Pamuru
-
ఏ పేదవాడు తన పిల్లల చదువు కోసం అప్పులపాలు కాకూడదు
-
చదువు అనే సంపదతో ఆకాశమే హద్దుగా పేదింటి పిల్లలు ఎదగాలి
-
దారుణం : స్నేహితులతో కలిసి సోదరిపై..
సాక్షి, పామూరు(ప్రకాశం) : తొమ్మిదో తరగతి చదువుతున్న పదమూడేళ్ల బాలికపై ముగ్గురు యువకులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన ఘటన బుధవారం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పామూరు మండలం కోడిగుంపల గ్రామానికి చెందిన 13 సంవత్సరాల బాలిక తమ గ్రామానికి సమీపంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఈనెల 21వ తేదీ ఆదివారం మధ్యాహ్నం ఇంటి సమీపంలోని వాగుకు బహిర్భూమికి వెళ్లింది. ఈ సందర్భంలో బాలికకు అన్న వరసయ్యే అయ్యే యువకుడు జడ సునీల్ మాట్లాడాలంటూ బాలికను సమీపంలోని తెల్లరాయి క్వారీ వద్దకు తీసుకెళ్లాడు. సెల్‌ఫోన్‌తో ఫొటోలు తీయబోగా బాలిక వారించింది. అనంతరం యువకుడు గ్రామానికి చెందిన మరో ఇద్దరు స్నేహితులు కొడవటికంటి బాబు, శేషం భానుప్రసాద్‌లకు ఫోన్ చేసి పిలిపించాడు. ముగ్గురూ ఆమెను బెదిరించి, లైంగిక దాడికి పాల్పడ్డారు. ఎవరికీ చెప్పొద్దని హెచ్చరించడంతో ఆమె ఇంట్లో కూడా విషయం చెప్పలేదు. రోజూ యథావిధిగా పాఠశాలకు వెళ్లి వస్తోంది. ఈ క్రమంలో మరలా 30వ తేదీ మంగళవారం ఉదయం బాలిక స్కూల్‌కు వెళ్తుండగా మార్గంమధ్యలో అటకాయించారు. తమతో రావాలని, లేదంటే విషయం గ్రామంలో చెబుతామని బెదిరించారు. భయపడుతూ వడివడిగా పాఠశాలకు వెళ్లిన బాలికి ఇంటికి తిరిగి వచ్చాక విషయం తల్లితో చెప్పింది. బందువులతో కలిసి తల్లి బుధవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేయగా ఎస్సై అంబటి చంద్రశేఖర్ నిందితులు ముగ్గురిపై ఫోక్స్ చట్టం కింద కేసు నమోదు చేశారు. అఘాయిత్యానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని బాలిక తల్లి కోరింది. నిందితుడు బాలికకు పరిచయస్తుడేనా..? నిందితుల్లో శేషం భానుప్రసాద్‌కు వివాహితుడు ఆటో తోలుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మిగిలిన ఇద్దరు బేల్దారీ పనులు చేసుకుని జీవిస్తున్నారు. కాగా జడ సునీల్‌తో బాలిక కొన్ని మాసాలుగా సన్నిహితంగా ఉంటున్నట్టు గ్రామస్తులు, చర్చించుకుంటున్నారు. అదేవిధంగా ఘటనపై సోమ, మంగళవారాల్లో గ్రామంలో రాజీ యత్నాలు జరిగినట్లు, ఘాతుకానికి పాల్పడ్డ వారిలో ఒకరిని వివాహానికి ఒప్పించే యత్నాలు చేయగా అవి బెడిసి కొట్టడంతో బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. -
పామూరులో టీడీపీ నేతల బరితెగింపు
సాక్షి, పామూరు (ప్రకాశం): సార్వత్రిక ఎన్నికల్లో ధనబలంతో గెలవాలని భావించిన టీడీపీ నాయకులు ఓటర్లకు ఎరగా నగదు పంపిణీకి సిద్ధమయ్యారు. అందుకు కేంద్రంగా ఏకంగా స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయాన్నే ఎంచుకున్నారు. సోమవారం కొందరు టీడీపీ నాయకులు ఓటర్ల జాబితా, స్లిప్పులు, ట్యాబ్‌లు తీసుకుని పంచాయతీ కార్యాలయానికి వచ్చారు. పంచాయతీ కార్యాలయానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి రాఘవులు రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యకలాపాలు ఇక్కడ చేయకూడదని వారికి చెప్పారు. టీడీపీకి చెందిన మాజీ సర్పంచి ఇక్కడే చేసుకోమని చెప్పాడని ఆ పార్టీ నాయకులు తిరిగి సమాధానం చెప్పారు. రాఘవులు వారిని లోపలే ఉంచి తలుపునకు గొళ్లెం వేశాడు. విషయాన్ని పంచాయతీ కార్యదర్శి రంగయ్యకు చెబుదామనుకుంటే