panjab elections
-
సోనూసూద్ కీలక నిర్ణయం.. పంజాబ్ స్టేట్ ఐకాన్‌కి గుడ్‌బై
చంఢిఘర్: బాలీవుడ్ నటుడు సోనూసూద్ కరోనా వైరస్, లాక్డౌన్ సమయంలో ఎంతోమంది వలస కార్మికులు, కూలీలకు సాయం అందిచిన విషయం తెలిసిందే. కోవిడ్ కారణంగా సీరియస్‌గా ఉన్న పేషెంట్లకు వైద్య సదుపాయాలు అందించి పలువురి ప్రాణాలును కాపాడారు. అయితే ఆయన తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి తాను పంజాబ్ ‘స్టేట్ ఐకాన్’గా ఉండబోనని సోనూసూద్ ట్విటర్ వేదికగా ప్రకటించారు. పంజాబ్ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల సంఘం గతేడాది సోనూసూద్‌ను ‘స్టేట్ ఐకాన్’గా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన సోదరి మాళవిక సూద్ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన స్టేట్ ఐకాన్ హోదా నుంచి తప్పుకున్నారు. Like all good things, this journey has come to an end too.I've voluntarily stepped down as the State Icon of Punjab.This decision was mutually taken by me and EC in light of my family member contesting in Punjab Assembly Elections. I wish them luck for future endeavours.🇮🇳 — sonu sood (@SonuSood) January 7, 2022 ‘స్టేట్ ఐకాన్‌గా నా ప్రయాణాన్ని ముగిస్తున్నా. స్వచ్ఛందంగా తాను ‘స్టేట్ ఐకాన్’ పదవి నుంచి వైదొలుగుతున్నా. ఎన్నికల సంఘంతో చర్చించి సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నా. నా సోదరి పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు’ అని సోనూ ట్విటర్లో పేర్కొన్నారు. నవంబర్‌లో ఆయన సోదరి మాళవిక సూద్ పంజాబ్ అసెంబ్లీలో పోటీ చేయనున్నారని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఏ పార్టీ నుంచి ఆమె పోటీ చేస్తారన్న విషయంపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. అనంతరం పంజాబ్ సీఎం చరణ్‌జిత్ చన్నీతో కూడా భేటీ అయ్యారు. అయితే ఆయన సోదరి కాంగ్రెస్ నుంచి పోటీ చేయనున్నారని వార్తలు కూడా వచ్చాయి. అదేవిధంగా ఢిల్లీలో ‘దేశ్ కా మెంటర్స్’ అనే విద్యార్థుల సంబంధించిన ఓ కార్యక్రమానికి సోనూసూద్‌ను సీఎం కేజ్రీవాల్ అంబాసిడర్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే. -
Sonu Sood: నా సోదరి పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేయనుంది
చంఢీఘర్: కరోనా కష్ట కాలంలో బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఆపన్నులను ఆదుకున్న విషయం తెలిసిందే. లాక్డౌన్ సమయంలో రైతులు, కూలీల కోసం ట్రైన్లు, బస్సులు ఏర్పాటు చేసి మరీ వారిని ఊర్లకు చేర్చారు. ఇప్పటికీ కూడా సోనూసూద్ తన ఫౌండేషన్ ద్వారా సహాయక కార్యక్రమాలు చేపడుతున్నారు. త్వరలో ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై ఇప్పటివరకు సోనూసూద్ స్వయంగా స్పందించలేదు. కానీ తాజాగా సోనూసూద్ తన సోదరి రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ప్రకటించారు. సోనూసూద్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. తన సోదరి మాళవిక సూద్ వచ్చే ఏడాది జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలిపారు. చదవండి: అఖిలేశ్‌పై అమిత్ షా మాటల దాడి అయితే ఆమె ఏ పార్టీ తరఫున పోటీ చేస్తారనే విషయాన్ని వెల్లడించలేదు. ఇక సోనూ ఇటీవల పంజాబ్ సీఎం చరణ్‌జిత్ చన్నీతో భేటీ అయ్యారు. అదేవిధంగా సోనూసూద్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో కూడా సమావేశం అయ్యారు. ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన పాఠశాల విద్యార్థులకు సంబంధించిన ‘దేశ్ కా మెంటర్స్’ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నట్లు సోనూసూద్ పేర్కొన్నారు. అయితే ఆయన పలు పార్టీ నేతలు, సీఎంలను కలిసినప్పటికీ ప్రధానంగా తన ఫౌండేషన్‌కు రాజకీయలతో సంబంధం లేదన్నారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో భేటీ కావటం వల్ల ఆప్ తరఫున సోనూసూద్ పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారని వార్తలు వచ్చాయి. కానీ తమ మధ్య రాజకీయాలు చర్చకురాలేదని సోనూసూద్ స్పష్టం చేశారు. అయితే తాజాగా సోనూ తన సోదరి పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేస్తుందని ప్రకటించడంతో.. ఆమె ఏ పార్టీ నుంచి బరిలోకి దిగుతారన్నది ప్రస్తుతం రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది. -
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఏబీపీ-సీ ఓటర్ సర్వే ఇలా!
