Palaraju
-
అమలాపురం ఘటన కేసులో టీడీపీ,జనసేన నేతల అరెస్ట్
-
అమలాపురాన్ని పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నాం - డీఐజీ పాలరాజు
-
పోలీసుల ఆత్మస్థైర్యాన్ని చంద్రబాబు దెబ్బతీస్తున్నారు
సాక్షి, అమరావతి: వాస్తవాలు నిర్ధారించుకోకుండా ప్రతిపక్ష నేత చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు రాష్ట్ర పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా ఉన్నాయని ఏపీ పోలీస్ శాఖ టెక్నికల్ చీఫ్, డీఐజీ పాల్‌రాజ్ పేర్కొన్నారు. మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో పాల్‌రాజ్ మంగళవారం విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు వాస్తవాలు నిర్ధారించుకోకుండా పోలీసు శాఖపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు చంద్రబాబు రాసిన రెండోసారి రాసిన లేఖలోనూ చేసిన ఆరోపణలు కూడా సత్యదూరమని స్పష్టం చేశారు. పాల్‌రాజ్ ఇంకా ఏమన్నారంటే.. ► దేశంలో పోలీసు సిబ్బందిపై నమోదైన కేసుల్లో 41% ఏపీలోనే ఉన్నట్టు లేఖలో పేర్కొనడం విజ్ఞతకాదు. చిత్తూరు, విశాఖ సిటీ, విశాఖ రూరల్‌లో కేసుల డేటా తప్పుగా నమోదు కావడం వల్లే ఎన్సీఆర్బీ (నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో) లెక్కల్లో తేడాలున్నాయనే విషయాన్ని నిర్ధారించుకోకపోవడం దారుణం. ► షేక్ సత్తార్, ఆయన కుటుంబ సభ్యులు బాధితులుగా ఉన్న నాలుగు కేసుల్లో పోలీసులు తీసుకున్న చర్యలను విస్మరించడం దురదృష్టకరం. ► టీడీపీ నాయకుడు పట్టాభి కారు ధ్వంసం చేసినట్టు ఫిర్యాదు చేసిన వెంటనే విజయవాడలోని పటమట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం. పట్టాభి ఇంట్లో సీసీ కెమెరాలు సంఘటనకు ముందు నుంచి మాత్రమే పనిచేయకపోవడం దురదృష్టకరం. ► డీజీపీ సవాంగ్ దేవాలయాలకు సంబంధించిన అంశాలపై మాట్లాడితే దాన్ని తప్పుదోవ పట్టించే చంద్రబాబు, పట్టాభి... మతకల్లోల డాటాను ప్రస్తావించడం ఎంతవరకు సబబు? ► గతేడాది కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన 3 శిరోముండనం కేసుల్లో... సీతానగరంలో నిందితుడు సబ్ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేయడమే కాకుండా అరెస్టు చేసి జైలుకు తరలించారు. విశాఖ కేసులో ఏడుగురు నిందితులను, పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ► ఆలయాల వద్ద 5,400 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశాం. దేవాలయాల్లో నేరాలకు పాల్పడిన 1,093 మందిని బైండోవర్ చేశాం. ఇప్పటివరకు 29 కేసుల్లో 22 కేసులను ఛేదించడంతో పాటు 178 మంది నిందితులను అరెస్ట్ చేశాం. ► నిరసన గళాలను తొక్కి వేస్తున్నామనడం సత్యదూరం. పోలీసు శాఖ దిశ పోలీస్స్టేషన్ల ఏర్పాటు, దిశ యాప్‌తో సమర్థవంతమైన సేవలు అందిస్తోంది. ఇటువంటి ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రతిపక్ష నేత పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా విమర్శలు చేయడం సరికాదు. ఇలాంటి చర్యలు మానుకోవాలి. -
