందుకు సానుకూలంగానే ఉన్నందున సమ్మె యోచన విరమించుకోండి. తాము అన్ని విషయాలను అధ్యయనం చేసి ప్రభుత్వానికి కూలంకషంగా నివేదిక ఇస్తాం. ఆ సమయంలో చర్యలు తీసుకోని పక్షంలో సమ్మెపై నిర్ణయం తీసుకోండి’అని కమిటీ సభ్యులు కార్మిక సంఘాల దృష్టికి తెచ్చారు. అయితే కమిటీ ఏర్పాటైన వెంటనే ఈ చర్చలకు సిద్ధం కావటంతో.. డిమాండ్లపై హామీ ఇవ్వాలా వద్దా అన్న విషయంలో స్పష్టత లేకుండా పోయింది. అందులో స్వయంగా ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ ఉన్నా.. క్లారిటీ లేకుండా పోవటంపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎలాంటి హామీ లేకుండానే.. గతంలో ఆర్టీసీ అంశాలకు సంబంధించి ఇలాగే కొన్ని కమిటీలు వేశారని, అందులో కొన్ని నివేదికలు ఇచ్చినా చర్యల్లేవని, అసలు కొన్ని నివేదికలే ఇవ్వలేదని, ఈ నేపథ్యంలో ఈ కమిటీని ఎలా పరిగణనలోకి తీసుకోవాలని కార్మిక సంఘాలు అసహనం వ్యక్తం చేశాయి. ‘ప్రభుత్వం ముందుంచిన 26 డిమాండ్లలో 22 డిమాండ్లకు ఆర్టీసీ యాజమాన్యమే హామీ ఇచ్చే అవకాశముంది. అవి అధికారుల స్థాయిలో నిర్ణయం తీసుకోదగ్గవి.. అయినా కూడా ఒక్క హామీ కూడా ఇవ్వకుండా సమ్మెకు వెళ్లొద్దని చెప్పటం సరికాదు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, వేతనాల సవరింపు, ఆర్టీసీ బలోపేతం లాంటి కీలక అంశాలు ప్రభుత్వానికి వదిలేసి, మిగతా వాటిపై స్పష్టమైన హామీ ఇవ్వాలి. డ్రైవర్, కండక్టర్ల ఉద్యోగ భద్రతకు సంబంధించి ఏపీ ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులు జారీ చేసింది. దాన్ని అనుసరించి సర్క్యులర్ ఇచ్చేందుకు అర గంట సమయం చాలు. ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు వెంటనే రూ.600 కోట్లు విడుదల చేయండి. అసలు కమిటీ ఎన్నిరోజుల్లో నివేదిక ఇస్తుంది.. దానిపై ప్రభుత్వం ఎంత కాలంలో చర్యలు తీసుకుంటుందో స్పష్టం చేయండి.. సమ్మె విషయాన్ని పునరాలోచించుకుంటాం’అని సంఘాలు పేర్కొన్నాయి. మరోసారి పిలిచిన సునీల్‌శర్మ.. చర్చల అనంతరం కార్మిక సంఘాలు నిష్క్రమించిన అనంతరం సాయంత్రం ఆరు గంటలకు మరోసారి రావాల్సిందిగా వారికి సమాచారం అందింది. దీంతో మరో దశ చర్చలుంటాయని భావించి సంఘాల ప్రతినిధులు వచ్చారు. కేవలం కమిటీలోని సునీల్‌శర్మ ఒక్కరే వారితో చర్చించారు. డిమాండ్లపై సీఎం సానుకూలంగా ఉన్నారని, సమ్మెకు వెళ్తే ఆయన ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉందని, సమ్మె యోచన విరమిస్తే, తొందర్లో సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నిర్ధిష్ట హామీ ఇస్తే తప్ప సమ్మె యోచన విరమించబోమని, డిమాండ్ల పరిష్కానికి పట్టే సమయం కూడా స్పష్టం చేయాలని మరోసారి పేర్కొని కార్మిక సంఘాల నేతలు బయటకొచ్చేశారు. చర్చల్లో టీఎంయూ నేతలు అశ్వత్థామరెడ్డి, థామస్‌రెడ్డి, తిరుపతి, ఈయూ నేత రాజిరెడ్డి, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నేత వీఎస్‌రావు, సూపర్వైజర్స్ అసోసియేషన్ నేత వాసుదేవరావు పాల్గొన్నారు. -
తెలంగాణ ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్
-
వచ్చే నెల 6నుంచి ఆర్టీసీలో సమ్మె
-
ఆర్టీసీలో ప్రై‘వేటు’
సాక్షి, అమరావతి: ఆర్టీసీ ప్రైవేటీకరణకు యాజమాన్యం మరో అడుగు ముందుకేస్తూ.. సిబ్బంది కుదింపు యత్నాలను ముమ్మరం చేసింది. ఇప్పటికే ఇంజినీరింగ్ విభాగంలో సిబ్బందిని కుదించింది. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు వీల్లేకుండా.. ప్రైవేటు సిబ్బందిని నియమించుకునేలా తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. గురువారం గుట్టుచప్పుడు కాకుండా జారీచేసిన ఈ ఉత్తర్వులపై సర్వత్రా విమర్శలొస్తున్నాయి. తొలి దశలో డ్రైవర్ల నియామకాలకు పచ్చ జెండా ఊపింది. ఆర్టీసీ అధికారులు వినియోగిస్తున్న వాహనాలకు ప్రైవేటు సిబ్బందిని నియమించుకునేలా జారీచేసిన ఉత్తర్వులపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. సిబ్బంది కుదింపు చర్యల్లో ఇది భాగమేనని యూనియన్ నేతలు ఆరోపిస్తున్నారు. గత ఐదేళ్లలో ఆర్టీసీలో 12 వేల మంది సిబ్బంది పదవీ విరమణ చేసినా.. ఒక్క ఉద్యోగాన్నీ భర్తీ చేయకపోవడాన్ని బట్టి చూస్తే సిబ్బందిని తగ్గించే ఎత్తుగడకు ఇది నిదర్శనంగా పేర్కొంటున్నారు. ఆర్టీసీలో అధికారులు, సంస్థ సొంతంగా