palani sami
-
Tamil Nadu: ఢిల్లీకి ఎడపాడి, పన్నీర్‌సెల్వం
సాక్షి ప్రతినిధి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓటమి పాలైన నాటి నుంచి రాజకీయంగా రంగులు మారుతోంది. ముఖ్యంగా ఆ పార్టీ సమన్వయకర్త ఓ పన్నీర్‌సెల్వం, ఉపసమన్వయకర్త ఎడపాడి పళనిస్వామి మధ్య తీవ్రస్థాయిలో మనస్పర్థలు మొలకెత్తాయి. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై, ఎన్నికల తరువాత అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష స్థానం మొదలకుని అన్ని ప్రధానమైన వ్యవçహారాల్లో ఓపీఎస్, ఈపీఎస్ నడుమ అగాథం పెరుగుతూ వస్తోంది. త్వరలో పార్టీ సంస్థాగత ఎన్నికలు జరగనుండగా, ద్వంద సారథ్యానికి ఓపీఎస్, ఆయన అనుచర వర్గం అభ్యంతరం చెబుతున్నారు. దివంగత జయలలిత హయాంలో వలెనే పార్టీకి ఒకే ఒక అధినాయకత్వం ఉండాలి, అది నేనై ఉండాలి అని పన్నీర్‌సెల్వం పట్టుబడుతున్నారు. ‘స్థానికం’లో బీజేపీ ఒంటరి పోరు.. ఇదిలా ఉండగా, గడిచిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుపెట్టుకుని పోటీచేసిన బీజేపీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేయాలని దాదాపు నిర్ణయానికి వచ్చింది. కూటమి నీడనే కొనసాగితే క్షేత్రస్థాయిలో ‘కమలం’ వికసించదనే భావన బీజేపీ శ్రేణుల్లో నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తువల్లనే నాలుగుసీట్లు దక్కాయని బీజేపీలో కొందరు చేస్తున్న వాదనపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. అసెంబ్లీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలను వేర్వేరుగా చూడాలని, అదే సమయంలో అన్నాడీఎంకేతో సామరస్య ధోరణిని కొనసాగించాలని సూచించినట్లు సమాచారం. అదే జరిగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నాడీఎంకే అయోమయ పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. స్వపక్షం నుంచే పోటీగా అభ్యర్థులు రంగంలోకి దిగినపుడు ఎలాంటి వైఖరి అవలంభించాల ని అన్నాడీఎంకే మదనపడుతోంది. అధిష్టానం ఆదేశాల మేరకే స్థానిక ఎన్నికల్లో ఒంటరిపోరుపై బీజేపీ రాష్ట్రశాఖ నిర్ణయం తీసుకుందని తెలుస్తు న్నా ‘అయిననూ పోయిరావలె అనేలా ఓపీఎస్,ఈపీఎస్‌లు ఢిల్లీ బాటపట్టారు. వేర్వేరుగా ఛలో ఢిల్లీ.. ఈ నేపథ్యంలో ఓపీఎస్, ఈపీఎస్ హఠాత్తుగా వేర్వేరుగా ఢిల్లీ పయనమయ్యారు. ఆదివారం ఉదయం పన్నీర్‌సెల్వం, రాత్రి ఎడపాడి పళనిస్వామి ఢిల్లీ విమానం ఎక్కారు. ఎడపాడి కంటే ముందుగానే ఓపీఎస్ ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాలను సోమవారం కలుసుకునేలా అపాయింట్మెంట్ సాధించినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై ఉప్పందడంతో హుటాహుటిన ఎడపాడి సైతం ఢిల్లీకి బయలుదేరారు. వీరివురూ ఒకేసారి మోదీ, నడ్డాలను కలుస్తారా లేక వేర్వేరుగా భేటీ అవుతారా అనేది సోమవారంగానీ తేటతెల్లంకాదు. -
తమిళ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్.. మంత్రి రాజీనామా?