తినడానికి లేకపోతే పోలీసులే అన్నం పెట్టారు:విజయరాణి
హైదరాబాద్:తినడానికి తిండిలేని పరిస్థితుల్లో ఉన్న తనకు పోలీసులే అన్నం పెట్టారని టీవీ ఆర్టిస్టు బత్తుల విజయరాణి మీడియా ముందు వాపోయింది. ప్రస్తుతం తన వద్ద చిల్లి గవ్వ కూడా లేదని తెలిపింది. బెంగళూరులో పట్టుబడిన ఆమెను సీసీఎస్ పోలీసులు శుక్రవారం విచారించారు. పోలీస్ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ గగ్గోలు పెట్టుకుంది. తాను రూ. 10 కోట్లకు పైగా చిట్టీలతో మోసం చేయలేదని, కేవలం తాను జూనియర్ ఆర్టిస్టులకు మాత్రమే రూ.4 కోట్లు చెల్లించాల్సి ఉందని తెలిపింది. అసలు కంటే వడ్డీలే ఎక్కువ కట్టానని, అప్పులపాలు కావడంతో పారిపోయానని, తన వద్ద చిల్లిగవ్వలేదని విజయరాణి విచారణలో తెలిపింది. కోట్లాది రూపాయలు దోచుకుందని ఒకవైపు బాధితులు చెప్తుంటే... మరోవైపు ఆమె తన వద్ద ఒక్కపైసాకూడా లేదని చెప్పడంతో ఈ కేసును పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. విజయరాణిని విచారించిన సీసీఎస్ పోలీసులు .. ఆమె టీవీ ఆర్టిస్టుల వద్ద చిట్టీల పేరుతో రెండు కోట్లను వసూలు చేసిందని తెలిపారు. ఇప్పటికే ఆమె పేరిట ఉన్న ఆస్తులను జప్తు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆస్తులతో వచ్చిన డబ్బులను బాధితులకు అందజేస్తామన్నారు. -
చేతులేత్తేసిన ‘చిట్టీలరాణి’
అసలు కంటే వడ్డీలే ఎక్కువ కట్టానని వెల్లడి తన వద్ద చిల్లిగవ్వలేదని పోలీసుల విచార ణలో ఏకరవు సాక్షి, సిటీబ్యూరో: బెంగళూరులో పట్టుబడిన టీవీ ఆర్టిస్టు బత్తుల విజయరాణి (46)ని సీసీఎస్ పోలీసులు గురువారం నగరానికి తీసుకొచ్చారు. ఓ రహాస్య ప్రదేశంలో సీసీఎస్ ఏసీపీ విజయ్‌కుమార్ ఆమెను విచారిస్తున్నారు. విజయరాణి రూ.10 కోట్లకుపైగా చిట్టీలు, అధిక వడ్డీల పేరుపై డబ్బులు వసూలు చేసుకొని పారిపోయిందని బాధితుల కథనం ప్రకా రం నిన్నటి వరకూ అనుకున్నారు. అయితే విచారణలో మాత్రం అందుకు భిన్నంగా కథనాలు వినిపిస్తున్నాయి. అసలు తాను ఎవరికీ ఒక్కపైసా కూడా ఇవ్వాల్సి లేదని, అసలు కంటే వడ్డీలే ఎక్కువ కట్టానని, అప్పులపాలు కావడంతో పారిపోయానని, తన వద్ద చిల్లిగవ్వలేదని విజయరాణి విచారణలో ఏకరువు పెట్టినట్టు సమాచారం. కోట్లాది రూపాయలు దోచుకుందని ఒకవైపు బాధితులు చెప్తుంటే... మరోవైపు ఆమె తన వద్ద ఒక్కపైసాకూడా లేదని చెప్పడం విడ్డూరంగా ఉందని పోలీసులంటున్నారు. అసలు ఈ ఉదంతంలో వడ్డీల పేరుతో ఆమెకు ఎంత మంది ఎంత డబ్బు ఇచ్చారు..? ఆమె వద్ద చిట్టీలు ఎవరు ఎత్తుకున్నారు..? ఇంకా చిట్టీలు ఎత్తుకోని వారు ఎందరు?.. చిట్టీలు ఎత్తుకుని డబ్బులు కట్టని వారు ఎంత మంది?... ఇలా బాధితుల నుంచి వేర్వేరుగా వివరాలను సీసీఎస్ పోలీసులు సేకరిస్తున్నారు. ఆ తర్వాతే డబ్బు ఎవరి వద్ద ఉంది అనే అంశం తేలుతుందని