వినియోగించే వాహనాలకు ప్రైవేటు డ్రైవర్లను నియమించుకునేందుకు యాజమాన్యం జారీచేసిన ఉత్తర్వులను వెనక్కు తీసుకోకుంటే ఆందోళనబాట పడతామని యూనియన్ నేతలు శుక్రవారం హెచ్చరించారు. సిబ్బంది కుదింపునకు సకల యత్నాలు వీఆర్ఎస్ను తెరపైకి తెచ్చి వ్యతిరేకత వ్యక్తం కావడంతో వెనక్కు తగ్గిన యాజమాన్యం.. ఆర్టీసీ నష్టాలకు కార్మికులే కారణమని వారిని తగ్గించేందుకు పలు యత్నాలు చేస్తోంది. ఒకేసారి అన్ని విభాగాల్లో పోస్టుల్ని కుదిస్తే కార్మిక సంఘాల నుంచి వ్యతిరేకత వస్తుందని భావించి ఒక్కో విభాగంలో రెగ్యులర్ పోస్టులకు ఎసరు పెడుతోంది. దీంతో ఇకపై ఏ విభాగంలో ఖాళీలున్నా భర్తీ చేసేది లేదని తేల్చి చెబుతోంది. కేవలం డ్రైవర్ ఉద్యోగాలనే కారుణ్య నియామకం కింద చేపడతామని ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే భారీ వాహన లైసెన్స్ పొందేందుకు అభ్యర్థులకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. ప్రైవేటీకరణ దిశగా వేగంగా ముందుకెళుతున్న ఆర్టీసీ.. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటి వరకు నాలుగువేల మంది కండక్టర్ల ఉద్యోగాలను భర్తీ చేయలేదు. ఇంజినీరింగ్‌లో 40% పోస్టుల కుదింపు ఆర్టీసీలో ప్రధానంగా ఆపరేషన్స్, మెకానికల్, పర్సనల్, సివిల్ ఇంజినీరింగ్, సోŠట్ర్స్ అండ్ పర్చేజ్ విభాగాలున్నాయి. ఆపరేషన్స్ విభాగంలో ఇప్పటివరకు ఒక్క కండక్టర్ పోస్టును కూడా భర్తీ చేయలేదు. సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో 40 శాతం పోస్టుల్ని ఏకంగా రద్దు చేసింది. ఇకపై ఈ పోస్టుల్ని భర్తీ చేసేది లేదని ఏకంగా నోటిఫికేషన్ జారీచేసింది. ఆర్టీసీలో సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, అసిస్టెంట్ ఇంజినీర్లు కలిపి మొత్తం రాష్ట్రంలో 133 మంది ఉన్నారు. వీటిలో 54 పోస్టుల్ని రద్దు చేస్తూ తాజాగా నోటిఫికేషన్ జారీచేసింది. అంటే ఈ విభాగంలో 40 శాతం పోస్టుల్ని రద్దు చేసిందన్నమాట. 54 పోస్టుల్లో 38 పోస్టుల్ని ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేసేందుకు అనుమతిచ్చారు. పోస్టుల అవసరం లేకుంటే ఔట్ సోర్సింగ్‌లో ఎందుకు భర్తీ చేస్తున్నారన్న ప్రశ్న కార్మిక సంఘాల నుంచి వ్యక్తం కావడం గమనార్హం. ఆర్టీసీలో ఇంజినీరింగ్ విభాగానికి ప్రాధాన్యం ఉంది. బస్టాండ్ల నిర్మాణం, బస్ స్టేషన్లలో మౌలిక సదుపాయాల నిర్వహణ తదితరాలన్నీ ఈ విభాగం నిర్వహించాల్సిందే. ఎలక్ట్రిక్ పనులనూ ఈ విభాగమే పర్యవేక్షించాలి. అటువంటి కీలక విభాగంలో పోస్టుల్ని రద్దు చేయడంపై సర్వత్రా విమర్శలొస్తున్నాయి. ప్రైవేటు సిబ్బందిని నియమించుకునేందుకు గురువారం ఆర్టీసీ యాజమాన్యం జారీచేసిన సర్క్యులర్ ఆర్టీసీ ఉద్యోగుల చర్చలు 22కి వాయిదా సాక్షి, అమరావతి: ఆర్టీసీ ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించి జరుగుతున్న చర్చల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. విజయవాడలోని ఆర్టీసీ భవన్లో ఐదోసారి జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. జనవరి 22న మరోసారి భేటీ కావాలని యాజమాన్యం, గుర్తింపు సంఘం నేతలు నిర్ణయించారు. 20 శాతం ఫిట్మెంట్ ఇస్తామని యాజమాన్యం ప్రకటించగా, 50 శాతం ఫిట్మెంట్ ఇవ్వాల్సిందేనని గుర్తింపు సంఘం ఎంప్లాయిస్ యూనియన్ నేతలు పట్టుబట్టారు. 50 శాతం ఫిట్మెంట్ ఇవ్వకపోతే సమ్మెకు వెనుకాడబోమని ఈయూ నేతలు యాజమాన్యానికి తేల్చి చెప్పారు. చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడటంతో ఈ నెల 22న మరోమారు సమావేశం కావాలని నిర్ణయించారు. ఇప్పటివరకు జరిగిన చర్చల ద్వారా అంగీకరించిన కారుణ్య నియామకాల ప్రక్రియను ఈ నెలాఖరు నుంచి ప్రారంభిస్తామని యాజమాన్యం హామీనిచ్చింది. కాంట్రాక్ట్ కార్మికుల రెగ్యులరైజేషన్ వెంటనే చేస్తామని ఎండీ సురేంద్రబాబు హామీనిచ్చారు. 2016 లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ ఈ నెల 24న చెల్లించేందుకు అంగీకరించారు. అయితే ఫిట్‌మెంట్‌పై యాజమాన్యానికి, గుర్తింపు సంఘానికి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో శనివారం అన్ని కార్మిక సంఘాలతో సమావేశం కావాలని నిర్ణయించామని ఈయూ నేతలు దామోదరరావు, వైవీ రావులు తెలిపారు. -
ఆర్టీసీ ఎన్నికల్లో బస్సు జోరు...
