
సమ్మె ఆపేందుకు రంగంలోకి ఆర్టీసీ యాజమాన్యం
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇవ్వాలనే ప్రధాన డిమాండ్‌తో సమ్మెకు సిద్ధమవుతున్న ఆర్టీసీ ఎంప్లాయిస్
నేడు యూనియన్ నేతలతో ఎండీ చర్చలు
హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇవ్వాలనే ప్రధాన డిమాండ్‌తో సమ్మెకు సిద్ధమవుతున్న ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్ నేతలను బుజ్జగించేందుకు ఆర్టీసీ యాజమాన్యం రంగంలోకి దిగింది. శనివారం ఉదయం 11 గంటలకు ఆర్టీసీ ఎండీ ఎన్.సాంబశివరావు ఈయూ, టీఎంయూ నేతలతో చర్చలు జరపనున్నారు.
ఇప్పటికే కార్మిక శాఖ యూనియన్ నేతలతో చర్చలు జరిపింది. అయితే చర్చలు ఈ నెల 22కు వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం కార్మిక సంఘాలను చర్చలకు పిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. 22న ఆర్టీసీ సమ్మె తేదీని ప్రకటిస్తామని యూనియన్ నేతలు వెల్లడించారు.