‘పైడా’లో రేపు ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూలు
తాళ్లరేవు :
పటవలలోని పైడా ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో గల ఐసీఐసీఐ బ్యాంక్‌ల్లో ఆఫీసర్ ఉద్యోగాలకు ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు కళాశాల చైర్మన్ పైడా సత్య ప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ పూర్తిచేసిన వారందరూ ఈ ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చన్నారు. భాష, కంప్యూటర్ పరిజ్ఞానం, వ్యక్తిగత ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేస్తారన్నారు. ఆసక్తి కలిగినవారు జె. కృష్ణారావు, సెల్ నెం. 83339 61165ను సంప్రదించాలని సూచించారు.