ఆయన అందుబాటులో లేకపోవడంతో పాత్రికేయులకు సమాచారం ఇచ్చారు. పాత్రికేయులు, వైఎస్సార్ సీపీ నాయకులతో పాటు పలువురు పంచాయతీ కార్యాలయం వద్దకు వెళ్లే సరికే అప్పటికే అక్కడికి చేరుకున్న టీడీపీ నాయకులు సిబ్బంది రాఘవులుపై ఆగ్రహం వ్యక్తం చేసి డోర్ గొళ్లెం తీసుకుని హడావుడిగా బయటకు వెళ్లిపోయారు. ఓటరు జాబితా, నగదు, స్లిప్పుల బ్యాగ్‌తో టీడీపీ నాయకులు పంచాయతీ కార్యాలయం నుంచి పరారయ్యారు. విషయాన్ని తహసీల్దార్ వెంకటరత్నం, ఎంపీడీఓ, ఎన్నికల అధికారి రాజారత్నం, ఎస్ఐ టి.రాజ్‌కుమార్‌లకు తెలపగా వారు వివరాలు సేకరిస్తున్నారు. ఈవీఎం నమూనాలు సైతం పెద్ద సంఖ్యలో పంచాయతీ కార్యాలయంలో ఉంచారు. పంచాయతీ కార్యాలయానికి వచ్చే వారికి, పింఛన్ల కోసం వచ్చే వారికి సైకిల్ గుర్తుకు ఓటు వేయమని పంచాయతీ కార్యాలయంలో పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బందే ఎన్నికల ప్రచారంతో పాటు ఈ తంతులో భాగస్వాములుగా ఉండటం గమనార్హం. చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొంటున్నారు. -
ఆ రెండు జిల్లాల్లో పదే పదే భూ ప్రకంపనలు
ప్రకాశం: గత కొన్ని రోజులుగా ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పదే పదే స్వల్ప ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఆదివారం ప్రకాశం జిల్లాలోని పామురు, పీఎస్‌పురం మండలాల్లో స్వల్పంగా భూమి కంపించింది. ఒక్కసారిగా శబ్దం వినిపించడంతో ఇళ్లలోనుంచి జనాలు పరుగులు తీశారు. వరుస ప్రకంపనలతో భయందోళనకు గురైన జిల్లా వాసులు తమ ఇంట్లోకి వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. -
బైకును ఢీకొన్న లారీ
పామూరు, న్యూస్‌లైన్ : బైకుపై ఉన్న ముగ్గురిని మొద్దుల లోడుతో వెళ్తున్న లారీ ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా ఓ వృద్ధురాలు స్వల్ప గాయాలతో బయటపడింది. ఈ ఘటన మండలంలోని బలిజపాలెం వద్ద గురువారం రాత్రి జరిగింది. వివరాలు.. పీసీపల్లి మండలం గుంటుపల్లికి చెందిన కొణి జేటి నవీన్(16) తన అమ్మమ్మ సాతులూరి చెన్నమ్మను ఆమె స్వగ్రామం గుంటూరు లింగన్నపాలెం (వయా బొట్లగూడూరు)లో వదిలి వచ్చేందుకు బయల్దేరాడు. అమ్మమ్మతో కలిసి వాహనం కోసం రోడ్డుపై వేచి ఉన్నాడు. అదే మండలం శంకరాపురాని (మూలవారిపల్లి)కి చెందిన చింతగుంట్ల సీమోను (22) బొట్లగూడూరు వైపునకు బైకుపై వెళ్తున్నాడు. తమను బొట్లగూడూరులో వదలి పెట్టాలని నవీన్, చెన్నమ్మలు కోరడంతో వారిని మోటార్‌సైకిల్‌పై ఎక్కించుకుని బోట్లగూడూరు వెళ్తున్నాడు. బొట్లగూడూరు నుంచి శంకరాపురం వైపు మొద్దుల లోడుతో ఎదురుగా వచ్చిన లారీ మోటార్‌సైకిల్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో నవీన్, చింతగుంట్ల సీమోనులు అక్కడికక్కడే మృతి చెందాడు. నవీన్ అమ్మమ్మ చెన్నమ్మకు స్వల్పగాయాలయ్యాయి. కళ్లముందే తన మనుమడి మృతిని తట్టుకోలేని చెన్నమ్మ స్పృహకోల్పోయింది. నవీన్ గుంటుపల్లి హైస్కూల్లో 10 వ తరగతి చదువుతున్నాడు. సీమోను బేల్దారి కూలి. ఐదు నెలల క్రితమే ఇతనికి దేవి అనే మహిళతో వివాహమైంది. మృతుల బంధువుల ఆర్తనాదాలతో సంఘటన స్థలం మార్మోగింది. -
సొంతూరు వస్తూ.. దుర్మరణం
