పానీ.. పానీ.. పానీ..
‘ఆజ్ బ్లూ హై పానీ పానీ పానీ.. ఔర్ దిన్ బీ సాన్నీ సాన్నీ సాన్నీ’ హనీ సింగ్ స్వరాలు వింటూ యువత ‘పానీ’లో మునకలేశారు. శాటర్ డే శాటర్ డే పాటకు సండే డ్యాన్స్‌ను మిక్స్ చేశారు. బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ ప్లాజాలో ఆదివారం నిర్వహించిన ఆక్వా జుంబా క్లాస్ ఆద్యంతం ఆరోగ్యమంత్రం అన్నట్టుగా సాగింది. హోటల్ ఆవరణలోని స్విమ్మింగ్‌ఫూల్ వేదికగా సాగిన ఈ ఆరోగ్యానందాల నృత్యం అదరహో.
స్విమ్మింగ్‌ఫూల్‌లో ఈత కొట్టడం ఓ మంచి ఎక్సర్‌సైజ్. వర్కవుట్స్ చేయడం ఆక్వాటిక్స్. మరి నృత్యం చేస్తే..‘అదే ఆక్వా జుంబా’ అంటున్నారు నగరానికి చెందిన ఫిట్‌నెస్ ట్రైనర్ విజయ. ఆక్వా వర్కవుట్‌లో కేవలం ఎక్సర్‌సైజ్ మాత్రమే ఉంటే దీనిలో డ్యాన్స్ కూడా ఉంటుంది. సో.. ఫన్ కూడా ఎక్కువుంటుంది.
జనరల్‌గా జుంబా కోసం లాటిన్ అమెరికన్ ట్రాక్స్ ఎక్కువ వినియోగిస్తాం. అయితే ఈ రోజు బాలీవుడ్, పాప్ ట్రాక్స్ పెట్టాం’ అంటూ చెప్పారామె. ఈ ఆక్వా జుంబా వర్కవుట్స్ ద్వారా గంటకు కనీసం 500 నుంచి 800 కేలరీలు ఖర్చు చేయవచ్చునని, నాన్ స్విమ్మర్‌లు కూడా దీనిలో పాల్గొనవచ్చునని ఆమె భరోసా ఇస్తున్నారు.
..:: ఎస్.సత్యబాబు