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఏబీపీ సీఓటర్ సర్వే నిర్వహించింది. ఇందులో యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలో బీజేపీ అధికారం కైవసం చేసుకోన్నుట్లు ఏబీపీ సీ-ఓటర్ సర్వేలో వెల్లడించింది. కాగా పంజాబ్‌లో అతిపెద్ద పార్టీగా ఆప్ అవతరించనున్నట్లు ఏబీపీ సీఓటర్ సర్వే పేర్కొంది. పంజాబ్‌లో 31.5 ఓట్ షేర్‌తో ఆప్ 55 సీట్లు సాధిస్తుందని ఏబీపీ సీఓటర్ సర్వే తెలిపింది. ఇక రెండో స్థానంలో కాంగ్రెస్ 37 సీట్లకు పరిమితమవుతుందని ఏబీసీ సీఓటర్ సర్వేలో స్పష్టం చేసింది. దీంతో పంజాబ్‌లో కాంగ్రెస్‌కు ఎదురు దెబ్బ తప్పదనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. యూపీలో బీజేపీకి 259 నుంచి 267 సీట్లు యూపీలో బీజేపీకి కాస్త ప్రాబల్యం తగ్గినా తిరిగి అధికారం దక్కించుకుంటుందని సర్వే తెలిపింది. బీజేపీ సుమారు 60 సీట్లను యూపీలో కోల్పోయినా అధికారానికి ఎటువంటి అడ్డంకులు ఉండవని పేర్కొంది. ఇక్కడ బీజేపీ 259 నుంచి 267నుంచి గెలుస్తుందని అంచనా వేసింది. అదే సమయంలో ఎస్పీ 109 నుంచి 117 సీట్లను గెలుచుకుంటుందని పేర్కొంది. ఇక బీఎస్పీ 12 నుంచి 16 సీట్లు గెలుచుకుంటుందని తెలిపిన సర్వే.. కాంగ్రెస్ 3 నుంచి 7 సీట్లు గెలుచుకుంటుందని పేర్కొంది. ఏబీపీ-సీ ఓటర్ సర్వే నిర్వహించిన సర్వేలో 44 శాతం మంది సీఎం యోగి నాయకత్వం పట్ల సంతృప్తిగా ఉన్నట్లు తెలిపింది. గోవాలోనూ బీజేపీదే హవా! గోవాలో కూడా బీజేపీకే తిరిగి అధికారం కట్టబెట్టనున్నట్లు సర్వే తెలిపింది. బీజేపీ 39. 4 ఓట్ల శాతంతో అధికారాన్ని నిలబెట్టుకుంటుందని, అదే సమయంలో ఆప్ 22.2 ఓట్ల శాతాన్ని సాధిస్తుందని పేర్కొంది. ఇక కాంగ్రెస్ 15.4 శాతానికి పరిమితం కానుందని తెలిపింది. బీజేపీకి 22 నుంచి 26 సీట్లు వస్తాయని వెల్లడించిన సర్వే.. ఆప్‌కు 4 నుంచి 8 సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. కాంగ్రెస్ 3 నుంచి 7 సీట్లకు పరిమితం కానుందని వెల్లడించింది. మణిపూర్‌లో బీజేపీకే ఆధిక్యం మణిపూర్‌లో సైతం బీజేపీనే ఆధిక్యంలో నిలిచి అధికారం దక్కించుకుంటుందని తెలిపింది. ఇక్కడ బీజేపీ 40.5 ఓట్ల శాతంతో అధికారాన్ని తిరిగి నిలబెట్టుకుంటుందని తెలిపిన సర్వే.. కాంగ్రెస్ 34.5 శాతంలో రెండో స్థానానికి పరిమితం కానుందని స్పష్టం చేసింది. ఇక్కడ బీజేపీకి 32 నుంచి 36 సీట్లు, కాంగ్రెస్ 18 నుంచి 22 సీట్లు వస్తాయని పేర్కొంది. ఉత్తరాఖండ్‌లో బీజేపీ కూటమికి 46 సీట్లు 70 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరాఖండ్‌లో బీజేపీ నేతృత్వంలోని కూటమి 46 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని, కాంగ్రెస్ 21 సీట్లు గెలుస్తుంది ఏబీపీ-సీఓటర్ తన సర్వేలో పేర్కొంది. అయితే ప్రస్తుతం ఉన్న సీట్లలో బీజేపీ 11 కోల్పోయే అవకాశం ఉన్నట్లు సర్వేలో తేలింది. పంజాబ్‌లో కాంగ్రెస్‌కు 38-46 సీట్లు, ఆప్‌కు 51-57 సీట్లు రాబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 38-46 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని, ఆప్ 51-57 సీట్లు గెలుస్తుందని ఏబీపీ-సీఓటర్ తెలిపింది. చదవండి: ‘బాబుకు హఠాత్తుగా ఉత్తరాంధ్ర ఎందుకు గుర్తొచ్చిందో అర్థం కావడం లేదు’ చదవండి: Karnataka: ఆరు నెలలు జైల్లో ఉన్నా: హోంమంత్రి -
సుఖ్బీర్కు ఈసారి గట్టి పోటినే..