-
తమిళ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్.. మంత్రి రాజీనామా?
అన్నాడీఎంకే రాజకీయాలు రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి. ఒకవైపు విలీనం గురించి రెండు వర్గాల మధ్య చర్చలు సోమవారం మొదలవుతుంటే.. మరోవైపు ఆర్థికమంత్రి డి.జయకుమార్ తాను రాజీనామా చేస్తానంటూ ముందుకొచ్చారు. అయితే, పన్నీర్ సెల్వం వర్గానికి మంత్రి పదవులు ఇవ్వాలంటే ఇప్పుడున్న మంత్రుల్లో కొంతమంది త్యాగాలు చేయక తప్పదని, ముందుగా తానే త్యాగం చేస్తానని ఆయన చెప్పడం గమనార్హం. పార్టీ సంక్షేమం కోసం తన పదవి పోయినా పర్వాలేదని ఆయన విలేకరులతో చెప్పారు. అయితే, అదే మంత్రివర్గంలోని మరో మంత్రి దిండిగల్ సి శ్రీనివాసన్ మాత్రం మరోరకంగా స్పందించారు. మెజారీటీ ఉన్న ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం పూర్తి కాలం పాటు కొనసాగుతుందని ఆయన అన్నారు. దీన్ని బట్టి చూస్తుంటే పన్నీర్ సెల్వానికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం అంత సులభం కాదని తెలుస్తోంది. పన్నీర్ వర్గానికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్న డిమాండ్ గురించి ఆర్థిక మంత్రి జయకుమార్‌ను ప్రశ్నించగా.. ఆయన నేరుగా సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నారు. అయితే ఓపీఎస్ వర్గం డిమాండ్లు వినేందుకు సుముఖంగా ఉన్నామని మాత్రం చెప్పారు. వాళ్ల డిమాండ్లు ఏంటో బయటపెట్టాలని, రెండు వైపుల నుంచి కూడా డిమాండ్లు ఉండటం సహజమేనని, వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని జయకుమార్ అన్నారు. చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని, వాళ్లు పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చి చర్చలు మొదలుపెడితే అప్పుడు అన్ని విషయాలూ అర్థం అవుతాయని చెప్పారు. పళనిసామి వర్గం ఓ రాజీ ఫార్ములాతో సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దాని ప్రకారం ముఖ్యమంత్రి పదవితో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి కూడా పళనిసామి వర్గానికే ఇవ్వాలని, పన్నీర్ సెల్వానికి ఉపముఖ్యమంత్రి పదవి, పార్టీ కోశాధికారి పదవి ఇస్తామని వాళ్లు ఆఫర్ చేస్తున్నారని సమాచారం. వైద్యలింగాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శిగా చేసి, పళనిసామిని ముఖ్యమంత్రిగా కొనసాగించాలని అన్నాడీఎంకే ఎంపీ ఒకరు అన్నారు. మరోవైపు.. పార్టీకి ఇద్దరు ప్రధాన కార్యదర్శులను నియమించాలని, వాటిలో రెండు వర్గాలు తలొకటి తీసుకోవచ్చని కూడా పళనిసామి వర్గం చెబుతోంది. ఏది ఏమైనా సాయంత్రానికి మాత్రం ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. దాదాపు రెండు నెలల తర్వాత పార్టీ కార్యాలయంలో చర్చలు మొదలవుతున్నాయి. రెండు వర్గాలు ఎవరికి వారే డిమాండ్లు తీసుకొచ్చారు. ఒకరికి ప్రభుత్వాన్ని, మరొకరికి పార్టీని అప్పగించాలని మధ్యేమార్గంగా సూచిస్తున్నారు. కొంతమంది మంత్రులపై వేటు వేయాలని కూడా అంటున్నారు. రెండు వర్గాల వెనక బీజేపీ ఉందని కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు ఎటు తిరుగుతాయో ప్రశ్నార్థకంగా ఉంది.