breaking news
pani
-
గుర్రపుడెక్కతో కళాకృతులు..!
గుర్రపుడెక్క (వాటర్ హైసింత్)... నదీ ప్రవాహాలు, చెరువులు, కుంటల్లో సహజంగా పెరిగే కలుపు మొక్క. నీటి ప్రవాహానికి ఆటంకం కలిగించడం, నీటి కాలుష్యానికి కారకమవుతుండడంతో వీటి పెరుగుదలను నివారించేందుకు స్థానిక సంస్థలు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటాయి. ఇదే సమస్య గోదావరి జిల్లాలు, ముఖ్యంగా నది పరివాహక ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. కానీ అస్సాం సరికొత్త ఆలోచనతో చూపిన పరిష్కార మార్గం అన్ని రాష్ట్రాలకు ఉపయోగపడటమే గాక నదులు, చురువులు పరిశుభ్రంగా ఉంటాయి కూడా. మరి అస్సాం ఎలా ఈ గుర్రపుడెక్క సమస్యకు అర్థవంతంగా పరిష్కారం మార్గం చూపిందో తెలుసుకుందామా..!ఎన్నో అనర్థాలకు దారితీసే ఈ కలుపు మొక్కను అర్థవంతంగా మార్చి మహిళలకు పని కల్పిస్తూ దాని ద్వారా వారి ఆర్థిక చేయూతకు బాటలు వేసింది అస్సాం స్టేట్ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్ (ఏఎస్‌ఆర్‌ఎల్‌ఎం). ఈ గుర్రపు డెక్కను పెకిలించి వాటిని ప్రాసెస్ చేస్తూ ఎన్నో కళాకృతులను తయారు చేసేందుకు పెద్ద కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. అస్సాం రాష్ట్రం మాజూలీ ద్వీపంలోని స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఏఎస్‌ఆర్‌ఎల్‌ఎం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా శిక్షణ ఇస్తూ వారికి కళా ఉత్పత్తుల తయారీలో మెరికలుగా తీర్చిదిద్దుతోంది. ఈ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో వ్యాపారాన్ని విస్తృతం చేసేందుకు వ్యూహాత్మక కార్యాచరణకు సిద్ధమవుతోంది.బ్రహ్మపుత్రలో విరివిగా...ప్రపంచంలోని ఐదు అతిపెద్ద నదుల్లో బ్రహ్మపుత్ర ఒకటి. ఊహకందని వేగం, ప్రవాహం దాని సొంతం. దాదాపు ఏడాది పొడవునా ఈ నది ప్రవహిస్తూనే ఉంటుంది. అస్సాం రాష్ట్రంలోని మెజార్టీ ప్రాంతంలో ఈ నది ప్రవహిస్తుండగా... మాజూలీ ద్వీపం చుట్టూ విస్తరించి ఉండడం... నీరు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండడంతో వాటర్ హైసింత్ కూడా ఇక్కడ దట్టంగా అల్లుకుని ఉంటుంది. ఈ పరిస్థితే ఇక్కడి మహిళా సంఘాలకు ఒక అవకాశంగా పరిణమించింది. అస్సాం గ్రామీణాభివృద్ధి శాఖ రూపొందించిన ప్రత్యేక వ్యూహంతో కళా ఉత్పత్తుల తయారీకి కీలక మలుపుగా మారింది.మూడు దశల్లో ప్రక్రియ...వాటర్ హైసింత్ నుంచి కళా ఉత్పత్తుల తయారీ నాలుగు దశల్లో ఉంటుంది. ముందుగా నది నుంచి వాటర్ హైసింత్ సేకరణ మొదటి దశలో చేపడుతుండగా... రెండోదశలో వాటి ఆకులను కత్తిరించి ఆరబెట్టడం... పొడిగా మారిన తర్వాత అల్లికకు అనువుగా మార్చేలా ప్రాసెస్ చేయడం... ఆ తర్వాత వాటిని మహిళలకు అందించే కళాత్మక పనులను కొనసాగించడం... తయారైన వస్తువులను మార్కెటింగ్ చేయడం లాంటి ప్రక్రియను మహిళా సంఘాల ద్వారా నిర్వహిస్తారు. అల్లికల ద్వారా పర్సులు, బుట్టలు, టేబుల్ మాట్స్, హ్యాండ్ బ్యాగులు, ల్యాప్‌టాప్ బ్యాగులు, బాటిల్ కేరియర్లు, హోమ్ డెకర్ ఐటమ్స్‌ను తయారు చేస్తున్నారు. తయారైన తర్వాత వాటికి పాలిషింగ్ చేయడంతో ఎంతో ఇంపుగా కనిపిస్తాయి. ఇవి పూర్తిగా పర్యావరణ హితమైనవి కావడంతో మార్కెట్లో వీటికి క్రేజ్ ఉంది. అయితే ఈ తయారీ ప్రక్రియంతా ఆ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారుల పర్యవేక్షణలోనే జరుగుతుంది. ప్రస్తుతం ఈ ప్రక్రియ ప్రారంభ దశలో ఉన్నప్పటికీ... ఉత్పత్తి సామర్థ్యం పెరిగిన తర్వాత ఇతర ప్రాంతాలకు సైతం ఎగుమతి చేసేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. అస్సాంలోని మాజూలీ నుంచి – చిలుకూరి అయ్యప్ప, సాక్షి (చదవండి: ఆ కారు కొన్నప్పుడు బాధపడ్డా..కానీ అదే నా బిడ్డ ఆరోగ్యానికి శ్రీరామరక్ష..!) -
మన చాయ్ పానీ ముందు..పిజ్జా, బర్గర్లు జుజుబీ అనాల్సిందే!