శ్రీకాకుళం అర్బన్: ఆర్టీసీ గుర్తింపు సంఘం యూనియన్ ఎన్నికల్లో బస్సు దూసుకుపోయింది. శ్రీకాకుళం నెక్ రీజియన్‌తోపాటు జిల్లాలో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్(బస్సు గుర్తు) విజయఢంకా మోగించింది. ఆ యూనియన్ కార్మికులు సంబరాల్లో మునిగితేలారు. నెక్ రీజియన్‌లోని 9 డిపోల కుగాను ఎంప్లాయీస్ యూనియన్ ఏడింటిని కైవసం చేసుకుని విజయకేతనం ఎగురవేసింది. శ్రీకాకుళం ఒకటో డిపోలో 230 ఓట్లు ఈయూకు, 232 ఎన్ఎంయూకు వచ్చాయి. రెండు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి. ఈ రెండు ఓట్లు ఈయూకి చెందినవిగా చెబుతున్నారు. దీంతో ఈ డిపో టైగా ముగిసే అవకాశం ఉంది. టైగా వచ్చిన ఫలితం రాష్ట్రస్థాయిలో గెలిచిన యూనియన్‌కే దక్కుతుందని తెలిసింది. రీజియన్‌లోని తొమ్మిది డిపోల్లో 3, 930ఓట్లకు గాను 2, 220 ఓట్లు సాధించి ఇయూ విజయబావుటా ఎగురవేసింది. ఇయూ కార్యాలయం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ చుట్టూ విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. కార్యకర్తలంతా తమ యూనియన్ నాయకులను అభినందించారు. బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. హడావుడి : గురువారం ఉదయం 5గంటల నుంచే ఎన్నికలు ప్రారంభమయ్యాయి. కార్మికులంతా ఉత్సాహంగా ఓటింగులో పాల్గొన్నారు. ఉదయాన్నే ఇతర ప్రాంతాలకు విధుల నిమిత్తం వెళ్ళే బస్సు కండక్టర్లు, డ్రైవర్లు తమ ఓటుహక్కును వినియోగించుకుని వెళ్ళిపోయారు. జిల్లాలోని అన్ని డిపోల పరిధిలో మద్యాహ్నం 12గంటలకే 70శాతంకు పైగా ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. మెజారిటీ ఇలా :జిల్లా పరిధిలోని ఐదు డిపోల్లో డిపోల వారీగా ఓట్ల వివరాలు : జిల్లాలో 5 డిపోలకు గాను రెండు డిపోలను ఎన్ఎంయూ, మూడు డిపోలను ఇయూ గెలుచుకుంది. శ్రీకాకుళం ఒకటి(2 ఓట్లు మెజారిటీ), రెండు డిపో(68 ఓట్లు మెజారిటీ)ల్లో ఎన్ఎంయూ గెలిచింది. పాలకొండ డిపోలో(121 ఓట్లు మెజారిటీ), టెక్కలి డిపోలో(44 ఓట్లు మెజారిటీ), పలాస డిపోలో(164 ఓట్లు మెజారిటీ) ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ కైవసం చేసుకుంది. కార్మికుని విజయం: ఇది కార్మికుని విజయం. రాష్ట్రంలో కూడా గుర్తింపు యూనియన్‌గా గెలుస్తాం. కార్మికులకు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా లొంగక బస్సు గుర్తుకే ఓటువేసి ఇయూను గెలిపించారు. ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం. పలిశెట్టి దామోదరరావు, ఇయూ రాష్ట్ర ఉపప్రధానకార్యదర్శి -
కేసీఆర్ కుట్ర పన్నుతున్నారు..
కరీంనగర్ : ఆర్టీసీ నష్టాల్లో ఉందంటూ బస్ ఛార్జీలు పెంచేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని మాజీమంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆరోపించారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీ జేఏసీకి అప్పగిస్తే ఏడాదిలోగా లాభాల్లోకి తెస్తామని ఆయన సోమవారమిక్కడ అన్నారు. ఆర్టీసీ కార్మికులు రోడ్డెక్కడానికి యాజమాన్యం, ప్రభుత్వమే కారణమని జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్ 43 శాతం ఇచ్చేంతవరకు కార్మికుల పక్షాన పోరాడతామని ఆయన స్పష్టం చేశారు. -
సమ్మె కొనసాగిస్తాం, వెనక్కి తగ్గేది లేదు..
హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మెను కొనసాగిస్తామని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. తమ సమ్మె చట్టబద్ధమేనని, హైకోర్టులో మంగళవారం తమ వాదనలు వినిపిస్తామని ఆయన సోమవారమిక్కడ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరిన మూడు వారాల గడువు ఇవ్వలేమని ఎంప్లాయిస్ యూనియన్ నేత పద్మాకర్ తెలిపారు. సమ్మె జరుగుతున్నప్పుడు ఆర్టీసీలో నియమకాలు చేపట్టడం చట్టవిరుద్ధమన్నారు. కాంట్రాక్ట్ కార్మికులు కూడా తాము చేస్తున్న సమ్మెకు మద్దతు ఇవ్వాలని పద్మాకర్ కోరారు. ఆర్టీసీ ఆదాయాన్ని పన్నుల రూపంలో ప్రభుత్వం దండుకుంటుందని వారు ఆరోపించారు. సమ్మె కొనసాగిస్తామని, వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. -
43 శాతం ఫిట్మెంట్ ప్రకటించాల్సిందే: ఈయూ
కడప రూరల్: ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగానే సమ్మెకు దిగాల్సి వచ్చిందని ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే ఆర్టీసీ కార్మికులకు 43 శాతం ఫిట్మెంట్ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. కడపలోని వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులు కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నా ఫిట్మెంట్ విషయంలో యాజమాన్యం, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. గత ప్రభుత్వం 43 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటిస్తామని హామీ ఇచ్చినా అది అమలు కాలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా సమస్య పరిష్కారానికి చొరవ చూపడం లేదని ఆరోపించారు. సమ్మె మొదలైనా ఆర్టీసీ యాజమాన్యంలో చలనం లేదన్నారు. 43 శాతం ఫిట్మెంట్తోపాటు ఇతర సమస్యలను పరిష్కరించకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమ్మెకు అన్ని ఆర్టీసీ సంఘాలు మద్దతు తెలపాలని, ప్రజలు కూడా తమకు సహకరించాలని కోరారు. -
ఆర్టీసీలో సమ్మె సైరన్
