panchayat raj minister
-
వారం, పది రోజుల్లో సర్పంచ్‌లకు చెక్‌పవర్
సాక్షి, హైదరాబాద్: వారం, పదిరోజుల్లో సర్పంచ్‌లకు చెక్ పవర్‌తోపాటు అధికారాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. మిషన్ భగీరథ పథకం పనుల పురోగతిపై మంత్రి శుక్రవారం హైదరాబాద్‌లో ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. సమీక్షాసమావేశంలో ఈఎన్సీ కృపాకర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు జ్ఞానేశ్వర్, చీఫ్ ఇంజనీర్లు, కన్సల్టెంట్లు పాల్గొన్నారు. రోజువారీ నీటి సరాఫరా, ఓవర్‌హెడ్ ట్యాంక్‌లు, గ్రామాల్లో అంతర్గత నీటి సరాఫరా పనులపై ప్రత్యేకంగా సమీక్షించారు. ఇంటింటికీ శుద్ధమైన తాగునీటి పంపిణీలో ఇబ్బందుల్లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో నీటి సరఫరాలో అవాంతరాలు ఉండొద్దని స్పష్టం చేశారు. మిషన్ భగీరథ పథకం కోసం కేంద్రం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు తెచ్చుకునేలా ప్రయత్నిద్దామని చెప్పారు. మిషన్ భగీరథ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, ఇటీవల కేంద్ర ప్రభుత్వ సమావేశంలోనూ ఇతర రాష్ట్రాలు, కేంద్ర ప్రతినిధులు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారని చెప్పారు. మిగిలిపోయిన పనులకు జూలై 15 డెడ్‌లైన్ ‘మిషన్ భగీరథ పనులు బాగా జరుగుతున్నాయి. ఇప్పటికే దాదాపుగా పూర్తయ్యాయి. మీ పని తీరువల్లే ఇది సాధ్యమైంది. మిగిలిపోయిన పనులను కూడా జూలై 15 లోపు పూర్తి చేసి ఇంకా మంచిపేరు తెచ్చుకోవాలి. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ ఎంతో గొప్పది. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం ఇదే. నా 33 ఏళ్ల రాజకీయ అనుభవంతో చెబుతున్నా. ఎప్పుడు ప్రచారానికి వెళ్లినా బిందెలు, కుండలతో నీళ్ల కోసం మహిళలు ఎదురుపడేవారు. మిషన్ భగీరథతో ఇలాంటి పరిస్థితి లేకుండా పోయింది. ప్రతి గ్రామంలో తాగునీటి సరఫరా విషయంలో ప్రభుత్వంపై సానుకూలత ఏర్పడింది’అని మంత్రి అన్నారు. గ్రామాల్లో తాగునీటి సరఫరా ప్రక్రియను మరింత పటిష్టం చేయాలని, వారం, పది రోజుల్లో సర్పంచ్‌లకు చెక్‌పవర్, అధికారాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ‘గ్రామపంచాయతీ నిధులతో వాటర్‌ట్యాంకుల మరమ్మతు పనులు చేయించండి. సర్పంచ్‌లతో సమన్వయం చేసుకుంటూ వేగంగా పనులు పూర్తి అయ్యేలా చూడండి. ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణం గడువులోపు పూర్తి కావాలి. గ్రామాల్లో అంతర్గత నీటి సరఫరా పనులు కీలకం. ఈ పనుల కోసం తవ్విన సిమెంట్ రోడ్లను వెంటనే పునరుద్ధరించాలి. పాత రోడ్డు తరహాలోనే ఈ మరమ్మతులుండాలి.. గ్రామాల్లో ఉండే ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలు, అంగన్వాడీలకు కచ్చితంగా నీటి సరఫరా చేయాలి. దీనికి తగినట్టుగా పనులు చేయాలి’’అని అధికారులకు మంత్రి దయాకర్‌రావు సూచించారు. -
చిన్న చూపేల బాబూ!