సంస్కృతి, సాంప్రదాయాలకు భారత్ నిదర్శనం. అలాంటి మన దేశ రుచులు ఎల్లలు దాటుతున్నాయి. పిజ్జాలు, బర్గర్లు తినే అమెరికన్లు సైతం ఆహా ఏమిరుచి తినరా మైమరిచి అంటూ మన వంటకాల్ని లొట్టలేసుకుంటూ ఆవురావురుమంటూ తింటున్నారు. తమ దేశంలోనూ స్ట్రీట్ ఫుడ్లను అందించడంలో భారత్ రెస్టారెంట్లే బాగున్నాయంటూ కొనియాడుతున్నారు. మెహెర్ వాన్ ఇరానీ భారతీయ వంటకాలన్నీ అమెరికన్లకు రుచి చూపించేందుకు 2009లో అమెరికా నార్త్ కరోలినా యాష్‌లో 'చాయ్ పానీ' పేరుతో రెస్టారెంట్‌ను ప్రారంభించారు. కేవలం 8 డాలర్ల నుంచి 17డాలర్ల మధ్య ధరలతో చాట్‌ను అందించడంతో ఆ రెస్టారెంట్‌కు భారత్, అమెరికన్లకే కాదు వివిధ దేశాలకు చెందిన ఫుడ్ లవర్స్‌ను ఆకట్టుకుంది. ముఖ్యంగా మనదేశంలో విరివిరిగా లభ్యమయ్యే మసాలల్ని దట్టించిన చాట్లలో షడ్రుచులు తోడవవ్వడం అమెరికాలో 1946 నుంచి సంప్రాదాయ వంటకాల్ని అందించే బ్రెన్నాన్స్ వంటి హోటల్స్ ను చాయ్ పానీ వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచింది. ధర తక్కువ, రుచికరమైన వంటకాల్ని అందించడంతో చాయ్ పానీ ఫుడ్ లవర్స్‌ను బాగా ఆకట్టుకుంటోంది. పెరిగిపోతున్న ద్రవ్యోల్బణంతో 40 ఏళ్లలో ఎన్నుడూ చెల్లించిన విధంగా అమెరికన్లు ఆహరం కోసం ఈ ఏడాది అత్యధికంగా చెల్లిస్తున్నారు. అదే సమయంలో రీజనబుల్ ప్రైస్‌లో చాయ్ పానీ వంటకాలు లభ్యం కావడంతో అమెరికాలో బెస్ట్ రెస్టారెంట్‌గా ప్రసిద్దికెక్కింది. జేమ్స్ బియర్డ్ ఫౌండేషన్ అవార్డ్స్ సొంతం చేసుకొని ప్రథమ స్థానంలో నిలిచింది. చదవండి👉పెట్రోల్‌పై డిస్కౌంట్! యూఎస్‌లో ఆకట్టుకుంటున్న భారతీయుడు -
జ్ఞాన సంపదను పురాణాలకు అంటగట్టవద్దు
నల్లగొండ కల్చరల్: భారతీయ జ్ఞాన సంపదను బ్రాహ్మణ్య కేంద్రంగా పురాణాలకు అంటగట్టే ప్రయత్నాన్ని సహించమని విప్లవ రచయితల సంఘం (విరసం) రాష్ట్ర కార్యదర్శి పాణి అన్నారు దీనిని ఎదుర్కొనేందుకు ఎల్లప్పుడూ సంసిద్ధంగానే ఉంటామని పేర్కొన్నారు. శనివారం నల్లగొండ జిల్లాకేంద్రంలో నిర్వహించిన విరసం 21వ సాహిత్య పాఠశాల కార్యక్రమంలో ‘దేశీసాహిత్య సామాజిక చరిత్ర – మార్క్సిజం’అనే అంశంపై ఆయన ప్రసంగించారు. దేశీయ సాహిత్యం, సామాజిక చరిత్రను మార్క్సిస్టు భావాలతో అర్థం చేసుకోవాలన్నారు. కాగా, మధ్యాహ్నం నిర్వహించిన సమావేశంలో ‘భీమా కోరేగావ్ – బ్రాహ్మణీయ వ్యతిరేక