ఒంగోలు: ఆర్టీసీలో బుధవారం ఉదయం తొలి సర్వీసు నుంచే సమ్మె సైరన్ మోగనుంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్న 8 డిపోల్లో కార్మికులు సమ్మె సన్నాహక కార్యకలాపాల్లో మునిగిపోయారు. మరో వైపు గుర్తింపు సంఘంగా ఉన్న ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆర్టీసీ యాజమాన్యంతో చర్చలు జరిపింది. తప్పనిసరి పరిస్థితుల్లో తాము సమ్మెకు వెళుతున్నట్లు ప్రకటించింది. ఆర్టీసీ అధికారులు వారికి నచ్చజెప్పేందుకు చేసిన యత్నాలు విఫలం కావడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో మునిగిపోయారు. జిల్లాలో పరిస్థితి ఇదీ: ఆర్టీసీ ప్రకాశం రీజియన్ పరిధిలో 701 ఆర్టీసీ బస్సులు, 99 అద్దె బస్సులు కలిపి 3.25 లక్షల కిలోమీటర్లు నడుపుతున్నారు. ఇందు కోసం మొత్తం 4250 మంది కార్మికులు, ఉద్యోగులు వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. అందులో 1900 మంది డ్రైవర్లు, 1600 మంది కండక్టర్లు ఉన్నారు. అయితే ఇప్పటికే గుర్తింపు సంఘమైన ఎంప్లాయీస్ యూనియన్ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతన సవరణ చేయాలంటూ డిమాండ్ చేస్తూ వచ్చింది. అయితే తాజాగా గత వేతన సవరణల కాలంలో నష్టపోయిన ఫిట్మెంట్ 19 శాతాన్ని వదులుకొని ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు ఇచ్చిన 43 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశాయి. మరో వైపు నేషనల్ మజ్దూర్ యూనియన్ కూడా కార్మికుల పక్షానే నిలవాలని నిర్ణయించింది. ఎంప్లాయీస్ యూనియన్ చేపట్టిన సమ్మెకు సంఘీభావాన్ని ప్రకటించి తమ కార్మికులను, ఉద్యోగులను కూడా బుధవారం నుంచి విధులకు దూరంగా ఉండాలని ఆదేశించింది. మంగళవారం సాయంత్రం ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్‌తో కలిసి స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నాయకులు కూడా సంయుక్తంగా ధర్నా నిర్వహించి కార్మికుల న్యాయమైన కోర్కెలు ఫలించేవరకు తాము విధులకు హాజరుకామంటూ స్పష్టం చేశారు. అయితే ఆర్టీసీలో తెలుగుదేశం పార్టీ అనుబంధ యూనియన్ అయిన ఆర్టీసీ కార్మిక పరిషత్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇంకా తెలియాల్సి ఉంది. సమ్మె వల్ల రోజుకు కోటి నష్టం: ఆర్టీసీలో సాదారణ రోజుల్లో రోజుకు రూ.80 లక్షల వరకు ఆదాయం వస్తుంది. అయితే ప్రస్తుతం వేసవి సెలవుల కారణంగా రద్దీ పెరిగింది. మరో వైపు వివాహాలు, శుభముహూర్తాలు పెరిగిపోయాయి. దీంతో ప్రయాణీకుల సంఖ్య ఎక్కువగానే ఉంది. అయిదు రోజుల నుంచి రోజుకు రూ.20 లక్షల అదనపు ఆదాయం లభిస్తోంది. ఈ దశలో ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మెకు దిగడంతో ఆర్టీసీ యాజమాన్యానికి శరాఘాతంగా మారింది. ఆర్టీసీ అధికారులు యాజమాన్య ఆదేశాల మేరకు ఇటు రవాణాశాఖ అధికారులతోను, మరో వైపు పోలీసుశాఖ ఉన్నతాధికారులకు తమకు సహకరించాలంటూ విజ్ఞప్తులు పంపారు. ప్రధానంగా ప్రయాణీకులు ఇబ్బంది పడకుండా అన్ని బస్సులను నడిపేందుకు అవసరమైన సహకారాన్ని అందించాలని ఆర్టీసీ కోరింది. 2001 నాటి పరిస్థితులు పునరావృతం అవుతాయంటున్న కార్మిక సంఘాలు: ఈ విషయంపై కార్మిక సంఘాలు మాత్రం తీవ్రంగానే స్పందిస్తున్నాయి. ఎట్టి పరిస్థితులలో 43 శాతం ఫిట్‌మెంట్‌కు ఒక్క శాతం తగ్గినా అంగీకరించేది లేదని స్పష్టం చేస్తున్నాయి. దానికి తోడు 2013 ఏప్రిల్ ఒకటి నుంచి ఫిట్‌మెంట్‌ను వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నాయి. సమ్మె చేయాలనేది తమ అభిమతం కాదని, రెండేళ్లకు పైగా వేచి చూసినా యాజమాన్యం, ప్రభుత్వం స్పందించకపోవడం వల్లే తాము తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెకు వెళుతున్నట్లు కార్మిక సంఘ నేతలు ప్రకటించారు. సంప్రదింపుల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలి: ఆర్టీసీ ఆర్ఎం వి.నాగశివుడు సంప్రదింపుల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆర్టీసీకి కలిసివచ్చే కాలంలో కార్మికులు సమ్మెలోకి వెళితే సంస్థ మరింత సంక్షోభంలోకి వెళుతుంది. పునరాలోచించుకోవాలి. ఒక వేళ కార్మికులు సమ్మెకు సిద్ధపడితే యాజమాన్యం ఆదేశాల మేరకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టేందుకు దృష్టి సారించాం. -
నిరవధిక సమ్మెకు సిద్ధం కావాలి
తిరుమలకు సైతం బస్సులు బంద్ ఆర్టీసీ ఈయూ రాష్ట్ర నేత దామోదరరావు పిలుపు తిరుపతి కల్చరల్: ఆర్టీసీ కార్మికులకు ఫ్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 43 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మే 6 నుంచి జరుగబోవు నిరవధిక ఆర్టీసీ సమ్మెకు కార్మికులందరూ సిద్ధం కావాలని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి మలిశెట్టి దామోదరరావు పిలుపు నిచ్చారు. ఆర్టీసీ బస్టాండ్‌లోని గ్యారేజ్ వద్ద ఏర్పాటు చేసిన సమ్మె సన్నాహాక సభకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమ్మె పోస్టర్లను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ కార్మికులకు ఫిట్మెంట్ కల్పించాలని డిమాండ్ చేశామన్నారు. ఈ మేరకు ఈ నెల 2న సమ్మె ఎంప్లాయిస్ యూనియన్, ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో సమ్మె నోటీసు ఇచ్చామన్నారు. దీనిపై ఇప్పటి వరకు జరిగిన చర్చల్లో ప్రభుత్వం, యాజమాన్యం ఎటువంటి ప్రకటన చేయకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ మే 6 నుంచి ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో నిరవధిక సమ్మె చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సమ్మెలో తిరుమల కొండపైకి వెళ్లే బస్సులు కూడా నిలిచిపోతాయని, భక్తులు ఇందుకు సహకరించాలని కోరారు. ఆర్టీసీలో పని చేస్తున్న లక్షా ఇరవై వేల మంది కార్మికులందరికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన జీతభత్యాలు ఇవ్వాలన్నారు. అయితే ఎన్ఎంయూ నాయకులు యాజమాన్యంతో కుమ్మక్కై వేతనాల సవరణను ఆపివేసి, ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికలు జరిపించాలని లేబర్ కమిషనర్‌పై ఒత్తిడి చేయడం విడ్డూరమన్నారు. ఫిట్‌మెంట్‌పై సోమవారం ఆర్టీసీ అధికారులతోను, 30న లేబర్ కమిషనర్‌తో చర్చలు ఉన్నాయని పేర్కొన్నారు. కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 43 శాతం ఇవ్వాలంటే రెండు రాష్ట్రాల్లో 1800 కోట్లు ఏడాదికి అదనపు భారం పడుతుందన్నారు. రాష్ర్ట ఆర్గనైజింగ్ కార్యదర్శి ప్రకాష్ మాట్లాడుతూ వేతనాల సవరణ కోసం చేపడుతున్న నిరవధిక సమ్మెలో అన్ని యూనియన్లు పాల్గొని, 43 శాతం ఫిట్మెంట్ సాధించుకోవడంలో భాగస్వాములు కావాలని కోరారు. ఎంప్లాయిస్ యూనియన్ రీజనల్ అధ్యక్ష, కార్యదర్శులు టి.సత్యనారాయణ, ఎన్.విజయకుమార్, ఆర్టీసీ కో-ఆపరేటివ్ సొసైటీ మేనేజింగ్ కమిటీ సభ్యుడు క్రిష్ణమూర్తి, జోనల్ నాయకులు జ్యోతియాదవ్, పీఎస్ఎం.బాబురావు, ఎన్ఎస్ మణ్యం, డిపో అధ్యక్ష, కార్యదర్శులు వై.రాము, డీజే రామయ్య, గ్యారేజ్ కార్యదర్శి భాస్కర్, కార్మికులు పాల్గొన్నారు. -
సమ్మె ఆపేందుకు రంగంలోకి ఆర్టీసీ యాజమాన్యం
నేడు యూనియన్ నేతలతో ఎండీ చర్చలు హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇవ్వాలనే ప్రధాన డిమాండ్‌తో సమ్మెకు సిద్ధమవుతున్న ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్ నేతలను బుజ్జగించేందుకు ఆర్టీసీ యాజమాన్యం రంగంలోకి దిగింది. శనివారం ఉదయం 11 గంటలకు ఆర్టీసీ ఎండీ ఎన్.సాంబశివరావు ఈయూ, టీఎంయూ నేతలతో చర్చలు జరపనున్నారు. ఇప్పటికే కార్మిక శాఖ యూనియన్ నేతలతో చర్చలు జరిపింది. అయితే చర్చలు ఈ నెల 22కు వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం కార్మిక సంఘాలను చర్చలకు పిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. 22న ఆర్టీసీ సమ్మె తేదీని ప్రకటిస్తామని యూనియన్ నేతలు వెల్లడించారు. -
నేటి నుంచి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ సమ్మె
రాజమండ్రి సిటీ : యానమాన్యం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు, శ్రమదోపిడీ అరికట్టేందుకు శనివారం నుంచి జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ ఎంప్లాయూస్ యూనియన్ తలపెట్టిన సమ్మెను జయప్రదం చేయాలని యూనియన్ జిల్లా కార్యదర్శి పి.సత్యానందం పిలుపు నిచ్చారు. అక్రమ సస్పెన్సన్స్, శిక్ష రద్దు చేయాలని, డ్రైవర్‌తో బలవంతంగా టిమ్ (కండ క్టర్) డ్యూటీలు చేయించరాదని, డబుల్ డ్యూటీకీ డబుల్ జీతం ఇవ్వాలి, గ్యారేజీ కార్మికుల రిక్వస్ట్ ట్రాన్స్ఫర్స్ క్లియర్ చేయాలని, జిల్లా వ్యాప్తంగా ఇంకా మిగిలిన డబుల్ డోర్ బస్సులను సింగిల్ డోర్ చేయాలనే డిమాండ్లతో సమ్మె చేపడుతున్నట్టు సత్యానందం పేర్కొన్నారు. యాజమాన్యం, కార్మిక శాఖ లతో పలు దఫాలు చర్చలు జరిపినా ఫలితం లేకపోవడంతో సమ్మె చేయాల్చిన పరిస్థితి నెలకొందన్నారు. జిల్లా వ్యాప్తంగా9 డిపోల్లోని యూనియన్ సభ్యులంతా తెల్లవారు జాము నుంచి సమ్మెలో పాల్గొంటారని తెలిపారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సిద్ధం : ఎంప్లాయూస్ యూనియన్ నాయకులతో చర్చలు జరుపుతున్నాం, సఫలం కావచ్చని ఆర్టీసీ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ వరప్రసాద్ అన్నారు. ఎంప్లాయీస్ యూనియన్ సభ్యుల సమ్మెకు దిగినా జిల్లా వ్యాప్తంగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామన్నారు. అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సిద్ధం చేస్తామని వివరించారు. -
ఫిబ్రవరిలో కాంట్రాక్టు కార్మికుల రెగ్యులర్
శ్రీకాకుళం అర్బన్: ఆర్టీసీలోని కాంట్రాక్టు కార్మికులను ఫిబ్రవరి నెలలో రెగ్యులర్ చేస్తారని, అటు తర్వాత ఆర్టీసీలో కాంట్రాక్ట్ వ్యవస్థే ఉండదని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.అప్పారావు అన్నారు. ఆర్టీసీ విభజనపై త్వరితగతిన నివేదికలు తెప్పించేందుకు యాజమాన్యం అంగీకరించిందన్నారు. శ్రీకాకుళంలోని ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీ ప్రయాణికులు, ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఆర్టీసీ యాజమాన్యంతో ఈనెల 6, 7తేదీలలో రెండు రోజులపాటు జరిగిన చర్చలు ఫలవంతమయ్యాయన్నారు. జనవరి 12న 50శాతం డీఏ ఏరియర్స్ ఇచ్చేందుకు, మిగిలిన 50 శాతం మార్చి నెల జీతంలో ఇచ్చేందుకు, సీసీఎస్‌కు సంబందించి రూ.30కోట్లు జమ చేసేందుకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. పాత టిమ్ముల స్థానంలో కొత్త టిమ్స్ మెషీన్లు ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించిందన్నారు. రాబోయే 10వ పీఆర్సీలో రాష్ట్ర ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికులకు కూడా వేతనాలు ఇచ్చేందుకు పోరాడుతామన్నారు. ఫిబ్రవరి 7నఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఇన్‌ఛార్జి ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు జిల్లాలో పర్యటిస్తారని చెప్పారు. ఈయూ సాధించిన విజయాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఈయూ ప్రతినిధులు కొర్లాం గణేశ్వరరావు, కె.శంకరరావు (సుమన్), పీపీ రాజు పాల్గొన్నారు. -
