Pakistan rangers
-
అప్పుడే పుట్టిన నవజాత శిశువు పేరు ‘బోర్డర్’..ఎందుకో తెలుసా?
ఇస్లామాబాద్: ఇటీవలకాలంలో తమ పిల్లల పేర్లు విభిన్నంగా ఉండాలని, పైగా ఆ పేరు ఎవ్వరికి ఉండకూడదని విన్నూతనంగా పెడుతుండటం చూశాం. కానీ ఇక్కడొక జంట తాము భారత్ పాక్ సరిహద్దుల్లో చిక్కుకుపోవడంతో అప్పుడే పుట్టిన తమ బిడ్డకు సరిహద్దు(బోర్డర్) అని పేరుపెట్టుకుని అందర్నీ ఆశ్చర్యపరిచారు. (చదవండి: రెండు వేల ఏళ్లనాటి సమాధుల్లో... బంగారపు నాలుక!!) అసలు విషయంలోకెళ్లితే....ఓ పాకిస్తానీ దంపతులు తమకు పుట్టిన మగబిడ్డకు ‘బోర్డర్’ అని పేరు పెట్టారు. అయితే ఆ జంట 97 మంది పాకిస్తానీ పౌరులతో సహా 71 రోజులుగా అట్టారీ సరిహద్దులో చిక్కుకుపోయారు. ఈ మేరకు ఆ పాకిస్తానీ జంట పంజాబ్ ప్రావిన్స్‌లోని రాజన్‌పూర్ జిల్లాకు చెందిన నింబు బాయి, బాలం రామ్‌లు. ఈ క్రమంలో బాలం రామ్ మాట్లాడుతూ...ఇండో-పాక్ సరిహద్దులో పుట్టినందున మా బాబుకి ఆ పేరు పెట్టాం. నా భార్య నింబు బాయి ఈ నెల డిసెంబర్ 2 న ప్రసవం అయ్యిందని, అంతేకాక తన భార్యకు సాయం చేయడానికి పొరుగున ఉన్న పంజాబ్ గ్రామాల నుండి కొంతమంది మహిళలు రావడమే కాక వైద్య సదుపాయాలను కూడా ఏర్పాటు చేశారు. అయితే నేను లాక్‌డౌన్‌కు ముందు తమ బంధువులను కలవడమే కాకుండా తీర్థయాత్ర కోసం భారత్‌కు వచ్చాను. అయితే నా వద్ద తిరిగి వెళ్లేందకు అవసరమ్యే పత్రాలు లేకపోవడంతో ఇతర పాకిస్తానీ పౌరులతో కలిపి సుమారు 98 మందితో సహా ఈ సరిహద్దులో చిక్కుకుపోయాం" అని చెప్పాడు. దీంతో ఈ కుటుంబాలు అట్టారి అంతర్జాతీయ చెక్‌పోస్టు సమీపంలోని పార్కింగ్ స్థలంలో ఉండిపోయారు. అయితే వారికి స్థానికులు మూడు పూటల భోజనం, మందులు, దుస్తులు అందిస్తున్నారు. (చదవండి: వామ్మో! ఆ దేశం కేవలం పూల వ్యాపారంతోనే.... రూ.180 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తుందటా!!) -
పాకిస్తాన్లో బాంబు పేలుడు.. ముగ్గురు మృతి
ఇస్లామాబాద్ : పాకిస్తాన్లో శుక్రవారం జరిగిన బాంబు దాడిలో ముగ్గురు మృతి చెందారు. సింధ్ సింధ్ ప్రావిన్స్‌లోని రైల్వే స్టేషన్ సమీపంలో భద్రతా వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్లు పాకిస్తాన్ మీడియా వెల్లడించింది. ఈ ఘటనలో పాకిస్తాన్ భద్రతా దళానికి చెందిన ఇద్దరు సహా, ఒక పౌరుడు మృతిచెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. క్షతగ్రాతులను స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. సంఘటన జరిగిన గోట్కీ ప్రాంతాన్ని భద్రతా దళాలు చుట్టుముట్టాయి. అయితే ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రసంస్థ నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. సాధారణంగా అయితే బలూచిస్తాన్ ప్రావిన్స్ లక్ష్యంగా ఉగ్రదాడులు జరుగుతాయని, సింధ్ ప్రావిన్స్‌లో ఇలాంటి ఘనలు అరుదు అని పాకిస్తాన్ అధికారులు పేర్కొన్నారు. (వ్యాక్సిన్ అన్ని దేశాలకూ అందివ్వాలి: పాకిస్తాన్) At least three people including a Sindh Rangers personnel were dead on Friday in a blast targeting a vehicle of the Rangers in Ghotki: Pakistan media — ANI (@ANI) June 19, 2020 -
అయ్యో ధావన్..!
