Pallekele
-
Asia Cup: కొలంబోలో ఎడతెగని వర్షాలు.. ఏసీసీ కీలక నిర్ణయం! ఇక..
Asia Cup 2023: కొలంబోలో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఆసియా క్రికెట్ మండలి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొలంబోలో వర్షాల నేపథ్యంలో ఆసియా కప్-2023 ఫైనల్ వేదికను మార్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. కాగా ఈ వన్డే టోర్నీని నిర్వహించేందుకు పాకిస్తాన్ ఆతిథ్య హక్కులు దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా ఆటగాళ్లను పాక్‌కు పంపేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి ససేమిరా ఒప్పుకోలేదు. ఈ క్రమంలో అనేక చర్చల తర్వాత శ్రీలంకతో కలిసి పాకిస్తాన్ హైబ్రిడ్ విధానంలో ఆసియా కప్ నిర్వహణకు అంగీకరించింది. శ్రీలంకతో కలిసి సంయుక్తంగా పాక్ భారత జట్టు ఆడే మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో జరిగేందుకు వీలుగా ఏసీసీ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే గ్రూప్ స్టేజీలో వివిధ వేదికల్లో నిర్వహించిన మ్యాచ్‌లలో గ్రూప్-ఏ నుంచి టీమిండియా, పాకిస్తాన్.. గ్రూప్-బి నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్ సూపర్-4 దశకు చేరుకున్నాయి. ఇప్పటికే చిరకాల ప్రత్యర్థుల పోరు వర్షార్పణం అయితే, కొలంబోలో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే పల్లెకెల్లెలో దాయాదుల మ్యాచ్ వర్షార్పణం కావడంతో.. ఆదివారం నాటి భారత్- పాక్ పోరుకు రిజర్వ్ డే కేటాయించారు. చిరకాల ప్రత్యర్థుల పోటీ నేపథ్యంలో ఏసీసీ ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ వరుణుడు కరుణించే అవకాశాలు కనిపించడం లేదు. ఆర్. ప్రేమదాస స్టేడియంలో ఆదివారం 24.1 ఓవర్ల టీమిండియా స్కోరు 147/2 వద్ద ఉండగా ఆటకు ఆటంకం కలిగించిన వర్షం.. సోమవారం కూడా అడ్డంకిగా మారింది. దీంతో మధ్యాహ్నం మూడు గంటలకు మొదలుకావాల్సిన మ్యాచ్ గంట తర్వాత కూడా ఇంకా ఆరంభం కాలేదు. ఫైనల్ ఒక్కటే కాదు.. ఆ మ్యాచ్‌ల వేదికలోనూ మార్పులు? ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఫైనల్ వేదిక మార్పుపై ఏసీసీ దృష్టి సారించినట్లు సమాచారం. వాస్తవానికి కొలంబోలో సెప్టెంబరు 17న ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే, ఆరోజు కూడా వర్షం ముప్పు సూచనలు ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో క్యాండీలోని పల్లెకెల్లె స్టేడియంలో ఫైనల్ నిర్వహణకు ఏసీసీ మొగ్గుచూపుతున్నట్లు టైమ్స్‌నౌ తన కథనంలో పేర్కొంది. మిగిలిన మ్యాచ్‌ల(భారత్- శ్రీలంక, పాక్- శ్రీలంక, భారత్- బంగ్లాదేశ్) మ్యాచ్‌ల వేదికలు కూడా మార్చే యోచనలో ఉన్నట్లు మరో జాతీయ మీడియా పేర్కొంది. చదవండి: చిక్కుల్లో పాక్ క్రికెట్ జట్టు.. ఐసీసీ సీరియస్! ఏమైందంటే? -
మెగా టోర్నీకి ముందు బంగ్లాదేశ్‌కు భారీ షాక్.. స్టార్ పేసర్ అవుట్
Ebadot Hossain ruled out of Bangladesh's Asia Cup 2023 squad: ఆసియా కప్-2023 టోర్నీ ఆరంభానికి ముందు బంగ్లాదేశ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. రైట్ ఆర్మ్ పేసర్ ఇబాదత్ హుసేన్ చౌధురి జట్టుకు దూరమయ్యాడు. గాయం కారణంగా మెగా టోర్నీకి అందుబాటులో లేకుండా పోయాడు. ఈ క్రమంలో అతడి స్థానాన్ని యువ సంచలనం తంజీమ్ హసన్ సకీబ్తో బంగ్లా క్రికెట్ బోర్డు భర్తీ చేసింది. కాగా ఆగష్టు 30 నుంచి పాకిస్తాన్, శ్రీలంక వేదికలుగా ఆసియా కప్ నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. ఈ క్రమంలో ఈ వన్డే టోర్నీకై ఆగష్టు 12న బంగ్లాదేశ్ 17 మంది సభ్యులతో కూడిన ప్రధాన జట్టును ఎంపిక చేసింది. అదే విధంగా తైజుల్ ఇస్లాం, సైఫ్ హసన్, తంజీమ్ హసన్ సకీబ్లను స్టాండ్ బై ప్లేయర్లుగా ఎంపిక చేసింది. ఆరు వారాల విశ్రాంతి అవసరం అయితే, ప్రధాన జట్టులో సభ్యుడైన ఇబాదత్ హుసేన్ పూర్తిగా కోలుకోలేదు. సొంతగడ్డపై అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్ సందర్భంగా గాయపడ్డ అతడికి మరికొన్నాళ్ల