ఆర్టీసీ కార్మికుల ర్యాలీ
ఆర్టీసీ కార్మిక చైతన్య సదస్సులో భాగంగా ఒంగోలులో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో వక్తలు మాట్లాడుతూ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం కావాలంటే ఎంప్లాయీస్ యూనియన్‌తో మాత్రమే సాధ్యమని, అందుకు 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో యూనియన్ పూర్తిస్థాయిలో బలోపేతం చేసుకోవడానికి ప్రతి కార్మికుడు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఒంగోలు : ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం కావడం ఎంప్లాయీస్ యూనియన్తోనే సాధ్యమని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే పద్మాకర్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో యూనియన్ను పూర్తిస్థాయిలో బలోపేతం చేయడంపై ప్రతి కార్మికుడూ దృష్టిసారించాలని ఆయన పిలుపునిచ్చారు. స్థానిక పద్మావతి ఫంక్షన్ హాలులో మంగళవారం నిర్వహించిన ఆర్టీసీ కార్మిక చైతన్య సదస్సులో పద్మాకర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల పట్ల నిజమైన చిత్తశుద్ధి ఎంప్లాయీస్ యూనియన్‌కు మాత్రమే ఉందన్నారు. రాష్ర్టం విడిపోయిన తర్వాత రూ.16 వేల కోట్ల లోటులో ఆంధ్రప్రదేశ్ ఉంటే.. పలకడు..ఉలకడు... అన్నట్లుగా చంద్రబాబునాయుడు పరిస్థితి ఉందన్నారు. తెలంగాణలో రూ.16 వేల కోట్ల మిగులు ఉంటే కేసీఆర్ అన్నీ చేస్తానని ప్రకటనలు గుప్పిస్తున్నాడన్నారు. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల సీఎంలపై ఒత్తిడి తెచ్చి ఆర్టీసీ కార్మికుల న్యాయమైన హక్కుల సాధనపై ఎంప్లాయీస్ యూనియన్ దృష్టిసారించిందన్నారు. ఆర్టీసీ ప్రకాశం రీజియన్ మేనేజర్ వి.నాగశివుడు మాట్లాడుతూ ఆర్టీసీ ఎక్కువగా మానవశక్తితో నడుస్తుందని, అందువల్ల వారధిలా పనిచేసే యూనియన్లతో తాము సత్సంబంధాలు కలిగి ఉంటామని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాలు బలంగా ఉంటే ఆర్టీసీ యాజమాన్యం తీసుకునే నిర్ణయాలు కూడా త్వరితగతిన కార్మికులకు చేరతాయన్నారు. అందులో భాగంగానే కొన్ని కీలకమైన నిర్ణయాలపై యూనియన్లతో కూడా చర్చిస్తుంటామని తెలిపారు. ఈయూ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు మాట్లాడుతూ ఆర్టీసీకి ఏపీలో రోజుకు రూ.3 కోట్ల నష్టం వస్తుందన్నారు. దాని ప్రకారం ఏడాదికి రూ.వెయ్యి కోట్ల నష్టం వాటిల్లుతుందన్నారు. అందువల్ల ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ఒక్కటే శరణ్యమన్నారు. రాబోయే గుర్తింపు యూనియన్ ఎన్నికల నాటికి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్‌తో కార్మికుల ముందుకు వెళ్లనున్నట్లు ఆయన వెల్లడించారు. ముందుగా స్థానిక ఒంగోలు ఆర్టీసీ బస్టాండు వద్ద నుంచి కర్నూలు రోడ్డు, అద్దంకి బస్టాండు, నవభారత్ థియేటర్ మీదుగా పద్మావతి ఫంక్షన్ హాలు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఈయూ రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షుడు ఎం.హనుమంతరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి కే అరుణ, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పీవీఆర్ చౌదరి, కార్యదర్శి ఎస్.కోటేశ్వరరావు, సీపీఐ నగర కార్యదర్శి ఉప్పుటూరి ప్రకాశరావు, ఆర్టీసీ రీజినల్ అధ్యక్ష, కార్యదర్శులు కే నాగేశ్వరరావు, వాకా రమేష్‌బాబు, ప్రచార కార్యదర్శి ముఖర్జీ, ఆర్టీసీ మాజీ అధ్యక్షుడు కొత్తకోట వెంకటేశ్వర్లు, రీజినల్ గౌరవాధ్యక్షుడు ఏ రామారావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కేవీఆర్ బాబు, ఆర్వీ రాయుడు, నూకతోటి శేషయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఆ నిధులు వెంటనే ఇవ్వాలి : ఆర్టీసీ ఈయూ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీకి రూ.250 కోట్ల గ్రాంటును ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు వాటిని వెంటనే విడుదల చేయాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. ఇంతేమొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టీసీకి విడుదల చేసినందున తెలంగాణ ప్రభుత్వం కూడా త్వరగా స్పందించాలని యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి ఆ ప్రకటనలో తెలిపారు. కార్మికులకు దసరా అడ్వాన్స్, సీసీఎస్ రుణాల అందజేత వంటివాటిని దృష్టిలో ఉంచుకోవాలన్నారు. -
సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె తప్పదు