పోరాట ప్రతీక’అనే అంశంపై విరసం కార్యవర్గ సభ్యురాలు వరలక్ష్మి ప్రసంగిస్తూ భీమా కోరేగావ్ చరిత్రను వివరించారు. బ్రాహ్మణీయ కేంద్రంగా చరిత్రను రాసుకోవడం సంఘ్ పరివార్‌కు వెన్నతోపెట్టిన విద్య అన్నారు. చరిత్రను ఆధిపత్య వర్గాలు తమకు అనుగుణంగా రాసుకున్నాయని, దాన్ని తిరస్కరిస్తూ అట్టడుగు వర్గాలు ఉద్యమాలు నిర్వహించాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంగానే భీమా కోరేగావ్ పోరాటాన్ని అర్థం చేసుకోవాలన్నారు. భీమా కోరేగావ్ పోరాటాన్ని బడుగు వర్గాలు స్ఫూర్తిగా తీసుకోవడం ఇవాల్టి పాలకవర్గాలకు కంటగింపుగా మారిందన్నారు. దళితులు విజయోత్సవాలు చేసుకోవడం జీర్ణించుకోలేని సంఘ్ పరివార్ శక్తులు దాడులకు పాల్పడడంతో పాటు ఇద్దరు దళితుల హత్యకు కారణమయ్యాయని పేర్కొ న్నారు. కలెక్టివ్ వాయిస్ కన్వీనర్, కవి యాకూబ్ మాట్లాడుతూ దేశంలో హిందూ ఫాసిజం పెచ్చరిల్లుతుందని, గౌరీ లంకేశ్ లాంటి ప్రజా మేధావులను హత్య చేసిన హిందూ మతోన్మాద శక్తులను ప్రశ్నిస్తే.. అర్బన్ మావోయిస్టుల పేరుతో జైళ్లలో నిర్బంధిస్తున్నారన్నారు. -
పానీ.. పానీ.. పానీ..
‘ఆజ్ బ్లూ హై పానీ పానీ పానీ.. ఔర్ దిన్ బీ సాన్నీ సాన్నీ సాన్నీ’ హనీ సింగ్ స్వరాలు వింటూ యువత ‘పానీ’లో మునకలేశారు. శాటర్ డే శాటర్ డే పాటకు సండే డ్యాన్స్‌ను మిక్స్ చేశారు. బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ ప్లాజాలో ఆదివారం నిర్వహించిన ఆక్వా జుంబా క్లాస్ ఆద్యంతం ఆరోగ్యమంత్రం అన్నట్టుగా సాగింది. హోటల్ ఆవరణలోని స్విమ్మింగ్‌ఫూల్ వేదికగా సాగిన ఈ ఆరోగ్యానందాల నృత్యం అదరహో. స్విమ్మింగ్‌ఫూల్‌లో ఈత కొట్టడం ఓ మంచి ఎక్సర్సైజ్. వర్కవుట్స్ చేయడం ఆక్వాటిక్స్. మరి నృత్యం చేస్తే..‘అదే ఆక్వా జుంబా’ అంటున్నారు నగరానికి చెందిన ఫిట్నెస్ ట్రైనర్ విజయ. ఆక్వా వర్కవుట్‌లో కేవలం ఎక్సర్సైజ్ మాత్రమే ఉంటే దీనిలో డ్యాన్స్ కూడా ఉంటుంది. సో.. ఫన్ కూడా ఎక్కువుంటుంది. జనరల్‌గా జుంబా కోసం లాటిన్ అమెరికన్ ట్రాక్స్ ఎక్కువ వినియోగిస్తాం. అయితే ఈ రోజు బాలీవుడ్, పాప్ ట్రాక్స్ పెట్టాం’ అంటూ చెప్పారామె. ఈ ఆక్వా జుంబా వర్కవుట్స్ ద్వారా గంటకు కనీసం 500 నుంచి 800 కేలరీలు ఖర్చు చేయవచ్చునని, నాన్ స్విమ్మర్లు కూడా దీనిలో పాల్గొనవచ్చునని ఆమె భరోసా ఇస్తున్నారు. ..:: ఎస్.సత్యబాబు


