Pallevelugu buses
-
రాఖీ పండుగ: టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు ముఖ్య గమనిక
సాక్షి, హైదరాబాద్: టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు ముఖ్య గమనిక. రాఖీ పౌర్ణమికి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ అందిస్తున్న టీ-9 టికెట్లను తాత్కాలికగా నిలిపివేస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ సోమవారం ఓ ప్రకటనలో ప్రకటించింది. నాలుగు రోజుల పాటు టికెట్‌ను నిలిపివేస్తున్నట్టు పేర్కొంది. వివరాల ప్రకారం.. తెలంగాణలో రాఖీ పౌర్ణమి పండుగ నేపథ్యంలో మంగళవారం నుంచి 4 రోజుల పాటు టీ-9 టికెట్ల నిలుపుదల అమల్లో ఉంటుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. అయితే, సెప్టెంబర్ 2 నుంచి ఈ టికెట్ల అమలు యథాతథంగా కొనసాగుతుందని టీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది. కాగా, పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణికులకు టీ-9 పేరుతో రెండు టికెట్లను సంస్థ జారీ చేస్తోంది. ఇదిలా ఉండగా.. టీఎస్ఆర్టీసీ 60 కి.మీ. పరిధిలో రానుపోను ప్రయాణానికి టీ-9-60ని, 30 కి.మీ. టీ-9-30 టికెట్లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. టీ-9-60 టికెట్‌ను రూ.100కు, టీ-9-30 టికెట్‌ను రూ.50కి ప్రయాణికులకు సంస్థ అందజేస్తోంది. రాఖీ పౌర్ణమికి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా టి-9 టికెట్లను తాత్కాలికగా నిలిపివేస్తున్నట్లు #TSRTC ప్రకటించింది. రేపటి నుంచి నాలుగు రోజుల పాటు నిలుపుదల అమల్లో ఉంటుందని తెలిపింది. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి ఈ టికెట్లు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. పల్లె వెలుగు బస్సుల్లో… — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) August 28, 2023 టికెట్ల నిలుపుదలపై ఎండీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా..‘రాఖీ పౌర్ణమికి బస్సుల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో టీ-9 టికెట్లను మంజూరు చేయడం సిబ్బందికి కష్టం. టికెట్ల జారీకి ప్రయాణికుడి జెండర్, వయసు, తదితర వివరాలను టిమ్ మిషన్లలో నమోదు చేయాల్సి ఉంటుంది. రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు అందుకు చాలా సమయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే టి-9 టికెట్లను తాత్కాలికంగా నిలుపుదల చేయాలని సంస్థ నిర్ణయించింది. రేపటి నుంచి సెప్టెంబర్ 1 వరకు నాలుగు రోజుల పాటు ఈ నిలుపుదల అమల్లో ఉంటుంది. సెప్టెంబర్ 2 నుంచి యథాతథంగా ఈ టి-9 టికెట్లు కొనసాగుతాయి’ అని తెలిపారు. ఇది కూడా చదవండి: వినాయక చవితిపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కీలక ప్రకటన -
ఇక.. రోడ్ల మీదకి పచ్చ వెలుగులు!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఏపీలో అమల్లో ఉన్న ఒక్కో పథకానికీ పేరు మార్చుకుంటూ వస్తున్న చంద్రబాబు ప్రభుత్వం తాజాగా పల్లె వెలుగు బస్సులకు కూడా పేరు మార్చాలని నిర్ణయించింది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో సంస్కరణల పేరుతో పల్లె వెలుగు బస్సులను పచ్చ వెలుగు బస్సులుగా మార్చడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. పల్లె వెలుగు బస్సులకు పసుపు రంగు వేయాలని నిర్ణయించారు. దీనికిగాను ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసినట్టు తెలిసింది. అదేవిధంగా బస్సులపై మాజీ సీఎం ఎన్టీఆర్ ఫొటోను ముద్రించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ‘తెలుగు వెలుగు’ అని కొత్త పేరు పెట్టనున్నారు. -