ఆర్టీసీ గుర్తింపు సంఘం ఈయూ నాయకుల హెచ్చరిక శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్: విశాఖపట్నం రీజియన్‌లోని ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె తప్పదని ఆర్టీసీ ఎంప్లాయూస్ యూనియన్ (ఈయూ) నాయకులు హెచ్చరించారు. సమస్యల పరిష్కారంలో ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యవైఖరికి నిరసనగా శ్రీకాకుళంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో శుక్రవారం ఈయూ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఈయూ రీజనల్ అధ్యక్షుడు బి.కృష్ణమూర్తి మాట్లాడుతూ విశాఖపట్నం అర్బన్ ట్రాఫిక్ డిప్యూటీ చీఫ్ మేనేజర్ ఎ.వీరయ్యచౌదరి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ యూనియన్‌పై పక్షపాత ధోరణి అవలంభిస్తున్నారని దుయ్యబట్టారు. విజయనగరం జోన్‌లోని నాలుగు రీజియన్లకు సంబంధించి 27 డిపోల్లో ఆర్టీసీ అధికారులు గుర్తింపు సంఘంతో చేసుకున్న ఒప్పందాలను అమలు చేయడం లేదని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లో చార్టులు వేయాలని, టిమ్ డ్యూటీలు నిలుపుదల చేయాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తక్షణమే అమలుచేయూలని డిమాండ్ చేశారు. పల్లెవెలుగు బస్సులకు డబుల్ డోర్లు తీసివేయాలనే నిబంధన అమలు చేయకపోవడం విచారకరమన్నారు. అద్దెబస్సుల డ్రైవర్లకు ఇన్సెంటివ్‌లు ఇస్తూ గుర్తింపు కార్డులు జారీ చేయాలని, కార్మికులకు పదోన్నతులు కల్పించాలని, ఏడీ, పీడీల్లో ఉన్న ఖాళీలు భర్తీ చేయాలని, కార్మికులకు పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించకపోతే జూన్ 3వ తేదీన ఛలో ఈడీ కార్యాలయం చేపడతామని హెచ్చరించారు. ధర్నా లో ఈయూ డివిజనల్ చైర్మన్ కొర్లాం గణేశ్వరరావు, పి.నానాజీ, కె.శంకరరావు, శ్రీకాకుళం ఒకటో డిపో అధ్య క్ష, కార్యదర్శిలు జి.త్రినాథ్, ఎస్.వి.రమణ, జి.బి. మూర్తి, పి.వి.రావు, కె.వి.రమణ, బి.జయదేవ్, ఎం.టి.వి.రావు, కె.బి.రావు, పి.రమేష్, కె.బాబూరావు, సీహెచ్.కృష్ణారావు, కె.గోవిందరావు, ఎ.త్రినాథ్, ఎస్.ఎస్.నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీలో సమ్మె సైరన్
-
రేపటి నుంచి ఆర్టీసీ సమ్మె
హైదరాబాద్: ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ), ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఐక్య కూటమి రేపటి నుంచి సమ్మెకు దిగనున్నాయి. కార్మిక శాఖ కమిషనర్‌తో జరిపిన చర్చలు విఫలం కావడంతో సమ్మెకు దిగాలని నిర్ణయించాయి. మధ్యంతర భృతి మంజూరు చేయకపోవడంతో సమ్మెకు పిలుపునిచ్చాయి. రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమవుతుండడంతో సమ్మె ప్రభావం తీవ్రంగా ఉండనుంది. పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనున్నారు. ఈ నెల 12 లోగా ఐఆర్ చెల్లిస్తున్నట్లు ఆర్టీసీ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకపోతే 12వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపడతామని ఆర్టీసీ కార్మిక సంఘాలు ముందే హెచ్చరించాయి. -
ఐఆర్‌కోసం ఆర్టీసీ కార్మికుల దీక్ష
హైదరాబాద్, న్యూస్‌లైన్: కార్మికులకు తక్షణమే మధ్యంతర భృతిని చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ), ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఐక్య కూటమి ఆధ్వర్యంలో సోమవారం ఇందిరాపార్కు ధర్నా చౌక్‌వద్ద రెండు రోజుల దీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా టీఎంయూ ప్రధాన కార్యదర్శి ఇ. అశ్వథ్థామరెడ్డి, ఈయూ అదనపు ప్రధాన కార్యదర్శి వీఎస్ రావులు మాట్లాడుతూ జనవరి 26న జరిగిన ఒప్పందం మేరకు ఫిబ్రవరి వేతనంతో పాటు ఐఆర్ చెల్లిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. మధ్యంతర భృతి రాక ఆర్టీసీలో లక్షా 25 వేల మంది ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ఈ నెల 12 లోగా ఐఆర్ చెల్లిస్తున్నట్లు ఆర్టీసీ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకపోతే 12వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 217 డిపోల్లో నిరవధిక సమ్మె ప్రారంభమవుతుందని హెచ్చరించారు. ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మె నోటీసు ఇచ్చిన నేపథ్యంలో కార్మిక శాఖ కమిషనర్ చర్చలకు ఆహ్వానించారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు చర్చలు జరగనున్నాయి. -
సమైక్య బస్సులపై దాడిని ఖండించిన ఆర్టీసీ సంఘాలు
శనివారం ఎల్బీ స్టేడియంలో జరిగిన సేవ్ ఏపీ సభకు హాజరై తిరిగి వెళుతున్న సమయంలో బస్సులపై దాడి చేయడాన్ని ఆర్టీసీ ఈయూ, ఎన్ఎంయూ ఖండించాయి. ఈమేరకు రెండు సంఘాలు ఆదివారం వేర్వేరుగా పత్రికా ప్రకటనలు విడుదల చేశాయి. ప్రజాస్వామ్యయుతంగా, అత్యంత క్రమశిక్షణతో సభకు వచ్చిన వారిపై దాడులు చేయడాన్ని హేయమైన చర్యగా పేర్కొన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో వాటర్ ట్యాంక్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ కార్మికుడు బాలమునెయ్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపాయి. ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశాయి. అపోలో ఆసుపత్రికి తరలింపు శనివారం బస్సులపై జరిగిన దాడిలో గాయపడిన సత్యనారాయణ(వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి, రాజమండ్రి)ని వనస్థలిపురంలోని స్థానిక ఆసుపత్రి నుంచి ఆదివారం ఆపోలో ఆసుపత్రికి తరలించారు. దవడ ఎముక విరగడంతో పాటు పలు చోట్ల గాయాలయ్యాయి. దవడ ప్రాంతంలో శస్త్ర చికత్స అవసరమని డాక్టర్లు తెలిపారు. ఏపీఎన్జీవో నాయకులు ఆసుపత్రిలో ఉండి చికిత్స చేయిస్తున్నారు. -
సమైక్యాంధ్ర....మహోద్యమం
