Palamuru workers
-
‘పాలమూరు’ కోసంమళ్లీ కసరత్తు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలపై ఆధారపడి చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి పర్యావరణ అనుమతుల ప్రక్రియలో వేగం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అనుమతులు పొందే వరకు నిర్మాణ పనులు పూర్తిగా నిలిపివేయాలంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశించిన నేపథ్యంలో అనుమతుల సాధన ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే అవసరమైన అన్ని నివేదికలు సిద్ధం చేసిన ఇంజనీర్లు.. ప్రభుత్వం అనుమతించిన వెంటనే అనుమతుల కోసం కేంద్ర పర్యావరణ శాఖకు దరఖాస్తు చేయనున్నారు. ఈఏసీ ఓకే అంటేనే అనుమతి.. ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న రిజర్వాయర్లు, పంప్‌హౌస్‌లు, ఇతర నిర్మాణాలకు 27,193 ఎకరాల మేర భూసేకరణ చేయాల్సి ఉండగా మరో 205.48 హెక్టార్ల మేర అటవీ భూములు అవసరం కానున్నాయి. ఇందులో ఇప్పటికే 26 వేల ఎకరాల మేర భూసేకరణ పూర్తికాగా ఆగస్టులో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఈ వివరాలతోపాటు ఇతర అంశాలపై ఇరిగేషన్ శాఖ అధికారులు సమగ్ర నివేదికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర పర్యావరణ శాఖకు ఈ వివరాలు సమర్పించాల్సి ఉన్నా ప్రభుత్వం మొదట గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టుల అనుమతుల ప్రక్రియను ముగించి ఆ తర్వాత కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల అనుమతుల ప్రక్రియ మొదలు పెట్టాలని భావించడంతో దీన్ని పక్కనపెట్టింది. అయితే ఎన్జీటీ పర్యావరణ అనుమతులు వచ్చేవరకు పనుల కొనసాగింపుపై ముందుకెళ్లొద్దని స్పష్టం చేయడంతో ఇప్పటికే సిద్ధం చేసిన నివేదికలను కేంద్ర పర్యావరణ శాఖకు పంపాలని ఇరిగేషన్ శాఖ భావిస్తోంది. ఈ నివేదికలను ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ (ఈఏసీ) పరిశీలించి పర్యావరణంపై పడే ప్రభావాన్ని మదింపు చేస్తుంది. ప్రాజెక్టు నిర్మాణాలకు ఎలాంటి అభ్యంతరం లేదని కమిటీ తేలిస్తేనే అనుమతుల ప్రక్రియ పూర్తి కానుంది. కేంద్రానికి దరఖాస్తు చేసిన రెండు నెలల్లో అనుమతులు వచ్చే అవకాశం ఉంటుందని ప్రాజెక్టు ఇంజనీర్లు చెబుతున్నారు. -
‘పాలమూరు–రంగారెడ్డి’ని ఆపాల్సిందే..
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ అనుమతులు లేకుండా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు నిలిపివేయాల్సిందేనని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) స్పష్టం చేసింది. పిటిషన్లకు విచారణ అర్హత లేదన్న తెలంగాణ ప్రభుత్వ వాదనను తోసిపుచ్చింది. పర్యావరణ అనుమతులు తప్పించుకోవడానికే తాగునీటి పేరు చెప్పి సాగునీటి ప్రాజెక్టు చేపడుతోందన్న ఏపీ ప్రభుత్వ వాదనతో ఏకీభవించింది. పిటిషనర్లు పర్యావరణ అంశంతో ఆశ్రయించిన నేపథ్యంలో విచారణ పరిధి తమకుందని పేర్కొంది. పర్యావరణ అనుమతులు పొందే వరకూ ప్రాజెక్టుపై తెలంగాణ ముందుకు వెళ్లకూడదని ఆదేశాల్లో పేర్కొంది. సంయుక్త కమిటీలో తెలంగాణ సభ్యులు