పామూరు, న్యూస్‌లైన్ : నుచ్చుపొద పంచాయతీ పరిధిలోని చిలకపాడు, నాచవాగు మధ్య గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కనిగిరి మండలం నేలటూరు గొల్లపల్లికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా నలుగురు గాయపడ్డారు. మృతులలో ఇద్దరు పురుషులు, రెండు నెలల పసికందు ఉన్నారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. క్షతగాత్రుల ఆర్తనాదాలతో సంఘటన స్థలం మార్మోగింది. సాయం చేసేందుకు కనుచూపు మేర ఎవరూ లేకపోవడంతో దాదాపు 20 నిమిషాల పాటు క్షతగాత్రులు అల్లాడిపోయారు. వివరాలు.. కనిగిరి మండలం నేలటూరు గొల్లపల్లి గ్రామానికి చెందిన ఇంటూరి సీమోను(28), రాజేశ్‌లు అన్నదమ్మలు. వీరు అక్కాచెల్లెళ్లు కుమారి, కెజియమ్మలను వివాహం చేసుకున్నారు. అన్న సీమోను భార్య కుమారి. తమ్ముడు రాజేశ్ భార్య కెజియమ్మ. అన్నదమ్ములు చెన్నైలో ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ తమ కుటుంబ సభ్యులతో కలిసి అక్కడి అంబుత్తూర్లో నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో స్థలాల రిజిస్ట్రేషన్ కోసం అన్నదమ్ముల కుటుంబాలు స్వగ్రామం రావాలని భావించాయి. బుధవారం చెన్నైలో క్రిస్మస్ వేడుకులను ఘనంగా జరిపి గురువారం వేకువ జామున స్వగ్రామానికి కారు (టాటా ఇండికా విస్తా టీఎన్ 22 బిఎస్ 2007)లో బయల్దేరారు. కారును అక్కాచెల్లెళ్ల మేనమామ కుమారుడు జుటుకా సురేశ్‌బాబు నడుపుతున్నాడు. ఇతను చెన్నైలో వీరితో పాటే ఉంటున్నాడు. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల సమయంలో కారు పామూరు దాటి కనిగిరి రోడ్డులోని చిలకపాడు, నాచవాగు మధ్య ప్రయాణిస్తోంది. ఉన్నట్లుండి ముందు టైర్ పగిలిపోవడంతో కారు రోడ్డుపై పల్టీలు కొట్టింది. దీంతో కారు నడుపుతున్న సురేశ్‌బాబు (22), ఇంటూరి సీమోను (28), మెర్సీ (2 నెలలు) అక్కడికక్కడే మృతి చెందారు. రాజేశ్, కెజియమ్మ దంపతుల కుమార్తె మెర్సీ. రాజేశ్ దంపతులతో పాటు వీరి మరో కుమార్తె జెస్లీనా, సీమోను భార్య కుమారి మొత్తం నలుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, 108 సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స అనంతరం క్షతగాత్రులను పామూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ట్రాలీ వాహనంలో వైద్యశాలకు తీసుకెళ్లారు. మరో గంట దాటితే.. అన్నదమ్ముల కుటుంబ సభ్యులు మరో గంటలో స్వగ్రామం వెళ్లేవారు. ఇంతలో ప్రమాదం జరిగి సీమోను, సురేశ్‌బాబు, మెర్సీ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. కళ్లముందే తన భర్త సీమోను చేతులు తెగి విలవిల్లాడుతూ ప్రాణాలు విడుస్తుంటే భార్య కుమారి నిస్సహాయస్థితిలో కన్నీరు మున్నీరుగా విలపించింది. కారు నడుపుతున్న తన మేనమామ కుమారుడు సురేశ్‌బాబు అప్పటికే విగతజీవిగా పడి ఉండటం.. తన చెల్లెలు కుమార్తె రెండు నెలల మెర్సీ మృతి చెందడంతో ఆమె రోదన వర్ణనాతీతం. పామూరు సీఐ డి.మల్లికార్జునరావు, ఎస్సై గుంజి హజరత్‌బాబు, సీఎస్‌పురం ఎస్సై లాల్ అహ్మద్, ట్రైనీ ఎస్సై చంద్రశేఖర్‌లు వచ్చి వివరాలు నమోదు చేశారు. తాను చనిపోతూ..కుమార్తెకు ప్రాణం పొసిన పెదనాన్న కనిగిరి, న్యూస్‌లైన్ : సీమోను ముందు సీట్లో ఉండి తన తమ్ముడు రాజేశ్ పెద్ద కుమార్తె జెస్సీకాను పైన కూర్చోబెట్టుకున్నాడు. కారు బోల్తా కొడుతుండ టాన్ని ముందే పసిగట్టి చిన్నారి జెస్సీకాను కారులో నుంచి బయటకు విసిరేశాడు. ఆ తర్వాత కారు మూడు పల్టీలు కొట్టినట్లు క్షతగాత్రులు తెలిపారు. బాలిక స్వల్పగాయాలతో బయట పడింది. సిమోను చనిపోతూ.. తన కుమార్తెకు ప్రాణం పోశాడు. ఈ సంఘటనతో గొల్లపల్లి, వెంకట్రాయునిపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.