సాక్షి, విజయవాడ : సమైక్యాంధ్ర ఉద్యమ సెగలు జడివానలోనూ ఆగలేదు. సమైక్యాంధ్రకు మద్దతుగా 16వ రోజు ఉద్యోగ సంఘాలు, వ్యాపార వర్గాల ఆందోళనలు మహోద్యమంగా సాగాయి. శుక్రవారం వరలక్ష్మీ వ్రతం కావడంతో మహిళలు ఎక్కడికక్కడ సామూహిక వరలక్ష్మీ వ్రతాలు చేస్తూ నిరసన తెలిపారు. పెనుగంచిప్రోలు పాత సినిమా హాల్ సెంటర్లో డ్వాక్రా మహిళలు లక్ష్మీదేవి చిత్రపటాన్ని, కలశాన్ని అందంగా అలంకరించి, పసుపు, కుంకుమలతో శ్రీతిరుపతమ్మ అమ్మవారి ఆలయ వేద పండితులు చిట్టి చంద్రశేఖర శర్మచే శాస్త్రోక్తంగా వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించారు. రాష్ట్ర విభజన జరగకుండా, అందరూ సమైక్యంగా ఉండాలని మహిళలు లక్ష్మీదేవిని ప్రార్థించారు. జగ్గయ్యపేటలో ఎన్జీవోలు, ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కూడలి వ ద్ద రోడ్డుపై మహిళలు సామూహిక వరలక్ష్మీ వ్రతం చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. స్థానిక ఎన్టీటీపీఎస్లోని మహిళా ఉద్యోగులు థర్మల్ గేట్ బయట రోడ్డుపైనే జోరువానలోనూ వరలక్ష్మీ వ్రతం పూజాదికాలు నిర్వహించారు. జాగో నాయకా! విజయవాడలో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో కుక్క మెడలో, జాగో నాయకా జాగో బోర్డు కట్టి నిరసన తెలిపారు. పశుసంవర్ధక శాఖ గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ విజయవాడలో సమావేశమై ఆదివారం అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్లాలని నిర్ణయించింది. మరుపిళ్ల చిట్టి కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని మంత్రి కొలుసు పార్థసారథి ప్రారంభించారు. చెన్నుపాటి పెట్రోల్ బంకు వద్ద నుంచి ఇందిరాగాంధీ స్టేడియం వరకు జరిగిన విద్యార్థుల జేఏసీ ర్యాలీలో మాజీ మంత్రులు మండలి బుద్ధప్రసాద్, దేవినేని నెహ్రూ పాల్గొన్నారు. వినూత్న నిరసనలు.. జిల్లాలో శుక్రవారం నిరసనలు వినూత్నంగా సాగాయి. కలిదిండిలో ఎన్జీవోలు స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. జగ్గయ్యపేట మున్సిపల్ కూడలి వద్ద రాష్ట్ర విభజనకు నిరసనగా ఆందోళనలు నిర్వహించి దిష్టిబొమ్మలు దహనం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఎరువుల వ్యాపారులు నిరసన తెలిపారు. జగ్గయ్యపేటలో రైతుబజార్ బంద్ పాటించారు. హిజ్రాలు కూడా నిరసన ప్రదర్శన చేశారు. గుడివాడలో కేసీఆర్, సోనియా మాస్క్‌లతో గొర్రెలను ఊరేగిస్తూ మాంసం వర్తకులు వినూత్న నిరసన తెలిపారు. ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు, కార్మికులు బస్సులతో ర్యాలీ నిర్వహించారు. ట్రాక్టర్ యజమానులు ఖాళీ ట్రాక్టర్లతో ర్యాలీ చేయగా, రైతుబజారులో వంటావార్పు నిర్వహించారు. మచిలీపట్నంలో పలు ఉద్యోగ సంఘాల నాయకులు, సిబ్బంది శుక్రవారం స్థానిక కోనేరుసెంటర్‌లో రిలే నిరాహారదీక్ష చేపట్టారు. ఇబ్రహీంపట్నంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన మూడో రోజు రిలేదీక్షలను పార్టీ మహిళా విభాగం జిల్లా కన్వీనర్ తాతినేని పద్మావతి ప్రారంభించారు. తిరువూరులో ఆర్టీసీ కార్మికులు, పశుసంవర్ధక శాఖ ఉద్యోగులు, ఎన్జీవో జేఏసీల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ మొండివైఖరిని నిరసిస్తూ పశువుల్ని ఊరేగించారు. కుక్కకు, ఎద్దుకు మెడలో దండలు వేసి పట్టణంలో ఊరేగించి సమైక్యాంధ్రను విడదీయవద్దంటూ వినతిపత్రాలు సమర్పించారు. పెడనలో ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ చదివే విద్యార్థులు జరిపిన రిలే నిరాహార దీక్ష శిబిరానికి వైఎస్సార్ సీపీ పెడన నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాం ప్రసాదు మద్దతు పలికారు. బంటుమిల్లి చౌరస్తాలో జేఏసీ ఆధ్వర్యంలో వంటలు చేయటం, ఇడ్లీ పిండి కడగటం, దోసెలు, గారెలు, మినప అట్లు, పెసర అట్లు వేయటం, చపాతీలు తయారు చేయటం లాంటి పనులు చేస్తూ తమ నిసరన తెలిపారు. హిజ్రాలు బంటుమిల్లి రోడ్డులో నాట్యాలు చేస్తూ నిరసనను తెలిపారు. చాట్రాయి మండలం చనుబండలో రోడ్డుపై క్షవరం చే సి జేఏసీ నాయకులు నిరసన తెలిపారు. నూజివీడులో ఎల్ఐసీ ఏజంట్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో మోటర్‌సైకిల్ ర్యాలీ నిర్వహించారు. బైక్ మెకానిక్‌ల అసోసియేషన్ ఆధ్వర్యంలో చిన్నగాంధీబొమ్మ సెంటరులో ద్విచక్ర వాహనాలకు ఉచిత సర్వీసింగ్ నిర్వహించారు. నందిగామ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై అర్ధనగ్నంగా మోకాళ్లపై నిలబడి రాస్తారోకో చేశారు. మైలవరంలోని తెలుగు తల్లి సెంటర్లో జాతీయ రహదారిపై శుక్రవారం ఆటల పోటీలు నిర్వహించారు. ఉయ్యూరులో భారీ ప్రదర్శన జోరువానలోనూ ఉయ్యూరులో శ్రీవిశ్వశాంతి పాఠశాల విద్యార్థులు పాఠశాల నుంచి సెంటర్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించి ప్రధాన సెంటర్లో మానవహారం నిర్వహించారు. ఉయ్యూరు సెంటర్లో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలేదీక్షల్లో మండల పాస్టర్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్తలు తాతినేని పద్మావతి, పడమట సురేష్‌బాబులు దీక్షా శిబిరాన్ని సందర్శించి సమైక్యాంధ్రకు మద్దతు ప్రకటించారు. తోట్లవల్లూరు మండలంలోని వల్లూరుపాలెంలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేయనీయకుండా, పోలీసులు తీసుకెళ్లిపోవటం ఉద్రిక్తతకు దారితీసింది. పామర్రు నాలుగు రోడ్ల కూడలిలో పామర్రు ఫొటోగ్రఫీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రధాన రహదారుల వెంట ప్రదర్శనలు చేశారు.