pandita villuru
-
సౌదీ అరేబియాలో జిల్లా యువకుడి మృతి
పండితవిల్లూరు(పోడూరు) : బతుకుదెరువు కోం విదేశానికి వెళ్లిన యువకుడిని మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబళించింది. చేతికి అందివచ్చిన కొడుకు చిన్న వయసులోనే మృతిచెందడంతో అతని తల్లిదండ్రులు దుఃఖంతో రోదిస్తున్నారు. మృతుని కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. పండితవిల్లూరులో లక్ష్మీదేవి చెరువుగట్టుకు చెందిన లింగోలు మోషేబాబు(23) ఉపాధి నిమిత్తం మూడున్నరేళ్ల కిందట సౌదీ అరేబియాకు వెళ్లారు. అక్కడ ఎలక్రీ్టషియన్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 17వ తేదీ తెల్లవారుజామున అక్కడున్న కొందరు తెలుగువారితో కలసి కారులో వెళ్తుండగా కారు అదుపుతప్పి విద్యుత్స్తంభాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో మోషేబాబు అక్కడికక్కడే మృతిచెందాడు. అతడితోపాటు కారులో వెళ్తున్నవారు ప్రమాదంలో మోషేబాబు మృతిచెందిన విషయాన్ని అతని కుటుంబసభ్యులకు తెలియజేశారు. కొడుకు ఇక లేడన్న వార్త తెలుసుకున్న అతని తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు, నాగమణి గుండెలవిసేలా రోదిస్తున్నారు. మోషేబాబు పదో తరగతి వరకు చదివాడు. అతని అన్న రాజు కూడా గతంలో సౌదీఅరేబియాలో ఉండేవాడు. దీంతో మోషేబాబు కూడా ఉపాధినిమిత్తం అక్కడికి వెళ్లి మూడున్నరేళ్లుగా అక్కడే ఉంటున్నాడు. అతని అన్న రాజు ఈ ఏడాది స్వదేశానికి వచ్చాడు. -
సౌదీ అరేబియాలో జిల్లా యువకుడి మృతి
పండితవిల్లూరు(పోడూరు) : బతుకుదెరువు కోం విదేశానికి వెళ్లిన యువకుడిని మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబళించింది. చేతికి అందివచ్చిన కొడుకు చిన్న వయసులోనే మృతిచెందడంతో అతని తల్లిదండ్రులు దుఃఖంతో రోదిస్తున్నారు. మృతుని కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. పండితవిల్లూరులో లక్ష్మీదేవి చెరువుగట్టుకు చెందిన లింగోలు మోషేబాబు(23) ఉపాధి నిమిత్తం మూడున్నరేళ్ల కిందట సౌదీ అరేబియాకు వెళ్లారు. అక్కడ ఎలక్రీ్టషియన్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 17వ తేదీ తెల్లవారుజామున అక్కడున్న కొందరు తెలుగువారితో కలసి కారులో వెళ్తుండగా కారు అదుపుతప్పి విద్యుత్స్తంభాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో మోషేబాబు అక్కడికక్కడే మృతిచెందాడు. అతడితోపాటు కారులో వెళ్తున్నవారు ప్రమాదంలో మోషేబాబు మృతిచెందిన విషయాన్ని అతని కుటుంబసభ్యులకు తెలియజేశారు. కొడుకు ఇక లేడన్న వార్త తెలుసుకున్న అతని తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు, నాగమణి గుండెలవిసేలా రోదిస్తున్నారు. మోషేబాబు పదో తరగతి వరకు చదివాడు. అతని అన్న రాజు కూడా గతంలో సౌదీఅరేబియాలో ఉండేవాడు. దీంతో మోషేబాబు కూడా ఉపాధినిమిత్తం అక్కడికి వెళ్లి మూడున్నరేళ్లుగా అక్కడే ఉంటున్నాడు. అతని అన్న రాజు ఈ ఏడాది స్వదేశానికి వచ్చాడు.