palnadu cold storage
-
పల్నాడు కోల్డ్ స్టోరేజ్‌లో అగ్ని ప్రమాదం
-
పల్నాడు కోల్డ్ స్టోరేజ్‌లో అగ్ని ప్రమాదం
గుంటూరు : గుంటూరు జిల్లాలో బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రెంటచింతలలోని పల్నాడు కోల్డ్ స్టోరేజ్‌లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కోల్డ్‌స్టోరేజీలో నిల్వ ఉన్న 55వేల మిర్చి టెక్కీలు అగ్నికి ఆహుతయ్యయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు మిర్చి ఘాటుకు పరిసర ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.