పోలీసులు భావిస్తున్నారు. వియజరాణి వద్ద నిజంగా డబ్బు లేదా? ఉండే నాటకం ఆడుతుందా.. అనే కోణాల్లో పోలీసులు ఆరా తీస్తున్నారు. విజయరాణి ఎదుటే బాధితులను కూర్చోబెట్టి ప్రశ్నించాలని పోలీసులనుకుంటున్నారు. నగరంలోని ఆమె రెండు ఇళ్లతో పాటు గుడివాడలోని ఇల్లును కూడా విక్రయించిందని తేలింది. విక్రయించగా వచ్చిన డబ్బు ఎక్కడ ఉంది? ఎవరికిచ్చింది అనే విషయంపై కూడా పోలీసులు దృష్టి పెట్టారు. వడ్డీల రూపంలో ఆమె నుంచి ఎవరెవరు ఎంత పెద్దమొత్తం తీసుకున్నారు అనే వివరాలపై ఇప్పటికే సీసీఎస్ పోలీసులు ఆరా తీశారు. అధిక వడ్డీలు ఇవ్వడం వల్లనే ఆమె నష్టపోయిందా అనేది సందేహం కలిగిస్తోంది. గతనెలలో నమోదైన కుట్ర, మోసం కేసులో విజయరాణితో పాటు ఆమెకు సహకరించిన మరో 11 మందిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ఇక ఆమె ఇళ్లను ఖరీదు చేసిన వారిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. నిజానికి వీరు ఆమెకు నగదు ఇచ్చి ఇళ్లు ఖరీదు చేశారా? లేక వారికి డబ్బులు బాకీ ఉంటే ఇళ్లను కబ్జా చేశారా అనే విషయాలు తేలాల్సి ఉంది. ఆమె విక్రయించిన మూడిళ్లను ఇప్పటికే పోలీసులు సీజ్ చేశారు. బెంగళూరుకు పారిపోయిన విజయరాణి బృందం అక్కడ కూడా నాలుగు ఇల్లు మార్చి పోలీసులను ముప్పుతిప్పలు పెట్టింది. ప్రతి రోజు సెల్నెంబర్లను మారుస్తూ పోలీసుల దృష్టి మరల్చింది. -
'రూ.3కోట్లు వసూలు చేసిన మాట నిజమే'
హైదరాబాద్ : తోటి నటీనటులకు చిట్టీల పేరుతో శఠగోపం పెట్టి పారిపోయిన టీవీ ఆర్టిస్టు బత్తుల విజయరాణి తాను రూ. 3 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు స్వయంగా అంగీకరించింది. బెంగళూరులో నిన్న విజయలక్ష్మిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులు ఇంకా విచారిస్తున్నారు. అధిక వడ్డీకి కూడా ఆమె రుణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో మరికొంతమందిని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు వున్నాయి. చిట్టీల పేరుతో పలువురు ఆర్టిస్టులకు డబ్బు ఎగగొట్టిన విజయరాణి నెల రోజుల క్రితం పరారైన విషయం తెలిసిందే. బాధితుల ఫిర్యాదు మేరకు విజయరాణితో పాటు చెల్లెలు బి.సుధారాణి, నాని, శరణ్, శ్రీనివాస్‌రావు, హరిబాబు, దుర్గ, రమేష్‌లపై చీటింగ్, కుట్ర కేసులను సీసీఎస్ పోలీసులు నమోదు చేశారు. విజయరాణికి చెందిన రెండు ఇళ్లతో పాటు కారును కూడా పోలీసులు సీజ్ చేశారు. వారి కోసం ఆరు పోలీస్ ప్రత్యేక బృందాలు వెతికాయి. కూకట్‌పల్లిలోని ఓ లారీ ట్రాన్స్పోర్ట్ కార్యాలయ సిబ్బంది ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రత్యేక బృందం బెంగుళూరు వెళ్లి వారిని పట్టుకుంది. బత్తుల విజయరాణి, పాలరాజు, చిట్టీలు, టీవీ ఆర్టీస్టులు, tv artist, Battula Vijayarani, Palaraju, ccs police -
'రూ.3కోట్లు వసూలు చేసిన మాట వాస్తవమే'
-
‘చిట్టీలరాణి’ దొరికేనా..!
