పంచాయతీ రాజ్ ఏఈ ఆత్మహత్య
జగిత్యాల: వెల్గటూర్ మండలం ఎండపల్లి శివారులో పంచాయితీరాజ్ ఏఈ దేవి శ్రీకాంత్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంచిర్యాల జిల్లాలో పంచాయతీ రాజ్ శాఖలో క్వాలిటీ కంట్రోల్ విభాగంలో శ్రీకాంత్ ఏఈగా పని చేస్తున్నాడు.
ఈ ఏడాది మే నెలలో అతను ప్రేమ వివాహం చేసుకున్నాడు. 3 రోజుల క్రితం అదృశ్యమైన శ్రీకాంత్ పత్తి చేను వద్ద గురువారం ఉదయం శవమై కనిపించాడు. కుటుంబ కలహాల వల్లే ఆత్మహత్యకు పాల్పడి ఉంటడని భావిస్తున్నారు.