నెలకు భారం 2 కోట్లు
ఆర్టీసీ బాదుడుతో ప్రయాణికుల బెంబేలు పల్లె వెలుగునూ వదలని ప్రభుత్వం ఖమ్మం, న్యూస్‌లైన్: ఆర్టీసీ మరోసారి జూలు విదిల్చింది. జిల్లా ప్రయాణికులపై నెలకు రూ.2 కోట్ల అదనపు భారాన్ని మోపింది. ఏసీ, సూపర్‌లగ్జరీ, ఎక్స్‌ప్రెస్ చార్జీలతోపాటు పేద, మధ్య తరగతి వర్గాలు ప్రయాణించే పల్లెవెలుగు బస్సులను కూడా వదలకుండా చార్జీల మోత మోగిం చింది. జిల్లాలో ఖమ్మం, మధిర, మణుగూరు, కొత్తగూడెం, భద్రాచలం, సత్తుపల్లి డిపోలకు చెందిన 604 బస్సు సర్వీసులు ఉన్నాయి. ఇందులో 274 పల్లెవెలుగు, 223 ఎక్స్‌ప్రెస్‌లు, 45 డీలక్స్, 53 సూపర్ లగ్జరీ ఎక్స్‌ప్రెస్‌లు రోజుకు 2.65 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తాయి. ఈ బస్సుల ద్వారా రోజుకు సగటున 85 వేల మంది వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేస్తున్నారు. జిల్లా నుంచి హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, వరంగల్ తదితర నగరాలకు వేలాది మంది వివిధ పనుల నిమిత్తం వెళ్తుంటారు. ఆర్టీసీకి రోజుకు ఏసీ బస్సుల ద్వారా రూ.15 లక్షలు, లగ్జరీలు, సూపర్ లగ్జరీల ద్వారా రూ. 20 లక్షలు, ఎక్స్‌ప్రెస్‌లు, పల్లె వెలుగుల ద్వారా రూ. 20 లక్షల మేర ఆదాయం వస్తుంది. అయితే పెరిగిన ధరల ప్రకారం జిల్లా ప్రజలపై రోజుకు రూ. 6.5 లక్షల మేరకు అదనగా భారం పడుతుంది. ఇలా నెలకు సుమారు రూ. 2 కోట్ల భారం పడనుంది. పేద, మధ్య తరగతి వర్గాల వారు ప్రయాణించే పల్లెవెలుగు బస్సులపై కూడా 8 శాతం చార్జీలు వడ్డించడంతో ఆ ప్రయాణికులపై రోజుకు రూ. 2 లక్షల మేర భారం పడనుంది. ఏసీ బస్సులపై 12 శాతం, సూపర్ లగ్జరీ, ఎక్స్‌ప్రెస్‌లపై 10 శాతం, పల్లెవెలుగు బస్సులపై 8 శాతం అదనంగా చార్జీలు పెంచుతున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. పెంచిన చార్జీలు మంగళవారం అర ్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. ఇప్పటికే గ్యాస్, నిత్యావసర వస్తువులు, విద్యుత్ చార్జీల ధరలు పెరిగి బతుకుబండిని భారంగా లాగుతున్న నిరుపేదలపై బస్సు చార్జీల భారం వేయడం ఏంటని వివిధ రాజకీయ పక్షాలు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నాయి. బస్సు చార్జీల పెంపు ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఖమ్మం నుంచి ప్రధాన పట్టణాలకు పెరిగిన చార్జీల వివరాలు (రూ.లలో) పట్టణం పేరు - ఎక్స్‌ప్రెస్ - డీలక్స్ - సూపర్‌లగ్జరీ {పస్తుతం - పెరిగింది - ప్రస్తుతం-పెరిగింది- ప్రస్తుతం-పెరిగింది ------------------------------------------------------------ హైదరాబాద్ 138- 151 153- 170 180- 201 విజయవాడ 90- 98 100- 111 117- 131 వరంగల్ 91- 100 101- 113 119- 133 రాజమండ్రి 159- 174 176- 196 207- 231 కొత్తగూడెం 58- 64 64- 72 76- 84 సత్తుపల్లి 58- 64 64- 72 76- 84 భద్రాచలం 87- 95 96- 107 113- 126 మణుగూరు 105- 115 116- 130 137- 153 ఇల్లెందు 36- 39 40- 44 47- 52 ------------------------------------------------------------ నోట్ : ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు ఏసీ(ఇంద్ర) బస్సుకు ప్రస్తుతం రూ. 230 ఉండగా ఇది రూ. 353 కు పెరిగింది.