హైదరాబాద్ : టీవీ ఆర్టిస్టులకు రూ.10 కోట్లకుపైగా శఠగోపం పెట్టి పారిపోయిన టీవీ ఆర్టిస్టు బత్తుల విజయరాణి నెల కావొస్తున్నా నేటికీ ఆచూకీ దొరకలేదు. బాధితుల ఫిర్యాదు మేరకు సీసీఎస్ డీసీపీ పాలరాజు ఆమెతో పాటు చెల్లెలు బి.సుధారాణి, నాని, శరణ్, శ్రీనివాస్‌రావు, హరిబాబు, దుర్గ, రమేష్‌లపై చీటింగ్, కుట్ర కేసు నమోదు చేశారు. విజయరాణిని అరెస్టు చేయాలని బాధితులు వరుసగా ఆందోళనలు చేయడంతో నిందితురాలికి చెందిన రెండు ఇళ్లతో పాటు కారును పోలీసులు సీజ్ చేశారు. అయితే నేటి వరకు అసలు నిందితురాలి ఆచూకీ తెలియరాలేదు. ఇంటి సామానులతో సహా ఆమె బెంగుళూరుకు పారిపోయి ఉంటుందని కూకట్‌పల్లిలోని ఓ లారీ ట్రాన్స్పోర్ట్ కార్యాలయ సిబ్బంది ఇచ్చిన క్లూ ఆధారంగా ప్రత్యేక బృందం బెంగుళూరు వెళ్లి వచ్చింది. అయినా ఆమె ఆచూకీ దొరకలేదు. రెండేళ్ల నుంచే పక్కా పథకం వేసుకున్న విజయరాణి చిట్టీల పేరుతోనే కాకుండా తెలిసివారందరి దగ్గర అధిక వడ్డీ పేరుతో కోట్లాది రూపాయలు అప్పు చేసింది. అంతేకాకుండా తన కుమారుడు సినిమాలో హీరో అవుతున్నాడని నమ్మించి బంధువులు వద్ద నుంచి బంగారు ఆభరణాలను సైతం తీసుకుంది. ఆ తరువాత తన పేరుపై ఉన్న ఆస్తులన్నింటినీ అమ్మేసి ఇంటి సామానుతో పారిపోయింది. ఇంతవరకు ఆమె, మిగిలిన నిందితుల ఆచూకీ లభించకపోవడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. అయితే, నిందితుల కోసం గాలిస్తున్నామని, ఇతర రాష్ట్రాలకు కూడా ప్రత్యేక బృందాలను పంపినా ఇంత వరకు ఆచూకీ లభించలేదని, త్వరలోనే అరెస్టు చేస్తామని సీసీఎస్ అధికారులు అంటున్నారు. -
‘సైబర్ ముఠా’పై ఐబీ ఆరా
సీసీఎస్‌కు వచ్చి వెళ్లిన ఉన్నతాధికారులు కేసు వివరాల సేకరణ నిందితుల కస్టడీ కోరుతూ పోలీసుల పిటిషన్ ఐటీ, డీఓటీలకూ లేఖలు రాయాలని నిర్ణయం సాక్షి, సిటీబ్యూరో: ‘+92’ నెంబర్‌తో ఫోన్లు చేసి జనాన్ని నిండా ముంచుతున్న ముఠా గురించి కేంద్ర నిఘా విభాగం (ఐబీ) ఆరా తీస్తోంది. ఈ గ్యాంగ్‌కు చెందిన ముగ్గురు నిందితుల్ని నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్)లోని సైబర్‌క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసిన విషయం విదితమే. శనివారం సీసీఎస్ పోలీసుల్ని కలుసుకున్న ఐబీ అధికారులు ఈ కేసులోని ప్రాథమిక అంశాలను తెలుసుకున్నారు. ఈ గ్యాంగ్‌కు దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు దుబాయ్, పాకిస్తాన్ల్లోనూ నెట్వర్క్ ఉండటంతో లోతుగా దర్యాప్తు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ముగ్గురు నిందితుల్నీ తదుపరి విచారణ నిమిత్తం తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ సైబర్‌క్రైమ్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ‘+92’ ఫోన్ కాల్స్ బారినపడ్డామంటూ గడిచిన ఆరు నెలల్లో సైబర్ క్రైమ్ పోలీసులు 16 ఫిర్యాదులందాయి. ఈ బాధితులు దాదాపు రూ.24 లక్షలు కోల్పోయారు. కాచిగూడకు చెందిన గృహిణి ఆవేదనతో ‘+92’ కేసుల దర్యాప్తునకు కీలక ప్రాధాన్యం ఇచ్చిన డీసీపీ జి.