Panchayti raj
-
గుజరాత్ ఎగ్జామ్ పేపర్.. హైదరాబాద్‌లోనే ‘లీకు’వీరులు!
సాక్షి, హైదరాబాద్: గుజరాత్ పంచాయత్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్(జీపీఎస్ఎస్బీ) నిర్వహించతలపెట్టిన పంచాయత్ జూనియర్ క్లర్క్ పరీక్షపత్రం లీక్ లింకులు హైదరాబాద్‌లో బయటపడ్డాయి. నగర శివార్లలో ఉన్న కేఎల్ హైటెక్ ప్రింటింగ్ ప్రెస్‌లో ముద్రితమైన ఈ పరీక్షపత్రం అక్కడ నుంచే బయటకు వచి్చనట్లు తేలింది. దీంతో ఆదివారం మధ్యాహ్నం మెరుపుదాడి చేసిన ఆ రాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్) అధికారులు ఇద్దరు నిందితులను అరెస్టు చేసి తీసుకువెళ్లారు. ఇప్పటివరకు ఈ లీకేజ్ స్కామ్‌లో మొత్తం 15 మంది అరెస్టు అయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆదివారం జరగాల్సిన పరీక్షను జీపీఎస్ఎస్బీ రద్దు చేసింది. వాస్తవానికి గుజరాజ్ పంచాయత్ శాఖలో 1,181 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయగా 9.53 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఆ రాష్ట్రంలోని 2,995 కేంద్రాల్లో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. అయితే శనివారంరాత్రి ఈ పేపర్ లీక్ జరిగినట్లు ఏటీఎస్‌కు ఉప్పందడంతో వడోదరలోని అట్లాదర ప్రాంతంలో ఉన్న ఓ కోచింగ్ సెంటర్‌పై అధికారులు దాడి చేశారు. ఈ సెంటర్ నిర్వాహకుడు భాస్కర్ చౌదరితోపాటు ఏడుగురిని అరెస్టు చేసిన ఏటీఎస్ అక్కడ ఉన్న పరీక్షపత్రం ప్రతులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడుగురిలో ఇద్దరు 2019 నాటి బిట్స్ పిలానీ ఆన్లైన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ గోల్మాల్ వ్యవహారంలో ఉన్నారని, అప్పట్లో సీబీఐ ఈ ద్వయాన్ని అరెస్టు చేసిందని ఏటీఎస్ ప్రకటించింది. ఒడిశా నుంచి..: భాస్కర్‌చౌదరి గుజరాత్‌లోని వివిధ నగరాలతోపాటు బిహార్, ఒడిశాల్లోనూ పోటీ పరీక్షల కోసం కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్నాడు. ఒడిశాలో మరో కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు ప్రదీప్ నాయక్ ద్వారా తనకు పరీక్షపత్రం అందిందని, దాని కోసం భారీ మొత్తం ఖర్చు చేశా నని విచారణలో అతడు బయటపెట్టాడు. ఈ క్రమంలో హైదరాబాద్ లింకులు వెలుగుచూశాయి. వివిధ సెట్స్ పరీక్షపత్రాలు ముద్రించే బాధ్యతల్ని జీపీఎస్ఎస్బీ ఐడీఏ బొల్లారంలోని కేఎల్ హైటెక్ ప్రింటింగ్ ప్రెస్‌తోపాటు ఏపీలో ఉన్న మరో ప్రెస్‌కు అప్పగించింది. ఈ ప్రెస్‌లో ఒడిశాకు చెందిన జీతి నాయక్, సర్దోకర్ రోహా పనిచేస్తున్నారు. జీతినాయక్‌కు ప్రదీప్‌నాయక్‌తో కొన్నేళ్లుగా పరిచయం ఉంది. జీతి ఈ పేపర్‌ను అతడికి విక్రయించి సొమ్ము చేసుకోవాలని పథకం వేశాడు. సర్దోకర్ రోహా సహకారంతో పరీక్షపత్రాన్ని ప్రింటింగ్ ప్రెస్ నుంచి తస్కరించాడు. దీన్ని వాట్సాప్ ద్వారా ప్రదీప్‌కు పంపగా, అతడి నుంచి భాస్కర్‌కు చేరింది. ఈ వ్యవహారంలో మరికొందరు మధ్యవర్తులుగా వ్యవహరించారని ఏటీఎస్ గుర్తించింది. వీరితోపాటు ఆయా కోచింగ్ సెంటర్ల నిర్వాహకులతో ఒప్పందాలు చేసుకున్న అభ్యర్థుల కోసం గాలిస్తోంది. -
