కొత్త పంచాయతీల ఏర్పాటు తర్వాతే ఎన్నికలు
మంత్రి జూపల్లి
సాక్షి, కొత్తగూడెం: రాష్ట్రంలో కొత్తగా గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసిన తర్వా తే అన్ని గ్రామ పంచా యతీలకు ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దట్టమైన అడవితో నిండిన కొత్తగూడెం, గుండాల మండలాల సరిహద్దు ప్రాంతా లైన బంగారుచెలక, తిప్పగుట్ట, మైలారం, రేగళ్ల గ్రామాల పరిధిలో పర్యటించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 500 జనాభా దాటిన తండాలతో పాటు, ప్రస్తుత గ్రామ పంచా యతీల్లో దూరంగా ఉన్న హాబిటేషన్లను గుర్తించి వాటి మధ్య దూరం, జనాభా తదితర అంశాల ప్రకారం మరికొన్ని గ్రామ పంచాయతీలను ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. దీంతో మారుమూల గిరిజన ప్రాంతాలకు మేలు జరుగుతుందన్నారు. ఉపాధి హామీ పథకం అమలు విషయంలో జిల్లా, మండల, గ్రామ స్థాయిలో ప్రతి 15 రోజులకోసారి సమీక్ష చేసుకుంటూ ముందుకెళ్లాలని కోరారు.