పాలరాజు ప్రత్యేకృ బృందాన్ని రంగంలోకి దింపారు. సాంకేతికంగా దర్యాప్తు చేసిన ఈ బృందం ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌కు చెందిన షహెన్షా, మహ్మద్ అఫ్తాబ్‌లతో పాటు బీహార్‌లోని పట్నాకు చెందిన సుజీత్‌కుమార్‌లను అరెస్టు చేసింది. వీరి విచారణలోనే దుబాయ్, పాకిస్తాన్లకు చెందిన కోణాలు వెలుగులోకి వచ్చాయి. ఐఎస్ఐ అనుమానంతోనే ఐబీ... ఇప్పటి వరకు విధ్వంసాలు సృష్టించే ఉగ్రవాద సంస్థలకు సహాయసహకారాలు అందించడం, నకిలీ నోట్లను గు ప్పించడం ద్వారా పాకిస్తాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) మన దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తోంది. అయితే, ఇది ఇప్పుడు దుబాయ్‌తో పాటు భారత్‌లోనూ మాడ్యుల్స్‌ను ఏర్పాటు చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు నిందితులు వెల్లడించిన అంశాల ఆధారంగా సీసీఎస్ పోలీసులు అంచనా వేశారు. దీంతో దేశభద్రతకు సంబంధించిన అంశంగా పరిగణించి ఐబీకి సమాచారమిచ్చారు. కేసు వివరాలను సేకరించిన ఐబీ అధికారులు విదేశీ కోణాన్ని లోతుగా ఆరా తీస్తున్నారు. ‘+92 నేరాలకు’ సంబంధించిన డబ్బును ప్రత్యేక హవాలా విధానం ద్వారా దుబాయ్ మీదుగా పాకిస్తాన్‌కు తరలిస్తుండటాన్ని ఆదాయపుపన్ను (ఐటీ) శాఖ దృష్టికి లేఖ ద్వారా తీసుకువెళ్లాలని సీసీఎస్ అధికారులు నిర్ణయించారు. బాలీ వుడ్ స్టార్ అమితాబచ్చన్ నిర్వహించిన కౌన్ బనేగా కరోడ్‌పతీ (కేబీసీ) నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్తున్న ఈ మోసగాళ్లు టార్గెట్ చేసిన వారి గుర్తింపుపత్రాలతో ప్రత్యేకంగా సర్టిఫికెట్లు తయా రు చేయించి ఈ-మెయిల్ చేశారు. దీని కోసం నిందితులు ప్రాక్సీ మెయిల్ ఐడీ లు వినియోగించినట్లు తేలడంతో ఈ సర్వర్ల వివరాలు అందించాల్సిందిగా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం (డీఓటీ)కి లేఖ రాశారు. కీలక వ్యక్తుల కోసం వేట... ఈ తరహా ముఠాలు మధ్యప్రదేశ్, వెస్ట్‌బెంగాల్, కేరళ, ఢిల్లీ, బీహార్‌ల్లోనూ ఉన్నట్లు గుర్తించిన సీసీఎస్ పోలీసులు కీలక వ్యక్తుల్ని పట్టుకోవాలని నిర్ణయించారు. దీంతో పాటు ఇతర ఆధారాల సేకరణ కోసం ముగ్గురు నింది తుల్నీ తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై బుధవారం న్యాయస్థానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నిందితులపై అన్ లాఫ ుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద ఆరోపణలు నమోదు చేయడంతో దర్యాప్తును ఏసీపీ స్థాయి అధికారికి అప్పగించారు. నిందితుల వద్ద నుంచి పోలీ సులు స్వాధీనం చేసుకున్న వాటిలో బోగస్ ఓటర్ ఐడీలు, ఆధార్ కార్డులతో పాటు .38 తూటాలూ ఉన్నాయి. బోగస్‌వి ఎలా సేకరిస్తున్నారు? తూటాలు ఎందుకు దగ్గర పెట్టుకున్నారు? అనే అం శాల పైనా దృష్టి పెట్టి దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు సైబర్ నేగాళ్లను కస్టడీకి తీసుకున్నాక ఉత్తరాదికి తీసుకెళ్లి మిగిలిన నిందితుల కోసం వేటాడాలని సీసీఎస్ అధికారులు భావిస్తున్నారు. -
మోసగాళ్లకు సస్పెక్ట్ షీట్‌తో చెక్
