శ్రీకాకుళం అర్బన్: ఆర్టీసీ గుర్తింపు సంఘం యూనియన్ ఎన్నికల్లో బస్సు దూసుకుపోయింది. శ్రీకాకుళం నెక్ రీజియన్‌తోపాటు జిల్లాలో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్(బస్సు గుర్తు) విజయఢంకా మోగించింది. ఆ యూనియన్ కార్మికులు సంబరాల్లో మునిగితేలారు. నెక్ రీజియన్‌లోని 9 డిపోల కుగాను ఎంప్లాయీస్ యూనియన్ ఏడింటిని కైవసం చేసుకుని విజయకేతనం ఎగురవేసింది. శ్రీకాకుళం ఒకటో డిపోలో 230 ఓట్లు ఈయూకు, 232 ఎన్‌ఎంయూకు వచ్చాయి. రెండు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి. ఈ రెండు ఓట్లు ఈయూకి చెందినవిగా చెబుతున్నారు. దీంతో ఈ డిపో టైగా ముగిసే అవకాశం ఉంది. టైగా వచ్చిన ఫలితం రాష్ట్రస్థాయిలో గెలిచిన యూనియన్‌కే దక్కుతుందని తెలిసింది.
రీజియన్‌లోని తొమ్మిది డిపోల్లో 3, 930ఓట్లకు గాను 2, 220 ఓట్లు సాధించి ఇయూ విజయబావుటా ఎగురవేసింది. ఇయూ కార్యాలయం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ చుట్టూ విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. కార్యకర్తలంతా తమ యూనియన్ నాయకులను అభినందించారు. బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. హడావుడి : గురువారం ఉదయం 5గంటల నుంచే ఎన్నికలు ప్రారంభమయ్యాయి. కార్మికులంతా ఉత్సాహంగా ఓటింగులో పాల్గొన్నారు. ఉదయాన్నే ఇతర ప్రాంతాలకు విధుల నిమిత్తం వెళ్ళే బస్సు కండక్టర్‌లు, డ్రైవర్లు తమ ఓటుహక్కును వినియోగించుకుని వెళ్ళిపోయారు. జిల్లాలోని అన్ని డిపోల పరిధిలో మద్యాహ్నం 12గంటలకే 70శాతంకు పైగా ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.
మెజారిటీ ఇలా :జిల్లా పరిధిలోని ఐదు డిపోల్లో డిపోల వారీగా ఓట్ల వివరాలు : జిల్లాలో 5 డిపోలకు గాను రెండు డిపోలను ఎన్‌ఎంయూ, మూడు డిపోలను ఇయూ గెలుచుకుంది. శ్రీకాకుళం ఒకటి(2 ఓట్లు మెజారిటీ), రెండు డిపో(68 ఓట్లు మెజారిటీ)ల్లో ఎన్‌ఎంయూ గెలిచింది. పాలకొండ డిపోలో(121 ఓట్లు మెజారిటీ), టెక్కలి డిపోలో(44 ఓట్లు మెజారిటీ), పలాస డిపోలో(164 ఓట్లు మెజారిటీ) ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ కైవసం చేసుకుంది.
కార్మికుని విజయం:
ఇది కార్మికుని విజయం. రాష్ట్రంలో కూడా గుర్తింపు యూనియన్‌గా గెలుస్తాం. కార్మికులకు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా లొంగక బస్సు గుర్తుకే ఓటువేసి ఇయూను గెలిపించారు. ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం. పలిశెట్టి దామోదరరావు, ఇయూ రాష్ట్ర ఉపప్రధానకార్యదర్శి
ఆర్టీసీ ఎన్నికల్లో బస్సు జోరు...
Published Thu, Feb 18 2016 11:30 PM | Last Updated on Sun, Sep 3 2017 5:54 PM
Advertisement
Advertisement