సమగ్ర సర్వే ఎలా సాధ్యం..?
యాచారం: సమగ్ర కుటుంబ సర్వేపై ప్రజాప్రతినిధులు సందేహాల వర్షం కురిపించారు. గ్రావూల్లో ఇప్పటికీ కొన్ని ఇళ్లకు నంబర్లు వేయులేదని, కొత్త ఇల్లు కట్టించుకున్న వారు పంచాయుతీ కార్యాలయుంలో నమోదు చేరుుంచుకోలేదని వాటి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇంత గందరగోళం వుధ్య ఈ నెల 19న సమగ్ర కుటుంబ సర్వే ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు.
సమగ్ర కుటుంబ సర్వేపై ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించడానికి బుధవార మండల పరిషత్ కార్యాలయంలో సవూవేశం నిర్వహించారు. ఎంపీటీసీలు, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్న ఈ సవూవేశంలో తహసీల్దార్ వసంతకువూరి సర్వే జరిగే విధానాన్ని వివరించారు. 19న ప్రతిఒక్కరూ ఇంట్లోనే ఉండాలని, ఎన్యుమరేటర్లు ప్రతి కుటుంబంలోని సభ్యుల వివరాలు నమోదు చేస్తారని చెప్పారు.
దీంతో పలు గ్రావూల సర్పంచ్‌లు లేచి గ్రామాల్లో ఎన్ని ఇళ్లు ఉన్నాయి, ఉన్నా ఇళ్లకు నంబర్లున్నాయా, ఉంటే నంబర్ల మీద యజమానుల పేర్లు తదితర విషయాలపై పూర్తి సమాచారం గ్రామ పంచాయతీల్లోనే లేదు, ఇక సర్వే ఎలా చేస్తారని ప్రశ్నించారు. నిజానికి మండలంలో 20 గ్రామాల్లో 20 వేలకు పైగా కుటుంబాలున్నాయున్నారు. అరుుతే అధికారుల వద్ద ఉన్న రికార్డుల్లో వూత్రం కేవలం 11,490 నుంచి 12,072 వరకు కుటుంబాలు ఉన్నట్లు మాత్రమే రికార్డున్నట్లు చెప్పారు.
ఉదాహరణకు కాంగ్రెస్ ప్రభుత్వంలో మూడు విడతల్లో వుండలంలో 9 వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యూయుని, వీటిలో ఆరు వేలకు పైగా పేదలు ఇళ్లను నిర్మించుకున్నారన్నారు. అరుుతే ఈ కొత్త ఇళ్లకు అధికారులు ఇంకా నంబర్లు కేటారుుంచలేదని, వారు పాత ఇళ్ల నంబర్లతోనే పలు సంక్షేమ పథకాలు పొందుతున్నట్లు చెప్పారు. వురి సర్వే రోజు పాత ఇళ్లలో ఉండటం ఎలా కుదురుతుందని, వారంతా ఈ సర్వే కోసం కొత్త ఇళ్లను వదిలి వుళ్లీ ఇళ్లలోకి వూరాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన అధికారులు ఆయా గ్రామాల రెవెన్యూ, పంచాయతీ కార్యదర్శుల చేత రెండు రోజుల్లో ఇంటి నంబర్లు వేసేలా ఉన్నతాధికారుల అనుమతి తీసుకుంటామని హామీ ఇచ్చారు.
లబ్ధిదారుల్లో ఆందోళన
ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేపై లబ్ధిదారుల్లో అందోళన మొదలైంది. రాజకీయ పలుకబడి ఉపయోగించి పలువురు ఒక ఇంటి మీదే రెండు, మూడు ఇళ్లు పొందారు. అర్వులు కాని పేర్ల మీద పింఛన్లు మంజూరైనాయి. ప్రస్తుతం పలు గ్రామాల్లో ఒకే ఇంట్లో భార్యాభర్తలిద్దరికీ పింఛన్లు వస్తున్నారుు. సమగ్ర కుటుంబ సర్వేలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశమున్నందునా వారంతా ఆందోళనకు గురవుతున్నారు.
ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి.
మాల్, మంతన్‌గౌరెల్లి, చౌదర్పల్లి, నక్కర్తమేడిపల్లి, గునుగల్ , గడ్డమల ్లయ్యగూడ తదితర గ్రామాల్లో ఇళ్లు నిర్మించకున్నా చాలావుంది లబ్ధిదారులకు నిధులు మంజూరయ్యూరుు. వారిలో కొంతమంది పేర్ల మీద వారికి తెలియకుండానే ఇళ్లు మంజూరైనట్లు, బిల్లులు తీసుకున్నట్లు రికార్డుల్లో ఉన్నాయి. అంతేకాకుండా పలువురు పల్లెల్లో జీవిస్తూ పట్టణాల్లో, అలాగే పట్టణాలకు వలస వెళ్లి పల్లెల్లో లబ్ధి పొందుతున్నారు.
వీరంతా ఇప్పుడు ఏంచేయూలో తెలియుని సందిగ్ధంలో పడిపోయూరు. ఇప్పటికే బోగస్ కింద మండలంలో వందలాది రేషన్ కార్డులు తొలగించిన అధికారులు మళ్లీ సమగ్ర సర్వే పేరుతో సంక్షేమ పథకాల్లో కూడా కోత పెట్టడం ఖాయమని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రమావ త్ జ్యోతి నాయక్, జెడ్పీటీసీ కర్నాటి రమేష్ గౌడ్, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు జి. రామకృష్ణ యాదవ్, ఎంపీడీఓ ఉష, ఈఓపీఆర్డీ శంకర్‌నాయక్ తదితరులున్నారు.