నాటింగ్‌హామ్: ప్రపంచ కప్‌లో రెండు అద్భుత విజయాలు సాధించి ఊపు మీదున్న భారత జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. జట్టు ఓపెనర్, గత మ్యాచ్ హీరో శిఖర్ ధావన్ బొటన వేలి గాయంతో రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. గురువారం న్యూజిలాండ్‌తో, ఆదివారం పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లలో ధావన్ ఆడే అవకాశం లేదు. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో కమిన్స్ వేసిన బౌన్సర్ అతని ఎడమచేతికి బలంగా తగిలింది. రెండు బంతుల తర్వాత వేలిపై స్ప్రే చేసిన తర్వాత అతను ఆడేందుకు ప్రయత్నించినా, నొప్పితో అదే ఓవర్లో మళ్లీ చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. అయితే ఆటను కొనసాగించిన ధావన్ 109 బంతుల్లోనే 117 పరుగులు చేసి భారత్ విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. గాయం కారణంగా ధావన్ ఫీల్డింగ్‌కు దిగకపోవడంతో ఆసీస్ ఇన్నింగ్స్ మొత్తం రవీంద్ర జడేజా సబ్‌స్టిట్యూట్‌గా వ్యవహరించాడు. అయితే తదనంతరం శిఖర్ చేతికి స్కానింగ్ నిర్వహించగా ‘హెయిర్‌లైన్ ఫ్రాక్చర్’గా తేలింది. అతని ఎడమ చేతి బొటనవేలు, చూపుడు వేలు మధ్యభాగంలో వెనుకవైపు గాయమైనట్లు బీసీసీఐ వెల్లడించింది. పూర్తిస్థాయి ఇతర పరీక్షల ఫలితాలు రాకపోవడంతో గాయం తీవ్రత ఎంత, ఎన్ని రోజుల్లో తగ్గవచ్చనే దానిపై స్పష్టత లేకపోయినా...తర్వాతి రెండు మ్యాచ్‌లలో అతను బరిలోకి దిగడని మాత్రం ఖాయమైపోయింది. భారత జట్టు ఫిజియో ప్యాట్రిక్ ఫర్హర్ట్ కూడా ధావన్‌తో పాటు ఉండి ప్రత్యేక వైద్యులతో చర్చిస్తున్నాడు. భారత కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం ‘శిఖర్ ధావన్ ఇంగ్లండ్‌లో జట్టుతో పాటే కొనసాగుతాడు. అతడి గాయాన్ని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తారు’ అని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. దాంతో ప్రత్యామ్నాయ ఆటగాడి గురించి మేనేజ్మెంట్కు ఎలాంటి ఆలోచన లేదని స్పష్టమైంది. అతను లేని లోటు... ఐసీసీ టోర్నీలలో ధావన్ ప్రదర్శనను ఒక్కసారి గుర్తు చేసుకుంటే జట్టులో అతని విలువేమిటో అర్థమవుతుంది. వన్డే ప్రపంచ కప్, చాంపియన్స్ ట్రోఫీలలో కలిపి 20 మ్యాచ్‌లలో అతను 65.15 సగటుతో 1,238 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు ఉన్నాయి. ప్రపంచ కప్‌లోనే అతను 10 మ్యాచ్‌లలో 53.70 సగటుతో 537 పరుగులు చేశాడు. తాజాగా ఆసీస్‌పై అద్భుత సెంచరీతో తన సత్తాను ప్రదర్శించి టోర్నీలో రాబోయే మ్యాచ్‌లలో చెలరేగేందుకు సిద్ధమైన తరుణంలో గాయం దెబ్బ తీసింది. గత కొన్నేళ్లలో భారత్ సాధించిన అద్భుత విజయాల్లో ఓపెనర్లుగా రోహిత్, ధావన్‌లదే కీలక పాత్ర. ఈ జోడీ కుదురుకున్నాక మరో ప్రత్యామ్నాయం గురించి ఆలోచించాల్సిన అవసరమే రాలేదు. వీరు వేసిన బలమైన పునాదిపైనే కోహ్లి తదితరులు చెలరేగి ప్రత్యర్థులను పడగొట్టగలిగారు. 