నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తప్పవు
సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్ శాఖ పనుల గ్రౌండింగ్లో అధికారుల అలసత్వాన్ని సహించబోమని, నిర్లక్ష్యంగా వ్యవహరించేవారిపై క్రమశిక్షణచర్యలు తప్పవని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హెచ్చరించారు. సీఎం కేసీఆర్ ఆదేశాను సారం వారంలోగా టెండర్ల ప్రక్రియ ముగించి అన్నిపనులకు గ్రౌండింగ్ పూర్తిచేయాలని ఆదేశించారు.
శుక్రవారం టీఎస్ ఐఆర్డీలో పీఆర్ ఇంజనీరింగ్ విభాగం పనులతీరును మంత్రి సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ రూ.2,669.74 కోట్ల అంచనా వ్యయంతో 3,009 పనులు మంజూరు చేసినా ఇప్పటికీ 2,109 పనులకు మాత్రమే టెండర్లు వచ్చాయని, మిగిలిన 900 పనులకు టెండర్లు పిలిచి తొందరగా పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ఈఎన్సీ సంజీవరావు, సీఈ సీతారాములు, జిల్లా పీఆర్ ఎస్ఈఈలు, ఈఈలు, ఇతర ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.