పాటు విశ్రాంతి అవసరమైనట్లు బీసీబీ చీఫ్ స్పోర్ట్స్ ఫిజీషియన్ డాక్టర్ దేబాశిష్ చౌధురి తెలిపాడు. తొడ కండరాల నొప్పితో బాధపడుతున్న 29 ఏళ్ల ఇబాదత్కు ఆరు వారాల పాటు రెస్ట్ కావాలని పేర్కొన్నాడు. కాబట్టి ఆసియా కప్ టోర్నీకి అతడు దూరం కానున్నట్లు దేబాశిష్ వెల్లడించాడు. ఇబాదత్ నొప్పి తీవ్రమైందని.. అయితే, వరల్డ్‌కప్ నాటికి అతడు మైదానంలో దిగే విధంగా చికిత్స అందిస్తామని పేర్కొన్నాడు. యువ ఆటగాడికి లక్కీ ఛాన్స్ అవసరమైతే విదేశాల్లో ట్రీట్మెంట్ చేయించేందుకు బంగ్లా బోర్డు సిద్ధంగా ఉందని తెలిపాడు. కాగా ఇబాదత్ హుసేన్ దూరమైన కారణంగా తంజీమ్ హసన్ సకీబ్‌కు ప్రమోషన్ లభించింది. అండర్-19 వరల్డ్‌కప్ 2020 గెలిచిన జట్టులో తంజీమ్ సభ్యుడు. ఇటీవల ముగిసిన ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ ఆసియా కప్‌లో ఈ రైట్ ఆర్మ్ పేసర్ మూడు మ్యాచ్‌లు ఆడి తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. పల్లకెలె వేదికగా శ్రీలంకతో మ్యాచ్‌తో బంగ్లాదేశ్ ఆసియా కప్-2023లో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఆసియా కప్-2023కి బంగ్లాదేశ్ జట్టు షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), లిట్టన్ దాస్, తాంజిద్ హసన్ తమీమ్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, తౌహిద్ హృదోయ్, ముష్ఫికర్ రహీమ్, మెహిదీ హసన్ మిరాజ్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, హసన్ మముద్, మెహదీ హసన్, నసూమ్ అహ్మద్, షమీమ్ హుస్సేన్, అఫిఫ్ హుస్సేన్, షోరిఫుల్ ఇస్లాం, ఇబాదత్ హుసేన్, మహ్మద్ నయీమ్ స్టాండ్ బై ప్లేయర్లు - తైజుల్ ఇస్లాం, సైఫ్ హసన్, తంజీమ్ హసన్ సకీబ్. చదవండి: వరల్డ్‌కప్ జట్టులో రోహిత్ వద్దంటూ.. ధోని అతడి కోసం పట్టుబట్టాడు! వెంటనే కోచ్.. -
లంక స్పిన్ మ్యాజిక్.. ఆసీస్ స్వల్పస్కోరు
పల్లెకెలె: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో తమ తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా స్వల్ప స్కోరుకే ఆలౌటైంది. చివరి వికెట్ గా లియాన్(17)ను సందకన్ పెవిలియన్ చేర్చడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. స్పిన్నర్లు హెరాత్(4/49) టాపార్డర్ పని పట్టగా, సందకన్ (4/58) లోయర్ ఆర్డర్ ను పెవిలియన్ బాట పట్టించడంతో 79.2 ఓవర్లలో 203 పరుగుల వద్ద ఆసీస్ ఆలౌటైంది. ఆసీస్ 87 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంలో ఉంది. లంక తమ తొలి ఇన్నింగ్స్ లో 117 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన లంక 6 పరుగుల వద్ద ఓపెనర్ పెరీరా(4) వికెట్ కోల్పోయింది. ఆటగాళ్లు లంచ్ విరామం తీసుకోగా వర్షం ఎడతెరపి లేకుండా కురియడంతో రెండో రోజు ఆట నిలిపివేశారు. అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 66/2తో బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ మరో మూడు పరుగులు జోడించగానే మూడో వికెట్ కోల్పోయింది. స్మిత్ (30) హెరాత్ బౌలింగ్ లో ముందుకొచ్చి ఆడగా కీపర్ చండిమాల్ అద్భుతంగా స్టంప్ ఔట్ చేశాడు. హెరాత్ తన మరుసటి ఓవర్లో ఖవాజా(26)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో 70 పరుగులకే ఆసీస్ టాపార్డర్ 4 వికెట్లను కోల్పోయింది. మార్ష్ (63 బంతుల్లో 31; 5 పోర్లు), వోజెస్(115 బంతుల్లో 47; 3 పోర్లు) ఐదో వికెట్ కు 60 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరూ పోరాడకుంటే ఆసీస్ స్కోరు 200 కూడా దాటపోయేది. అక్కడి నుంచి ఆసీస్ వరుస విరామాలలో నెవిల్(2), వోజెస్(47), స్టార్క్(11), కీఫె(23), లియాన్(17) వికెట్లు కోల్పోయింది. లంక బౌలర్లలో హెరాత్(4/49) టాపార్డర్ పని పట్టగా, సందకన్ (4/58) లోయర్ ఆర్డర్ ను పెవిలియన్ బాట పట్టించాడు. మరో బౌలర్ ప్రదీప్ 2 వికెట్లు తీశాడు. అంతకుముందు ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియోన్ (3/12), పేసర్ హాజెల్‌వుడ్ (3/21) ధాటికి లంక తొలి ఇన్నింగ్స్ లో 117 పరుగులకే ఆలౌటైంది.