గ్రామీణాభివృద్ధి శాఖలపై జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేదితో సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. ఉపాధిహామి పనులకు సంబంధించిన విషయాలను సీఎం జగన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో కరోనా కారణంగా ఉపాధి హామీ పనులు మందగించాయని అధికారులు జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. భౌతిక దూరం పాటిస్తూ పనులు మొదలుపెట్టామని, ఇప్పుడిప్పుడే పనులు వేగం పుంజుకుంటున్నాయని తెలిపారు. (‘మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్’) వర్షాలు వచ్చే లోపు వీలైనన్ని పని దినాలు కల్పించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పథకంలో కూలీలకు వీలైనన్ని ఎక్కువ పని దినాలు కల్పించాలన్నారు. గ్రామ సచివాలయాలు, విలేజ్ క్లినిక్స్, రైతు భరోసా కేంద్రాలు, పాఠశాలల్లో నాడు–నేడు కార్యక్రమాలు అత్యంత ప్రాధాన్యమైనవని జగన్ అన్నారు. వీటి నిర్మాణాలు పూర్తి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. పాఠశాలల్లో నాడు–నేడు కార్యక్రమాలు జూలై 31 కల్లా పూర్తి చేస్తామని అధికారులు జగన్‌కు చెప్పారు. అదేవిధంగా 16,208 వార్డు, గ్రామ సచివాలయ పోస్టులు ఖాళీగా ఉన్నాయనిఅధికారులు సీఎంకి నివేదించారు. పరీక్షలకు అనుమతులు రాగానే భర్తీ చేస్తామన్నారు. 2021 మార్చి 31 నాటికి రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్రాల నిర్మాణాలను పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. గ్రామ సచివాలయాల నిర్మాణం ఆగస్టు 31 కల్లా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నామని కూడా అధికారులు తెలిపారు. అదేవిధంగా వాటర్ గ్రిడ్‌పైనా కూడా సీఎం జగన్ సమీక్షించారు. (మరింత సక్సెస్‌పుల్‌గా టెలి మెడిసిన్..) -
వాటి తర్వాతే నామినేటెడ్ పోస్టుల భర్తీ : సజ్జల
సాక్షి, అనంతపురం : త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ అభ్యర్థుల విజయం కోసం పోలింగ్ బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడాలని అన్నారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచితే కఠిన చర్యలు తీసుకునే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీచేశారని తెలిపారు. శుక్రవారం అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా అక్కడ నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీ చేస్తామన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని అభినందించారు. 9 మాసాల్లో 90 శాతం హామీలు నెరవేర్చిన ఘనత వైఎస్ జగన్‌దే అని కితాబిచ్చారు. దివంగత వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలను జగన్ బలోపేతం చేశారని అన్నారు. దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దేందుకు సీఎం జగన్ నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. వైఎస్ జగన్ దేశంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుడని, ఆయన అమలుచేసే పథకాలపై యావత్‌దేశం ఆసక్తి చూపుతోందని పేర్కొన్నారు. సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘వ్యవస్థలో మార్పు తెచ్చేందుకు సీఎం నడుం బిగించారు. గడప వద్దకే పరిపాలన అందిస్తున్న ఘనత వైఎస్ జగన్‌దే. ఐదేళ్ల పాలనలో చంద్రబాబు ఖజానాను ఖాళీ చేసి వెళ్లారు. అప్పులు సైతం పుట్టకూడదన్న అక్కసుతో చంద్రబాబు కుట్రలు చేశారు. ప్రజా సంక్షేమాన్ని గత టీడీపీ ప్రభుత్వం విస్మరించింది. అధికార వికేంద్రీకరణపై చంద్రబాబు దుష్ర్పచారం చేస్తున్నారు. విశాఖ, రాయలసీమ జిల్లాల్లో జై అమరావతి నినాదాలు చేసి చంద్రబాబు అభాసుపాలయ్యారు. ఆయనకు ఎల్లో మీడియా వత్తాసు పలకడం దురదృష్టకరం. టీడీపీ, కాంగ్రెస్ కలిసి అక్రమ కేసులు పెట్టినా వైఎస్ జగన్ ఎక్కడా భయపడలేదు. -