సాక్షి, అవనిగడ్డ : ‘‘అంతన్నాడు.. ఇంతన్నాడే.. చిన్నబాబు.. నన్నొగేసెలిపోయినాడే చిన్నబాబు..’’ అంటూ దీనంగా రోదిస్తోందీ చల్లపల్లి. స్వచ్ఛ చల్లపల్లిగా ఖ్యాతి పొందిన గ్రామంలో అభివృద్ధి ఆమడ దూరంలో ఉంది. గ్రామంలోని డ్రైనేజీ అధ్వానంగా దర్శనమిస్తోంది. 2016 నవంబర్ 11న గ్రామాన్ని సందర్శించిన అప్పటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు బైపాస్ రోడ్డు అండర్ గ్రౌండ్ డ్రైనేజి నిర్మాణానికి నిధులిస్తామని హామీ ఇచ్చారు. తదుపరి ఆ శాఖ బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ బైపాస్ రోడ్డుతో పాటు, మండల పరిషత్ కార్యాలయం నుంచి 6వ నంబరు కాలువ వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజి నిర్మాణానికి రూ.2.2 కోట్లు మంజూరు చేశారు. కొంతకాలానికే గ్రామం మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజి నిర్మిస్తామని ప్రకటించి డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు తయారు చేయమని పంచాయతీ రాజ్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో రూ.11.50 కోట్లతో భారీ ప్రణాళిక రూపొందించారు. అది నేటికీ కార్యరూపం దాల్చలేదు. కనీసం బైపాస్ రోడ్డు డ్రైనేజీ అయినా అభివృద్ధి చేసి ఉంటే, గ్రామంలో కొంతమేర అయినా సమస్య పరిష్కారం జరిగుండేది. లక్ష్మీపురం కేంద్రంగా వాటర్ ఏటీఎంలు ఏర్పాటు చేస్తామని చెప్పి లక్ష్మీపురంలో యుద్ధప్రాతిపదికన హెవీ బోర్లు వేయించారు. పనులు, కార్యాచరణ కానరాలేదు. దీంతో అభివృద్ధి మాటలకే పరిమితమైందని ప్రజలు పెదవి విరుస్తున్నారు. -
చంద్రబాబు కూడా మోసం చేశారు: ఎర్రబెల్లి
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు పెద్ద బాధ్యత అప్పగించారని పంచాయతీరాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆయన శుక్రవారం ఉదయం సెక్రటేరియట్ డీ–బ్లాక్‌లో తన చాంబర్లో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ..ఇంత పెద్ద బాధ్యత ఇచ్చినందుకు సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు రుణపడి ఉంటానని అన్నారు. గ్రామ పంచాయతీలు అందంగా తీర్చిదిద్దాలన్న మంత్రి ఎర్రబెల్లి... నూతన పంచాయతీ రాజ్ చట్టంతో గ్రామీణ రూపురేఖలు మారుతాయని ఆకాంక్షించారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా గ్రామాలు ఇంకా అధ్వాన్నంగానే ఉన్నాయన్నారు. ఇక తన 35ఏళ్ల రాజకీయ జీవితంలో 25 ఏళ్లు ఎమ్మెల్యేగా చేసినా ఇంత ఆనందం ఎప్పుడు కలగలేదని తెలిపారు. చాలామంది తనను మోసం చేశారని, ఎన్టీఆర్ తనకు మంత్రి పదవి ఇస్తానంటే కొన్ని శక్తులు అడ్డుపడ్డాయని ఎర్రబెల్లి పేర్కొన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు కూడా తనకు మంత్రి పదవి ఇస్తానని మోసం చేశారని ఆయన అన్నారు. తాను అడగకుండానే కేసీఆర్ మంత్రి పదవి ఇవ్వడమే కాకుండా ఇంత పెద్ద బాధ్యత అప్పగించారని అన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్‌రావుకు మంత్రి మల్లారెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, రాజయ్య, ఎమ్మెల్యేలు ధర్మారెడ్డి, శంకర్ నాయక్, పెద్ది సుదర్శన్, అరెకపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, మాగంటి గోపీనాథ్, కెచర్ల భూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ రాజేశ్వర్ రెడ్డి, గుండు సుధారాణి తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. -
అయ్యో.. అయ్యన్న!