16 సెంచరీ భాగస్వామ్యాలు సహా 4,681 పరుగులు జోడించిన వీరిద్దరిలో ఒకరు దూరం కావడమంటే కొత్త ఓపెనింగ్ జంటతో టీమిండియా ఆడాల్సిందే. ఇది జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపించవచ్చు. వేచి చూసే ధోరణి! శిఖర్ ధావన్ విషయంలో ప్రస్తుతానికి టీమ్ మేనేజ్మెంట్ సరైన నిర్ణయమే తీసుకుంది. టీమిండియా ఫామ్, ఇప్పటికే గెలిచిన రెండు ప్రధాన మ్యాచ్లువంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటే మన జట్టు సెమీఫైనల్ చేరడం దాదాపు ఖాయమే. గాయం ప్రమాదకరమైంది కాకుండా రెండు మ్యాచ్‌ల తర్వాతే అతను తిరిగొస్తే సమస్యే లేదు. అలా కాకుండా దురదృష్టవశాత్తూ లీగ్ దశ మొత్తం కూడా ధావన్ దూరమైనా... నాకౌట్ సమయానికి కోలుకుంటే చాలని జట్టు భావిస్తోంది. అందుకు చాలినంత సమయం ఉంది. ఐసీసీ నిబంధనల ప్రకారం ఒక ఆటగాడు గాయపడిన తర్వాత అతను పూర్తిగా జట్టు నుంచి బయటకు వెళ్లిపోతేనే అతని స్థానంలో మరో ఆటగాడిని టెక్నికల్ కమిటీ అనుమతిస్తుంది. ఇప్పుడు ధావన్‌ను తప్పించి మరెవరినైనా తీసుకుంటే ఒకవేళ కోలుకున్నా అతను మళ్లీ టీమ్‌లోకి రాలేడు. మరొకరికి గాయమైతే తప్ప అది సాధ్యం కాదు! కాబట్టి సెలక్టర్లు ధావన్‌ను కొనసాగించాలనే నిర్ణయించుకున్నారు. చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్, సెలక్టర్లు శరణ్‌దీప్ సింగ్, దేవాంగ్ గాంధీ ప్రస్తుతం ఇంగ్లండ్‌లో జట్టుతో పాటే ఉన్నారు. ఇక వచ్చే మ్యాచ్‌లలో రోహిత్‌కు తోడుగా స్పెషలిస్ట్ ఓపెనర్‌గా కేఎల్ రాహుల్‌ను పంపడం దాదాపు ఖాయమే. మిడిలార్డర్లో దినేశ్ కార్తీక్ లేదా విజయ్ శంకర్లలో ఒకరికి అవకాశం దక్కవచ్చు. -
పేట్రేగిన పాక్ రేంజర్లు
- సరిహద్దు సమీప భారత గ్రామాలపై కాల్పులు - ముగ్గురు పౌరుల మృతి, 16 మందికిపైగా తీవ్ర గాయాలు శ్రీనగర్: కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలోతొక్కిన పాకిస్థాన్ మరోసారి రెచ్చిపోయింది. జమ్ముకశ్మీర్ లోని ఆర్ఎస్ పురా సెక్టార్ లో శుక్రవారం తెల్లవారజామున కాల్పులకు తెగబడింది. పాక్ రేంజర్ల కాల్పుల్లో ముగ్గురు భారతీయ పౌరులు చనిపోగా, 16 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇంకా కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో మరింత అప్రమత్తమైన బీఎస్ఎఫ్ బలగాలు పాక్ కు బుద్ధి చెప్పేపనిలో ఉన్నాయి. గురువారం పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఒక భారత జవాన్ చనిపోయిన సంగతి తెలిసిందే. మరోవైపు భారత్ లో మారణహోమం సృష్టించేందుకు గురువారం సరిహద్దు దాటి కశ్మీర్ లోకి ప్రవేశించిన నలుగురు పాక్ ఉగ్రవాదుల్లో ఒకరిని భారత సైన్యం సజీవంగా పట్టుకుంది.