సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఏపీలో అమల్లో ఉన్న ఒక్కో పథకానికీ పేరు మార్చుకుంటూ వస్తున్న చంద్రబాబు ప్రభుత్వం తాజాగా పల్లె వెలుగు బస్సులకు కూడా పేరు మార్చాలని నిర్ణయించింది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో సంస్కరణల పేరుతో పల్లె వెలుగు బస్సులను పచ్చ వెలుగు బస్సులుగా మార్చడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. పల్లె వెలుగు బస్సులకు పసుపు రంగు వేయాలని నిర్ణయించారు. దీనికిగాను ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసినట్టు తెలిసింది. అదేవిధంగా బస్సులపై మాజీ సీఎం ఎన్టీఆర్ ఫొటోను ముద్రించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ‘తెలుగు వెలుగు’ అని కొత్త పేరు పెట్టనున్నారు.