జలాలాబాద్: పంజాబ్‌లో శిరోమణి అకాళీదల్ పార్టీ అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్‌కు గట్టి పోటీ ఎదురవనుంది. ఆయన పోటీ చేస్తున్న స్థానంలోనే ఆమ్ ఆద్మీ పార్టీలో కీలక నేతగా ఉన్న సిట్టింగ్ ఎంపీ భగవంత్ మన్, కాంగ్రెస్ ఎంపీ రవ్నీత్ సింగ్ బిట్టు కూడా ఇదే సీటుకోసం బరిలోకి దిగడంతో ముక్కోణపు పోటీ ఏర్పడింది. ఈ ముగ్గురు కూడా కీలక నేతలే. ముఖ్యంగా బిట్టు పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బీంత్ సింగ్ మనవడు కాగా, పంజాబ్ రాజకీయాల్లో భగవత్ మన్కి గొప్పముద్ర ఉంది. మరోపక్క, సుఖ్బీర్ కూడా చాలా టఫ్ కాంపిటేషన్ ఇచ్చే వ్యక్తే. అయినప్పటికీ ఈసారి మాత్రం ఆయనే కఠిన పరిస్థితి ఎదుర్కొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో సుఖ్బీర్ 53,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన పంజాబ్ డిప్యూటీ సీఎంగా ఉన్న విషయం తెలిసిందే. -
సొంత కుంపటి పెట్టిన సుచ్చా సింగ్
న్యూఢిల్లీ : అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసిన సుచ్చాసింగ్ చోటేపూర్ సొంత కుంపటి ఏర్పాటు చేసుకున్నారు. ఆయన శనివారం అప్నా పంజాబ్ పార్టీ (ఏపీపీ) పేరిట కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. ఏడుగురు ఆప్ కార్యకర్తలు ఈ కొత్త పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రానున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అప్నా పంజాబ్ పార్టీ బరిలోకి దిగనుంది. ఓ కార్యకర్తకు టికెట్ ఇప్పిస్తానంటూ అతని నుంచి డబ్బులు తీసుకుంటూ సుచ్చా సింగ్ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఈ వ్యవహారం రచ్చ రచ్చ కావడంతో ఆప్ పంజాబ్ నేతలు అప్రమత్తమయ్యారు. సుచ్చా సింగ్‌ను బహిష్కరించాలంటూ దాదాపు 25 మంది నేతలు పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌కు లేఖ రాశారు. దీంతో ఈ వ్యవహారం కాస్తా ఆప్ క్రమశిక్షణ సంఘంకు చేరింది. విచారణ అనంతరం సుచ్చా సింగ్ పదవిపై వేటు పడింది. అనంతరం సుచ్చాసింగ్ ఆప్‌కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. -
పంజాబ్ బరిలో తొలి ఆప్ వీరులు వీరే
హర్యానా: వచ్చే ఏడాది పంజాబ్ లో జరగనున్న ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ అప్పుడే శంకం పూరించింది. ఆ పార్టీ తరుపున బరిలోకి దిగే తొలి అభ్యర్థుల జాబితాను వెల్లడించింది. మొత్తం 19మందితో ఆప్ జాబితాను ప్రకటించింది. వీరిలో ఒకప్పుడు అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే చేసిన ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వ్యక్తి, ఓ సిక్కుల హక్కుల పోరాటయోధుడు, ఓ అర్జున అవార్డు గ్రహీత, సామాజిక ఉద్యమంలో పాల్గొన్న వైద్యుడు, ఓ బీఎస్పీ మాజీ పార్లమెంటు సభ్యుడు, ఉద్యోగ విరమణ పొందిన సైనికుడు(బ్రిగేడియర్) ఈ పందొమ్మిది మందిలో ఉన్నారు. మొత్తానికి ఆప్ ఏదో ఒక రకంగా సామాజిక సేవల ఉన్నవారికే సీట్లు కేటాయిస్తూ తొలి జాబితాను వెలువరించింది. వీరిలో ప్రముఖ సిక్కుల హక్కుల పోరాట యోధుడు, 2014 ఎన్నికల్లో లోక్ సభ ఎన్నికల్లో ఓటమి పాలయిన హెచ్ ఎస్ పుల్కా కూడా ఈ జాబితాలో ఉండటం విశేషం.