బీసీ రిజర్వేషన్ల కోసం కొట్లాడుదాం..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 22 శాతానికి తగ్గించడాన్ని నిరసిస్తూ పలు రాజకీయ పార్టీలు, బీసీ సంఘాలు బుధవారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించాయి.ఈ సందర్భంగా అన్ని పార్టీల ఆధ్వర్యంలో ఈనెల 28న సీఎస్‌కు వినతి పత్రం అందించాలని నిర్ణయించారు. 29న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లల ముట్టడికి పిలుపునిచ్చినట్లు నేతలు వెల్లడించారు. గోల్కొండ హోటల్లో జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. బీసీల ఓట్లతో గెలిచి వారికే వెన్నుపోటు పొడుస్తున్నారని మండిపడ్డారు. సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా జన గణన చేసి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని కులసంఘాలు ఎమ్మెల్యేల గెలుపునకు తీర్మానం చేశాయని, ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలనే నిలదీయండని అన్నారు. ఆర్డినెన్స్ ఉపసంహరించుకోవాలి.. బీసీల రిజర్వేషన్లను 22 శాతానికి తగ్గించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి అన్నారు. రిజర్వేషన్లను తగించి బీసీలను తీవ్రంగా అవమానించారని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ గెలవాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని చాడా మండిపడ్డారు. రిజర్వేషన్లు తగ్గిస్తూ ప్రభుత్వం విడుదల చేసని ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధానిని ఎందుకు కలుస్తున్నారు.. బీసీల రిజర్వేషన్ల సాధన కోసం న్యాయపోరాటంతో పాటు ఉద్యమాలను కూడా ఉదృతం చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. రిజర్వేషన్ల సాధన కోసం రాజకీయ పార్టీలు ముందుకు రావాలని కోరారు. కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీని ఎందకు కలుస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 1200 మంది బీసీలకు అన్యాయం జరిగింది.. బీసీల రిజర్వేషన్లను తగ్గించడంతో 1200 మంది బీసీలు పోటీకి దూరమైయ్యారని టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ పేర్కొన్నారు. చట్ట సభల్లో రిజర్వేషన్లు అమలు చేసి తీరాలని, జంతర్ మంతర్ వద్ద ధర్మాకు తన వంతు సహకారం అందిస్తానని వెల్లడించారు. పార్టీలకతీతంగా బీసీల రిజర్వేషన్ల కోసం పోరాటం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌తో పాటు పలువురు బీసీ సంఘాల నేతలు కూడా పాల్గొన్నారు. -
పంచాయతీ ఎన్నికలకు సిద్ధం
సాక్షి, హైదరాబాద్ : పంచాయతీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పటిష్టమైన కేడర్‌తో బలంగా ఉన్న కాంగ్రెస్.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొంటుందని చెప్పారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా పార్టీ పరంగా టీఆర్ఎస్ నిర్మాణం కాలేదని, గ్రామాల్లో ఆ పార్టీకి అడ్రస్ కూడా లేదని వ్యాఖ్యానించారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల ఖరారులో ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపిస్తోందని విమర్శించారు. పంచాయతీరాజ్ చట్టానికి విరుద్ధంగా రిజర్వేషన్లు ఉన్నాయని.. ఆయా సామాజిక వర్గాలకు ఏ ప్రాతిపదికన, ఎంత శాతం రిజర్వేషన్లు ఇస్తారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. సమగ్ర కుటుంబ సర్వేను ఎందుకు బయటపెట్టడం లేదని ప్రభుత్వాన్ని ఉత్తమ్ నిలదీశారు. సర్పంచ్ రిజర్వేషన్లపై త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా మండల స్థాయి నేతలతో సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు సక్రమంగా అమలు చేయాలన్నదే పార్టీ డిమాండ్ అని, దీనిపై కోర్టుకెళ్లే ఆలోచన లేదని చెప్పారు. రాహుల్‌కు శుభాకాంక్షలు చెప్పేందుకే.. పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి జన్మదిన శుభా కాంక్షలు చెప్పేందుకే తెలంగాణ కాంగ్రెస్ నేతలు కొందరు ఢిల్లీ వెళ్లారని ఉత్తమ్ అన్నారు. తనపై ఫిర్యా దు చేసేందుకు వారు ఢిల్లీ వెళ్లారని అనుకోవడం లేదన్నారు. కాంగ్రెస్‌లో చేరేందుకు అనేకమంది టీఆర్ఎస్, బీజేపీ, టీడీపీ నేతలు సిద్ధంగా ఉన్నారని, ఈ విషయమై స్థానిక నేతలతో మాట్లాడుతున్నామని, త్వరలోనే చేరికలు ఉంటాయని వెల్లడించారు. ఘనంగా జన్మదిన వేడుకలు ఉత్తమ్ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఉదయం హైదరాబాద్‌లోని తన నివాసం వద్ద, మధ్యాహ్నం గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతల సమక్షంలో ఆయన వేడుక జరుపుకున్నారు. -
బడ్జెట్ అంచనాలపై కేటీఆర్ దిశానిర్దేశం
హైదరాబాద్: పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ బడ్జెట్ అంచనాల మీద తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు సమీక్ష సమావేశం నిర్వహించారు. బుధవారం రాజేంద్ర నగర్లో ఆయా శాఖాదిపతులతో జరిగిన సమావేశంలో బడ్జెట్ తీరు తెన్నుల మీద కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. పంచాయితీరాజ్ శాఖకు మూసపద్దతిలో బడ్జెట్ అంచనాలు తయారు చేయకుండా అవసరాలకి అనుగుణంగా, తమ సామర్ధ్యం మేరకు అంచనాలు తయారు చేయాలని సూచించారు. బడ్జెట్ ప్రతిపాదనలతోపాటు రాబోయే మూడు సంవత్సరాలకు ఉండాల్సిన విజన్ సైతం మంత్రి కేటీఆర్ సమీక్షించారు. ఇందులో భాగంగా ఎంచుకున్న ప్రాధాన్యతల మేరకు ఈ సంవత్సరం కావాల్సిన బడ్జెట్ ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా అధికారులు.. పంచాయితీరాజ్ రోడ్లు ఇంజనీరింగ్ శాఖ బడ్జెట్ అంచానాలను కేటీఆర్‌కు వివరించారు. గత బడ్జెట్ లో ఎన్ని నిధులు ఖర్చు చేశారు. ఈ సారి ఎంత ఖర్చు ఉండబోతుందన్న అంశంపైన ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సారి బ్రిడ్జీల నిర్మాణం పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. ప్రతి గ్రామ పంచాయితీకి బిటి రోడ్డు కనెక్టీవిటి ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. ప్రస్తుతం ఉన్న పంచాయితీరోడ్లను అవసరం ఉన్న చోట్ల విస్తరించాలన్నారు. ఇక రోడ్ల నిర్మాణంలో సరికొత్త సాంకేతిక పరిజ్ఘానాన్ని వాడుకోవాలని, ఇందులో భాగంగా బైటెక్ కోల్డ్ మిక్స్, అర్బిఐ 81 వంటి సాంకేతిక పరిజ్ఞానాలను పరిగణలోకి తీసుకోనున్నట్లు మంత్రి తెలిపారు. ఇందుకోసం బడ్జెట్ ప్రతిపాదనలు చేయాలన్నారు. పంచాయితీరాజ్ ఇంజనీరింగ్ శాఖ పనులు డిజిటలైజ్ చేసేందుకు పంచాయితీరాజ్ అన్ లైన్ మానిటరింగ్ టూల్ రూపకల్పన ద్వారా పర్యవేక్షణకి సైతం ఈ బడ్జెట్ లో ప్రతిపాదిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఆర్‌డబ్ల్యూయస్ అండ్ యస్ శాఖ ప్రతిపాదనలను సమీక్షించారు. ఈసారి ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు మిషన్ భగీరథకి ఉన్న ప్రాధాన్యత నేపథ్యంలో అధికంగా నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని చెప్పారు. ఇక తాగునీటి సరఫరా, స్వచ్చ భారత మిషన్, ఎన్‌ఆర్‌డీడబ్ల్యూ వంటి వాటికి కేంద్రం నుంచి వచ్చే నిధులపైన మంత్రి అధికారులనుంచి వివరాలు తీసుకున్నారు. ఇక స్వచ్చ్ తెలంగాణలో (ఎస్‌బీఎమ్) భాగంగా ఏడు లక్షల 55 వేల టాయిలెట్స్ నిర్మాణానికి సైతం.. ఈసారి గతంలో కన్నా ఎక్కువ నిధులు కేటాయించనున్నట్టు కేటీఆర్ వెల్లడించారు.