మినహా మిగతా సభ్యులు పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయని పేర్కొన్న అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయని తాము విశ్వసిస్తున్నామని జస్టిస్ రామకృష్ణన్, విషయ నిపుణుడు సత్యగోపాల్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశాల్లో స్పష్టం చేసింది. ‘పాలమూరు–రంగారెడ్డి’ని తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మిస్తోందని, ఇది ఆంధ్రప్రదేశ్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుందంటూ డి.చంద్రమౌళీశ్వర్‌రెడ్డి, అవ్వ వెంకటసుబ్బారెడ్డి, ఎస్కే.జానీబాషా, వజ్రాల కోటిరెడ్డి, నరబోయిన వెంకటరావు, సిద్దదాపు గాంధీ, గరికపాటి వెంకటరామనాయుడు, అన్నెం సోరెడ్డి, పండిపాటి వెంకయ్యలు దాఖలు చేసిన పిటిషన్‌పై ఎన్జీటీ చెన్నై ధర్మాసనం శుక్రవారం ఆదేశాలు వెలువరించింది. అనుమతులు తీసుకున్నాకే... తెలంగాణ, ఏపీ, పిటిషనర్ల, కేంద్రం తరఫున న్యాయవాదుల వాదనలు విన్న ధర్మాసనం ఉత్తర్వులు వెలువరించింది. ‘కేంద్ర పర్యావరణ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం అటవీ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోగా అనుమతించింది. అయితే ఇది ప్రాజెక్టు నిర్మాణానికి కాదని గుర్తుచేసింది. అపెక్స్ కౌన్సిల్ సమావేశం సందర్భంగా ఏపీ ప్రభుత్వం అభ్యంతరం తెలిపిన ప్రాజెక్టులపై ముందుకెళ్లొద్దని తెలంగాణకు కేంద్రం సూచించింది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక సమర్పించలేదని.. ప్రాజెక్టు పనులు నిలిపివేయాలని కృష్ణా బోర్డు కూడా స్పష్టం చేసింది. ఇవన్నీ ఇలా ఉన్నా.. తెలంగాణ పర్యావరణ నిబంధనలకు వ్యతిరేకంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించింది. ఈ నిర్ణయం పర్యావరణంపై ప్రభావం చూపడంతోపాటు ఏపీ ప్రజలు, పిటిషనర్ల (రైతులు) ప్రయోజనాలపైనా ప్రభావం చూపుతుంది. చెంచు గిరిజనులు ఉన్న ప్రాంతంలో ప్రాజెక్టు నిర్మాణం(పంప్‌హౌస్) చేపట్టడానికి తెలంగాణకు అనుమతి లేదు. 90 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లు నిర్మిస్తే ఇక సాగునీటికి కాలువలు తీయడం మినహా ఏమీ లేదు’అని తెలంగాణ సర్కార్‌కు తేల్చిచెబుతూ ఉత్తర్వులు జారీచేసింది. ► ‘ఎన్జీటీ చట్టంలోని సెక్షన్ 14(3) ప్రకారం కాజ్ ఆఫ్ యాక్షన్ జరిగిన ఆరు నెలల్లోనే పిటిషన్ దాఖలు చేయాలనడం వాస్తవమే, సెక్షన్ 15 ప్రకారం పిటిషన్‌ను పరిశీలించే అధికారం మాత్రం మాకుంది’ ► ‘తెలంగాణ పేర్కొన్నట్లు 7.5 టీఎంసీలు తాగునీటికి అవసరం కాగా.. 90 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లు కడుతున్నారంటే సాగునీటి అవసరాలకు కూడా అని భావిస్తున్నాం. పర్యావరణ అనుమతులు కూడా తాగునీటికే ఉన్నాయి.. సాగునీటికి కాదని కమిటీ స్పష్టం చేసింది’. ► ‘అటవీ, పర్యావరణ శాఖలకు సంబంధించి అనుమతుల ప్రక్రియ పూర్తయిన తర్వాత.. కృష్ణా బోర్డు, సీడబ్ల్యూసీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతితో పనులు చేపట్టాలి’ – పాలమూరు–రంగారెడ్డి కేసులో ఎన్జీటీ -
మనోళ్లకు 'మహా' గోస!