సాక్షి, సిటీబ్యూరో: రౌడీలపై రౌడీషీట్.. చోరులపై సిటీ డోషియర్ క్రిమినల్ షీట్.. సమస్యాత్మక వ్యక్తులపై హిస్టరీ షీట్.. మత పరమైన నేరాలు చేసిన వారిపై కమ్యూనల్ షీట్.. కబ్జాకోరులపై ల్యాండ్ గ్రాబర్ షీట్.. ఇవీ ప్రస్తుతం అమలవుతున్న విధానాలు. వీటికి అదనంగా హైదరాబాద్ పోలీసులు తొలిసారిగా మోసగాళ్లపై సస్పెక్ట్ షీట్ తెరుస్తున్నారు. వైట్‌కాలర్ అఫెన్సులతో పాటు సైబర్ నేరాలకు పాల్పడిన వారిపై కూడా దీన్ని తెరుస్తున్నామని హైదరాబాద్ నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) డీసీపీ జి.పాలరాజు ఆదివారం విలేకరుల సమావేశంలో తెలిపారు. సైబర్ క్రైమ్ ఠాణా అధికారులు అరెస్టు చేసిన మల్టీ లెవల్ మార్కెటింగ్ (ఎమ్ఎల్ఎమ్) మోసగాళ్లు రత్నకుమారి, పండులపై తొలిషీట్లు ఓపెన్ చేస్తున్నామని ప్రకటించారు. ‘‘ప్రస్తుతం మోసగాళ్లపై తెరుస్తున్న సస్పెక్ట్ షీట్లను త్వరలో అన్ని రకాలైన ప్రాపర్టీ అఫెండర్లుకూ వర్తింపజేస్తాం. వీరు జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన వెంటనే స్థానిక పోలీసుస్టేషన్‌కు సమాచారం ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. తద్వారా ఠాణా సిబ్బందితో పాటు బీట్ కానిస్టేబుళ్లు, గస్తీ బృందాలు, స్పెషల్‌బ్రాంచ్ అధికారులు నిత్యం వీరిపై కన్నేసి ఉంచుతారు. నేరగాళ్ల వివరాలు స్థానిక పోలీసుస్టేషన్లు, వెబ్సైట్లో అందుబాటులో ఉండటంతో ప్రజలూ అప్రమత్తం కావడానికి అవకాశం ఉంటుంది’’ అని డీసీపీ పాలరాజు తెలిపారు. ఎవరిపై ఎలా..: ఏటా నమోదవుతున్న నేరాల్లో 85 శాతం పాత నేరగాళ్లే నిందితులుగా ఉంటున్నారు. వీరిపై కన్నేసి ఉంచడం ద్వారా నేరాల్ని నిరోధించడంతో పాటు అప్పటికే చోటు చేసుకున్న వాటిని కొలిక్కి తేవడం తేలికవుతుందని సీసీఎస్ పోలీసులు భావిస్తున్నారు. ఇలాంటి రిపీటెడ్ అఫెండర్స్‌పై ఉక్కుపాదం మోపడానికి ప్రారంభించిన విధానమే సస్పెక్ట్ షీట్ తెరవడం. ఇప్పటి వరకు అసాంఘిక శక్తులపై చట్ట పరిధిలో తెరుస్తున్న షీట్లలో స్వల్ప మార్పులతో సీసీఎస్ అధికారులు ఈ షీట్లు నమోదు చేస్తారు. నేరగాళ్లకు సంబంధించిన ఫొటో, చిరునామా సహా పూర్తి సమాచారం ఇందులో పొందుపరుస్తారు. ఈ వివరాలను సదరు నేరగాళ్లు ఏ ఠాణా పరిధిలో నివసిస్తుంటే ఆ పోలీసుస్టేషన్‌కు పంపుతారు. ఆయా ఠాణాల్లో వీరి ఫొటోలను అందుబాటులో ఉంచుతారు. ఈ షీట్లో నిందితుడు ఇప్పటి వరకు చేసిన నేరాలు, అనుసరించిన విధానాలు (మోడెస్ ఆపరెండీ), కోర్టులు, దర్యాప్తు దశల్లో ఉన్న కేసుల స్థితిగతులు తదితరాలను పొందు పరుస్తారు. దీనివల్ల పోలీసు అధికారులు మారినప్పటికీ నేరగాళ్లపై పక్కా నిఘా ఉంచడానికి అవకాశం ఉంటుంది. వెబ్సైట్లో నేరగాళ్ల వివరాలు: సామాన్యులు, మోసగాళ్ల ఎత్తులకు ఆకర్షితులవుతున్న వారు ఠాణాలకు వెళ్లి వివరాలు సరిచూసుకోవడం సాధ్యం కాదని భావిస్తున్న సీసీఎస్ పోలీసులు ఈ వివరాలను హైదరాబాద్ పోలీసు వెబ్సైట్ (ఠీఠీఠీ.జిడఛ్ఛీట్చఛ్చఛీఞౌజీఛ్ఛి.జౌఠి.జీ)లోనూ ప్రత్యేక లింకు ఏర్పాటు చేయడం ద్వారా అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. దీనివల్ల ప్రతి ఒక్కరూ ఇంటర్ నెట్ ద్వారా మోసాగాళ్ల వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది.