బిజినెస్@పార్లమెంట్
దేశీ ఎయిర్లైన్స్ నిబంధనల సడలింపు
దేశీ విమానయాన సంస్థలు విదేశాలకు సర్వీసులు నడపాలంటే అయిదేళ్లపాటు దేశీయంగా సేవలు అందించడంతో పాటు 20 విమానాలు ఉండాలనే 5/20 నిబంధనను సవరించనున్నట్లు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మహేశ్ శర్మ రాజ్యసభకు తెలిపారు.
మొండిబకాయిలు: ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండి బకాయిల్లో సుమారు రూ. 28,152 కోట్లు టాప్ 10 రుణగ్రస్తుల నుంచి రావాల్సి ఉంది. మొత్తం రుణాల్లో ఇది 1.73 శాతం. రూ. 1,000 కోట్ల పైచిలుకు రుణాలు తీసుకున్న వారు 433 మంది ఉన్నారని ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్
సిన్హా రాజ్యసభ కు వివరించారు.
పన్నుల రిఫండ్: గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో రూ. 1.19 లక్షల కోట్ల మేర ఆదాయ పన్ను రిఫండ్లు పెండింగ్లో ఉన్నట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా రాజ్యసభకు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ మొత్తం రూ. 68,032 కోట్లుగా ఉన్నట్లు వివరించారు.