ఈ చిత్రంలో కనిపిస్తున్నది నారాయణపేట జిల్లా కృష్ణా మండలం ముడుమాల్‌కి చెందిన సురేశ్ కుటుంబం. పొట్టకూటి కోసం ఐదేళ్ల క్రితం ఈ కుటుంబం ముంబైకి వలస వెళ్లింది. లాక్డౌన్ నేపథ్యంలో సురేశ్ తాను దాచుకున్న డబ్బులతో ఇన్నాళ్లూ కుటుంబాన్ని నెట్టుకొచ్చాడు. రెండ్రోజుల నుంచి చేతిలో చిల్లిగవ్వ లేక పస్తులు ఉండాల్సిన పరిస్థితి. బుధవారం తన తల్లి హన్మతికి ఫోన్ చేసిన సురేశ్.. తన దీనస్థితిని వివరించాడు. ‘మాకు ఇక్కడ పనులు లేవు. తినడానికి తిండి లేదు. ముడుమూల్కు వద్దామనుకున్నా రవాణా స దుపాయం లేదు. మే 3 వరకు ఎట్లనో..’అని వాపోయాడు. ఇది ఒక్క సురేశ్ సమస్య కాదు.. ముడుమాల్‌కి చెందిన మరో 50 కుటుంబాలదీ ఇదే పరిస్థితి. ఇతను మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం నాగరం దాడితండాకు చెందిన దేవదాస్. ఉపాధి కోసం భార్యాపిల్లలతో కలసి మహారాష్ట్రకు వలస వెళ్లాడు. పుణే సమీపంలో రైల్వే స్టేషన్ వద్ద నివాసం ఉంటున్నాడు. అక్కడ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కరోనా ప్రభావం వల్ల రవాణా సదుపాయం లేక సొంతూరుకు రాలేని పరిస్థితి. ఏం చేయాలో తోచక దిక్కులు చూస్తున్నాడు. ప్రతి రోజు నాగరం దాడితండాలో ఉంటున్న తన తల్లిదండ్రులతో వీడియో కాల్ చేసి మాట్లాడుతున్నాడు. దేవదాస్ లాగే మరో 30 కుటుంబాలు ఇదే సమస్యతో సతమతమవుతున్నాయి. ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఆంజనేయులు అతని భార్యాపిల్లలు. వీరిది జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం మద్దూరు. ఆరేళ్ల నుంచి పుణే సమీపంలో నివాసం ఉంటున్నారు. అక్కడే కూలీ పని చేసుకుంటూ జీనవం సాగిస్తున్నాడు. లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయాడు. కూడబెట్టుకున్న డబ్బు అంతా అయిపోయి ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నాడు. అక్కడి ప్రభుత్వం తమకు ఎలాంటి సహాయం చేయడం లేదని మద్దూరులో ఉంటున్న తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి వాపోయాడు. ఇతనితో పాటు ఇలా మరో 20 వరకు కుటుంబాలున్నాయి. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: లాక్డౌన్ నేపథ్యంలో మహారాష్ట్రలో మనోళ్లు ఇబ్బందులు పడుతున్నారు. పొట్టకూటి కోసం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి వలస వెళ్లిన సుమారు 4 వేల మంది కూలీలు దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కరోనా పుణ్యమా అని ఉపాధి కోల్పోయి.. తినడానికి తిండి లేక అలమటిస్తున్నారు. ఇన్నాళ్లూ సంపాదించిన దాంట్లో అత్యవసరాల కోసమని దాచుకున్న డబ్బంతా ఖర్చయి పోవడంతో ఆపన్నహస్తాల కోసం ఎదురు చూస్తున్నారు. ఎవరైనా నిత్యావసర సరుకులిస్తారా? అని వెయ్యి కళ్లతో నిరీక్షిస్తున్నారు. కనీసం తమ స్వస్థలాలకు వద్దామన్నా రాలేని దుస్థితిలో ఉన్నారు. ఉమ్మడి జిల్లాలోని నారాయణపేట, మక్తల్, మాగనూరు, కృష్ణా, దేవరకద్ర, వనపర్తి, గట్టు, మానవపాడు, మల్దకల్, మదనాపురం, ఘనపురం, ఆత్మకూరు, అమరచింత తదితర మండలాల పరిధిలో సుమారు నాలుగు వేల కుటుంబాలు ముంబై, పుణే తదితర ప్రాంతాలకు వలస వెళ్లారు. ఏడాదిలో రెండుసార్లు తమ స్వస్థలాలకు వచ్చి రెండు నెలలు గడిపి మళ్లీ తిరుగు పయనమవుతారు. ఆందోళనలో కుటుంబ సభ్యులు మహారాష్ట్రలో కరోనా కరాళ నృత్యం చేస్తుండటం.. వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తుండటంతో అక్కడున్న తమ వారిపై కుటుంబ సభ్యులు బెంగ పెట్టుకున్నారు. రోజుకు నాలుగైదు సార్లు ఫోన్లు చేస్తూ అక్కడి పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. ఏ మాత్రం అవకాశం ఉన్నా.. ఎంత ఖర్చయినా సరే అక్కడ్నుంచి బయల్దేరి రావాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు ధైర్యం చేసి కాలినడకన తమ స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ఇంకొందరు అక్కడక్కడ నిత్యావసర సరుకులు తెచ్చే వాహనాల్లో ఎక్కి వస్తున్నారు. మహారాష్ట్రలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల నేపథ్యంలో మహారాష్ట్ర–తెలంగాణ సరిహద్దులను పూర్తిగా మూసేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలను అధికారులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. మహారాష్ట్ర నుంచి ఎవరూ తెలంగాణలో అడుగు పెట్టకుండా అడ్డుకుంటున్నారు. అయినా కొందరు కాలినడకన, దొడ్డిదారుల గుండా రాష్ట్రంలో ప్రవేశిస్తున్నట్లు తెలుసుకున్న ప్రభుత్వం.. వారిని అడ్డుకోవాలని ఆదేశించింది. ఇక్కడికి వస్తే కేసులు నమోదు మహారాష్ట్ర నుంచి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు ఎవరూ రాకుండా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే జిల్లాలో 34 కేసులు నమోదు కావడం.. ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుట పడుతుండటంతో బయటి వ్యక్తులు జిల్లాలో ప్రవేశించకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ మేరకు మహారాష్ట్రలో ఉంటున్న కూలీలకు.. స్థానికంగా ఉన్న వారి బంధువులతో ఫోన్లు చేయించే కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా అధికారులు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో, జిల్లాలో కఠినంగా అమలవుతున్న లాక్డౌన్ గురించి వివరించడంతో పాటు గడువు ముగిసేంత వరకు ఇక్కడికి రాకుండా వారిని ఆపాలని ఆదేశిస్తున్నారు. ఒకవేళ వస్తే.. కేసులు నమోదు చేస్తామని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ ఇప్పటికే హెచ్చరించారు. దొడ్డిదారిన వస్తే క్వారంటైన్‌కు.. ► ఈ నెల 14న మహారాష్ట్ర నుంచి నారాయణపేట మండలం కొల్లంపల్లి తండాకు వస్తున్న 22 మంది కూలీలను అదే మండల పరిధిలోని ఎర్రగుట్ట చెక్‌పోస్టు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. వారిని అదే జిల్లా సింగారంలోని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. ► ముంబైకి వెళ్లిన జోగుళాంబ గద్వాల జిల్లా మల్డకల్ మండలం మద్దెలబండకు చెందిన సుమారు 20 మంది కూలీలు ఈ నెల 13న అర్ధరాత్రి జిల్లాలోకి ప్రవేశిస్తున్నట్లు సమాచారం తెలుసుకున్న పోలీసులు.. గట్టు శివారులో అడ్డుకున్నారు. మరుసటి రోజు సాయంత్రం చేతిపై ముద్ర వేసి వారి వారి ఇళ్లకు పంపి హోం క్వారంటైన్లో ఉంచారు. ► వనపర్తి జిల్లా వ్యాప్తంగా సుమారు 800 నిరుపేద కుటుంబాలు మహారాష్ట్రలో కూలీలుగా పని చేస్తుంటాయి. వారిలో 300 మంది వరకు వనపర్తి, ఖిల్లాఘనపురం మండలాల పరిధిలోని తమ స్వస్థలాలకు చేరుకున్నారు. లాక్డౌన్ పకడ్బందీగా అమలవుతుండటంతో రోజుకు నాలుగైదు కుటుంబాల చొప్పున దొడ్డిదారిన జిల్లాలో ప్రవేశిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో ఇంటింటి సర్వే చేస్తున్న అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు వీరిని గుర్తిస్తూ హోం క్వారంటైన్ చేస్తున్నారు. ఇప్పుడే రావొద్దు కరోనా విముక్తి జిల్లాలో భాగంగా నేనూ నా బాధ్యత నిర్వర్తిస్తున్న. మా గ్రామానికి చెందిన 20 కుటుంబాలకు చెందిన 50 మంది మహారాష్ట్రలోని ముంబైలో కూలీ, ఇతర పనులు చేస్తున్నారు. అక్కడా పరిస్థితులు బాగో లేవు.. ఇక్కడా బాగో లేవు. అందుకే నేనే నేరుగా అక్కడున్న వారితో మాట్లాడుతున్న. పరిస్థితులు కుదుట పడే వరకు ఇక్కడికి రావొద్దని చెబుతున్నా. నిత్యావసర సరుకుల కోసం డబ్బులు లేకపోతే అక్కడున్న గ్రామస్తులు, మండలానికి చెందిన వారి నుంచి తీసుకోవాలని చెబుతున్న. మా మండలంలో గుడిగండ్ల, మంతన్‌గోడ్ , అరుగోండ, పంచదేవ్పాడు, చిట్యాల, గ్రామాల నుంచి మూడొందలకు పైగా కుటుంబాలు వలస వెళ్లాయి. అందరూ లాక్డౌన్ వరకు అక్కడుంటేనే మేలు. – లక్ష్మమ్మ, సర్పంచ్, మాద్వార్, మక్తల్ మండలం -
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ భూ నిర్వసుల నిరసన
-
ఓటు హక్కును వినియోగించుకోని పాలమూరు కూలీలు
సాక్షి, పెద్దవూర: తెలుగు రాష్ట్రాలలో మొదటి విడతలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకోలేక పోయారు పాలమూరు కూలీలు. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబాలకు చెందిన మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు జిల్లాలకు చెందిన వందలాది మంది జడ్చర్ల–కోదాడ రోడ్డు విస్తరణ పనులలో కూలీ పనులు చేస్తున్నారు. వీరిని సంబందిత కాంట్రాక్టర్ నెలవారీ వేతనంతో కుటుంబాలకు, కుటుంబాలే జీతం చేస్తున్నారు. వీరి స్వగ్రామాలలో గురువారం లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నా ఓటు హక్కును వినియోగించుకోలేని దీన పరిస్థితిలో ఉన్నారు. తాము కేవలం సర్పంచ్ ఎన్నికల సమయంలోనే మా స్వగ్రామమైన దేవరకద్రకు వెళ్లి ఓట్లు వేసినట్లు, శాసనసభ ఎన్నికల్లోనూ ఇక్కడే ఉండి కూలీ పనులు చేసినట్లు తెలిపారు. ఓటు వేయటానికి ఊరికి వెళ్తే ఒక్కొక్కరికి రూ.300 ఖర్చు అవుతుందని, దీనికి తోడు పనికి రాకుంటే నాకాలు వేస్తారని దీనంగా పేర్కొన్నారు. -
రాష్ట్ర ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారు!
చంద్రబాబుపై మంత్రి హరీశ్‌రావు మండిపాటు సాక్షి, హైదరాబాద్ : ‘ప్రపంచంలో ఎక్కడ ప్రాజెక్టులు నిర్మించినా, అక్కడ పాలమూరు కూలీలు ఉంటారు. కానీ పాలమూరుకు మాత్రం ప్రాజెక్టు లేదు. వారికోసం ఒక ప్రాజెక్టు కడదాం అనుకుంటే అడ్డు పడుతున్నారు. మంచినీళ్ల కోసం నిర్మిస్తున్న ప్రాజెక్టును కూడా అడ్డుకుంటున్న ఒకే ఒక్క నేత చంద్రబాబు, ఒకే ఒక్క పార్టీ తెలుగుదేశం’.. అని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధికి ఆటంకాలు కల్పిస్తూ, సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని ఆయన చంద్రబాబుపై ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో మంత్రి హరీశ్‌రావు శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ ఇంకా ఆధిపత్య ధోరణి కొనసాగిస్తున్నారని విమర్శించారు. ‘శ్రీశైలంలో విద్యుత్తు ఉత్పత్తి చేస్తే అడ్డుకున్నారు. ఇప్పుడు పాలమూరు, రంగారెడ్డి, హైదరాబాద్‌లకు తాగునీరు ఇస్తామంటే అడ్డుపడుతున్నారు’ అని ధ్వజమెత్తారు. ఉమ్మడి రాష్ట్రంలోనే డిండి ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చారని వివరించారు. 2007లోనే అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఉత్తర్వులు కూడా ఇచ్చారని గుర్తు చేశారు. అలాగే కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలోనే పాలమూరు ఎత్తిపోతలకు ఉత్తర్వులు ఇచ్చారన్నారు. తెలంగాణ టీడీపీ నేతలు ఎల్.రమణ, ఎర్రబెల్లి దయాకర్‌రావులు ఏపీ వ్యవహారంపై చంద్రబాబును నిలదీయాలన్నారు. పాలమూరు ప్రాజెక్టును కట్టాలంటారా? వద్దంటారో తెలంగాణ టీడీపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. డిండి, పాలమూరు ప్రాజెక్టులు నిర్మించడానికి అన్ని హక్కులు ఉన్నాయని, పనులు మొదలు పెట్టాక అన్ని అనుమతులూ తెచ్చుకుంటామన్నారు.