సీనియర్ నేత సీన్ అంతేనా? పతాకావిష్కరణ అవకాశం ఇవ్వని సర్కారు ఇన్చార్జి మంత్రిగా పశ్చిమలోనూ చాన్స్ లేదు ఇక్కడ మాత్రం ఇన్చార్జి మంత్రి యనమలకు అవకాశం మరో మంత్రి గంటాకు కడపలో అవకాశం అయ్యన్నను లెక్క చేయకపోవడంపై టీడీపీ క్యాడర్లో నిర్వేదం పేరు గొప్ప ఊరు దిబ్బలా మారింది రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడి పరిస్థితి. విశాఖ పోలీస్ బ్యారెక్స్‌లో సోమవారం జరిగిన స్వాతంత్య్ర దిన వేడుకల్లో జిల్లా ఇన్చార్జి మంత్రి యనమల రామకృష్ణుడు జాతీయ జెండా ఎగురవేశారు. ఇక మన జిల్లాకే చెందిన మరో మంత్రి గంటా శ్రీనివాసరావు తను ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న వైఎస్సార్ కడప జిల్లాలో ఆవిష్కరించారు. కానీ మంత్రిగా వారిద్దరి కంటే ఎంతో సీనియర్ అయిన అయ్యన్నపాత్రుడు మాత్రం సోమవారం నాటి వేడుకల్లో కేవలం ‘తదితరుల’ జాబితాలోనే ఉండిపోయారు. తను ఇన్చార్జి మంత్రిగా వ్యవహరిస్తున్న పశ్చిమగోదావరి జిల్లాలోనూ జెండా ఎగురవేసే భాగ్యం ఆయనకు దక్కలేదు. ఆ జిల్లాకు చెందిన దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు(బీజేపీ)కు ఆ బాధ్యత కట్టబెట్టారు. దీంతో అయ్యన్న ఎక్కడా ప్రొటోకాల్ హోదాలో జాతీయ జెండా ఎగురవేయని పరిస్థితిపై టీడీపీ శ్రేణుల్లోనూ కాదు.. అధికారవర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఆవిర్భావం నుంచి టీడీపీనే అంటిపెట్టుకొని.. అధికారంలోకి వచ్చిన ప్రతిసారి అమాత్య పదవి పొందుతున్న సీనియర్ నేత అయ్యన్నపాత్రుడుకు ఆ పార్టీలో ఈ మధ్యకాలంలో ప్రాధాన్యం తగ్గుతోందన్న వాదన ఇటీవల పార్టీ శ్రేణుల్లో బలంగా విన్పిస్తోంది. ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చిన గంటా శ్రీనివాసరావుకు యంత్రాంగంలోనే కాదు పార్టీలో కూడా ప్రాధాన్యం పెరుగుతోందన్న ఆందోళన అయన వర్గీయుల్లో కలవరం రేపుతోంది. ఈ వాదనలకు బలం చేకూరేలా సోమవారం జరిగిన పంద్రాగస్టు వేడుకల్లో అయ్యన్నను ప్రభుత్వ పెద్దలు కనీసమాత్రంగా కూడా పట్టించుకోకపోవడం చర్చకు దారితీసింది. పార్టీలోనూ.. మంత్రిగా సీనియారిటీలోనూ తమ నాయకుడి కంటే చాలా జూనియర్ అయిన గంటాకు ఇచ్చిన ప్రాధాన్యత అయ్యన్నకు ఇవ్వకపోవడంపై ఆయన వర్గీయులు అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది కూడా అంతే.. పార్టీ అధికారంలోకి వచ్చిన 2014లో జరిగిన పంద్రాగస్టు వేడుకల్లో జెండా ఎగురవేసిన అయ్యన్నకు ఆ తర్వాత ఆ అవకాశం దక్కలేదు. గత ఏడాది విశాఖలో రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర వేడుకలు జరగడం.. వాటిలో సీఎం చంద్రబాబు పాల్గొనడంతో అయ్యన్నకు జెండా ఎగరేసే చాన్స్ రాలేదు. ఈసారి ఇన్చార్జి మంత్రిగా ఉన్న పశ్చిమగోదావరి జిల్లాలో ఆవిష్కరిద్దామనుకుంటే.. అక్కడి మంత్రి మాణిక్యాలరావు అడ్డుతగిలారు. దీంతో ఆయన ఒకింత నిస్తేజానికి లోనయ్యారని అంటున్నారు. అందుకే.. సోమవారం విశాఖ నగరంలో జరిగిన వేడుకల్లో మొక్కుబడిగా పాల్గొన్న అయ్యన్న కార్యక్రమం ఆసాంతం ముభావంగానే కనిపించారు. పోలీస్ బ్యారెక్స్‌లో జరిగిన వేడుక సభలో పతాకావిష్కరణ, ప్రసంగానికి అవకాశం లేకపోయినా.. కనీసం ప్రశంసాపత్రాలు కూడా అయ్యన్నతో ఇప్పించకపోవడం చర్చనీయాంశమవుతోంది.