పంజాబ్ బరిలో తొలి ఆప్ వీరులు వీరే
హర్యానా: వచ్చే ఏడాది పంజాబ్ లో జరగనున్న ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ అప్పుడే శంకం పూరించింది. ఆ పార్టీ తరుపున బరిలోకి దిగే తొలి అభ్యర్థుల జాబితాను వెల్లడించింది. మొత్తం 19మందితో ఆప్ జాబితాను ప్రకటించింది.
వీరిలో ఒకప్పుడు అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే చేసిన ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వ్యక్తి, ఓ సిక్కుల హక్కుల పోరాటయోధుడు, ఓ అర్జున అవార్డు గ్రహీత, సామాజిక ఉద్యమంలో పాల్గొన్న వైద్యుడు, ఓ బీఎస్పీ మాజీ పార్లమెంటు సభ్యుడు, ఉద్యోగ విరమణ పొందిన సైనికుడు(బ్రిగేడియర్) ఈ పందొమ్మిది మందిలో ఉన్నారు. మొత్తానికి ఆప్ ఏదో ఒక రకంగా సామాజిక సేవల ఉన్నవారికే సీట్లు కేటాయిస్తూ తొలి జాబితాను వెలువరించింది. వీరిలో ప్రముఖ సిక్కుల హక్కుల పోరాట యోధుడు, 2014 ఎన్నికల్లో లోక్ సభ ఎన్నికల్లో ఓటమి పాలయిన హెచ్ ఎస్ పుల్కా కూడా ఈ జాబితాలో ఉండటం విశేషం.