సాక్షి, నిర్మల్ : ఆర్టీసీలో సీనియర్ ఉద్యోగులు రూ.50వేల వేతనం తీసుకుంటున్నారని సీఎం కేసీఆర్ ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ నాయకులు పేర్కొన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని బస్‌డిపో వద్ద బుధవారం ఆందోళన చేపట్టారు. పే స్లిప్పులను చూపిస్తూ వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు. 20 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నామని, ప్రస్తుతం రూ.25వేలే జీతం ఉందన్నారు.
సీనియారిటీ ఉన్నవారందరికీ రూ.50 జీతాలు తీసుకుంటున్నారని సీఎం అబద్దపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సీనియారిటీ ఉన్నప్పటికీ రూ.25 వేలకు మించి లేవని, దీనికి రుజువులు తమ పేస్లిప్‌లేనన్నారు. సీఎం కేసీఆర్ ఒకసారి పేస్లిప్‌లను పరిశీలించి చూసుకుని మాట్లాడాలని హితవు పలికారు. ఆర్టీసీ కార్మికులకు భారీగా వేతనాలు ఉన్నాయని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. తప్పుడు ప్రచారం మానుకోవాలని, లేని పక్షంలో రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఇందులో ఆదిలాబాద్ జిల్లా జేఏసీ కన్వీనర్ ఏఆర్ రెడ్డి, జేఏసీ నాయకులు గంగాధర్, చందర్, నారాయణ, జమీర్, శ్రీనివాస్, రాజేశ్వర్, పోశెట్టి, శంకర్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment