సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీకి రూ.250 కోట్ల గ్రాంటును ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు వాటిని వెంటనే విడుదల చేయాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. ఇంతేమొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టీసీకి విడుదల చేసినందున తెలంగాణ ప్రభుత్వం కూడా త్వరగా స్పందించాలని యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి ఆ ప్రకటనలో తెలిపారు. కార్మికులకు దసరా అడ్వాన్స్, సీసీఎస్ రుణాల అందజేత వంటివాటిని దృష్టిలో ఉంచుకోవాలన్నారు.