హిల్లరీ ‘పెయిడ్ స్పీచ్’ టేపులు విడుదల చేసిన వికీలీక్స్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల రాజకీయాలు కీలక దశకు చేరుకున్న సమయంలో డెమోక్రటిక్ పార్టీ అశ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. గోల్డ్‌మన్ శాక్స్ కంపెనీకి సంబంధించి హిల్లరీ మాట్లాడిన మూడు పెయిడ్ స్పీచెస్ (డబ్బు తీసుకుని ఇచ్చే ఉపన్యాసాలు)కు సంబంధించిన టేపులను వికీలీక్స్ విడుదల చేసింది. దీంతో వాల్‌స్ట్రీట్‌తో డెమోక్రటిక్ నేతలకున్న సంబంధాలు తేటతెల్లమయ్యాయి.
హిల్లరీ ప్రచార సారథి జాన్ పొడెస్టా మెయిల్ ఎకౌంట్‌ను హ్యాక్ చేయ డం ద్వారా వికీలీక్స్ సేకరించిన భారీ సమాచారంలో ఈ వివరాలు ఉన్నాయి. ఈ లీకేజీకి రష్యానే కారణమని హిల్లరీ వర్గం ఆరోపిస్తోంది. తమ ప్రత్యర్థి ట్రంప్‌నకు సహకరించేందుకే వికీలీక్స్ ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించింది.