Palnati Suryapratap
-
సక్సెస్‌ను మించిన ప్రెజర్ మరొకటి ఉండదు
‘‘నా కెరీర్లో ఇప్పటివరకూ నేను మంచి కథలు, మంచి సినిమాల్లో నటించాను. కానీ నటనలో నాకు ఉన్న ప్రతిభకు సరైన పేరు రాలేదని ఫీలవుతుంటాను. అయితే ‘18 పేజెస్’ రిలీజ్ తర్వాత కేవలం ఈ సినిమా గురించే కాకుండా నా నటన గురించి కూడా మాట్లాడుకుంటారని అనుకుంటున్నాను’’ అని హీరో నిఖిల్ సిద్ధార్థ అన్నారు. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ సిద్ధార్థ, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘18 పేజెస్’. దర్శకుడు సుకుమార్ అందించిన కథతో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం నేడు రిలీజవుతోంది. ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నిఖిల్ చెప్పిన విశేషాలు. ► ‘18 పేజెస్’ చిత్రం ఎలా ఉంటుంది? థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో కూడిన క్రేజీ లవ్‌స్టోరీ ఇది. 18 పేజెస్ ఆధారంగా నందినీతో సిద్ధు ఏ విధంగా ప్రేమలో పడతాడు? వీరి ప్రేమకథ ఎలా ముగిసింది? అన్నదే కథ. ఈ సినిమా క్లయిమాక్స్‌ని ఊహించలేకపోయాను. అలాగే ఈ సినిమాను ప్రేక్షకులు, విమర్శకులు ఎలా రిసీవ్ చేసుకుంటారోననే భయం కూడా ఉంది. హిట్టయినా కాకపోయినా మేం ఓ మంచి ప్రయత్నం చేశామని ఆడియన్స్ భావిస్తారనే గ్యారంటీ ఇవ్వగలను. ► థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, లవ్‌స్టోరీ కాకుండా.. ఈ సినిమాలో వేరే అంశాలేమైనా? కొన్ని సామాజిక అంశాలను చెప్పే ప్రయత్నం చేశాం. ఎవరో ఒక అమ్మాయి తనను రిజెక్ట్ చేసిందని అతను ఆమెపై యాసిడ్‌తో దాడి చేయడం, అఘాయిత్యాలకు పాల్పడటం వంటివి వార్తల్లో చూస్తున్నాం. ఓ అమ్మాయికి ఎలాంటి గౌరవం దక్కాలి? ఆమె పట్ల ప్రవర్తన ఎలా ఉండాలి? పెద్దల పట్ల యువత తీరు ఎలా ఉంటే బాగుంటుంది? అనే అంశాలను చెప్పే ప్రయత్నం చేశాం. ఈ సినిమా చూసిన తర్వాత బ్రేకప్ను కూడా పాజిటివ్‌గా తీసుకుంటారు. ► ఈ చిత్రంపై దర్శకుడు సుకుమార్ మార్క్ ఎంత? వంద శాతం ఆయన మార్క్ కనిపిస్తుంది. హీరో, హీరోయిన్ల క్యారక్టరైజేషన్స్, స్క్రీన్‌ప్లే డిఫరెంట్‌గా ఉన్న ఇలాంటి లవ్‌స్టోరీని నేనిప్పటివరకు చేయలేదు. ప్రతి సీన్ చాలెంజింగ్‌గా అనిపించింది. ‘కార్తికేయ 2’తో పాన్ ఇండియా హీరో అయ్యారు. ఏమైనా ఒత్తిడి ఫీలవుతున్నారా? పాన్ ఇండియా హీరో అన్న ప్రతిసారీ నాకు ఒత్తిడే. నాకు తెలిసి సక్సెస్‌ను మించిన ప్రెజర్ మరొకటి ఉండదు. ► మీ తర్వాతి చిత్రాలు? నెక్ట్స్ ఇయర్ ఓ స్పై మూవీతో రాబోతున్నాను. దర్శకుడు చందు మొండేటి ‘కార్తికేయ 3’ కోసం పరిశోధన చేస్తున్నారు. నా ‘యువత’ సినిమా రిలీజైన ఐదు రోజులకు సుకుమార్‌గారు లక్ష రూపాయల పారితోషికం ఇచ్చారు. ఆయనతో సినిమా ఎప్పుడో చెప్పలేను. ► మనతో పని చేసేవారు కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలను కూడా పొగుడుతుంటారు. రియల్ పర్సన్స్‌ను కలిసినప్పుడు మనకు రియాలిటీ అర్థమవుతుంది. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్.. ఇలా సోషల్ మీడియా ద్వారా రియల్ పీపుల్‌ను కలిసే చాన్స్ నాకు లభించింది. సోషల్ మీడియాలో నాకో ఫేక్ ప్రొఫైల్ ఉంది. నెటిజన్ల కామెంట్స్ చదువుతూ నిజాలు తెలుసుకుంటుంటాను. నా సినిమాలకు ప్రేక్షకుల స్పందన ఎలా ఉందనే విషయాలను నా ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకుంటుంటాను. ► అనుకోకుండా యాక్టర్ అయ్యాను. ఊహించని విధంగా హిట్స్ పడ్డాయి. అలాగే ఊహించని రీతిలో జాతీయ స్థాయిలో ఆడియన్స్ దృష్టిలో పడ్డాను. ఇదంతా ఎలా జరిగిందో ఆలోచించుకుంటూ ఉంటాను. -
మా గురువు సుకుమార్ అలా కాదు: పల్నాటి సూర్య ప్రతాప్
‘‘చాలామంది ఓ ఐడియా కోసం వర్క్ చేస్తారు. కానీ నా గురువు, నేను అన్నయ్యలా భావించే సుకుమార్‌గారు మాత్రం ఓ కొత్త ఐడియా వచ్చిన తర్వాత దానిపై డెప్త్‌గా వర్క్ చేస్తుంటారు. అలాగే అన్నింటికన్నా కథే గొప్పదని ఆయన అంటారు. నేనూ అదే నమ్ముతాను’’ అన్నారు పల్నాటి సూర్య ప్రతాప్. నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘18 పేజెస్’. దర్శకుడు సుకుమార్ అందించిన కథతో పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో పల్నాటి సూర్యప్రతాప్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలో కేవలం ప్రేమకథే కాదు.. విభిన్న రకాల భావోద్వేగాలు ఉన్నాయి. అలాగే ఫన్, థ్రిల్లింగ్ అంశాలు ఉన్నాయి. అందుకే ఇది రొటీన్ లవ్‌స్టోరీ కాదని చెబుతున్నాం. సినిమా చూస్తున్నంత సేపూ ప్రేక్షకులు ఇందులోని క్యారెక్టర్స్‌తో ట్రావెల్ అవుతుంటారు. కొన్ని సందర్భాల్లో తమ జీవితంలో జరిగిన సంఘటనలు గుర్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక నిఖిల్, అనుపమ అద్భుతంగా నటించారు. గీతా ఆర్ట్స్‌లో సినిమా చేస్తున్నానని దర్శకులు గౌరవంగా చెప్పుకుంటారు. అలాంటి బ్యానర్ అది. కొంత గ్యాప్ తర్వాత ‘18 పేజెస్’ సినిమాతో దర్శకుడిగా వస్తున్న నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు అల్లు అరవింద్‌గారు. ఈ సినిమా ఎండింగ్ పాజిటివ్‌గా ఉంటుంది’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ.. ‘‘కుమారి 21ఎఫ్’ చిత్రం తర్వాత దాదాపు ఏడేళ్లకు నా దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది. నేను కావాలని గ్యాప్ తీసుకోలేదు. ‘కుమారి 21ఎఫ్’ తర్వాత రైటింగ్ గురించి ఇంకా నేర్చుకోవాలని నా గురువు సుకుమార్‌గారి దగ్గర చేరాను. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాను. అయితే దర్శకుడిగా ఇక నాకు గ్యాప్ ఉండకూడదని మేం నిర్ణయించుకున్నాం. సుకుమార్‌గారు, నేను అనుకున్న కథలు మూడు ఉన్నాయి. నేనూ ఓ కథ అనుకున్నాను. నా తర్వాతి చిత్రం మైత్రీ మూవీస్‌లో ఉంటుంది. అలాగే సితార ఎంటర్ టైన్మెంట్స్‌లో ఓ కమిట్మెంట్ ఉంది’’ అన్నారు. -
కుమారితో ప్రేమాయణం
రాజ్ తరుణ్ ఇప్పుడు కుమారి అనే అందమైన అమ్మాయితో ప్రేమాయణం సాగిస్తున్నాడు. ఈ లవ్ రియల్ కాదు.. రీల్ కోసం. రాజ్ తరుణ్ హీరోగా దర్శకుడు సుకుమార్ కథ అందించి, నిర్మిస్తున్న చిత్రం ‘కుమారి 21ఎఫ్’. హీబా పటేల్ కథానాయిక. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో విజయ్ ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆదూరి నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఆవిష్కరించారు. ‘‘సుకుమార్ శైలిలో సాగే డిఫరెంట్ లవ్‌స్టోరీ ఇది. దేవిశ్రీప్రసాద్ మంచి బాణీలిచ్చారు’’ అని రత్నవేలు అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘ఈ సినిమాతో రాజ్‌తరుణ్ మంచి హిట్‌ను అందుకోవడం ఖాయం. త్వరలో పాటలను, అక్టోబర్ 30న చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు. అంతర్లీనంగా సాగే సందేశంతో సాగే యూత్‌ఫుల్ మూవీ ఇదని రాజ్ తరుణ్ అన్నారు.