కేజ్రీవాల్ పేరులేని ఆప్ తొలి జాబితా
భారతి సహా 22 మంది పేర్లు ఖరారు
సాక్షి, న్యూఢిల్లీ: నలుగురు మాజీ మంత్రులు సహా 22 మంది అభ్యర్థుల పేర్లతో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తన తొలి జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్, మాజీ మంత్రులు మనీష్ సిసోడియా, రాఖీ బిర్లా పేర్లు లేకపోవడం గమనార్హం. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో పోటీచే సే అభ్యర్థుల తొలి జాబితాను ఆప్ గురువారం ప్రకటించింది. గత అసెంబ్లీ ఎన్నికలలో నిలబెట్టిన 22 మందికి ఆప్ మళ్లీ టికెట్ ఇచ్చింది. మిగతా అభ్యర్థుల పేర్లను త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపింది.
తొలి జాబితాలో అర్వింద్ కేజ్రీవాల్ తో పాటు ఆప్ సర్కారులో మంత్రులుగా ఉన్న మనీష్ సిసోడియా, రాఖీబిర్లా పేర్లు లేకపోవడం గమనార్హం. మాజీ మంత్రులు సోమ్‌నాథ్ భారతీ, సత్యేంద్ర జైన్, సౌరభ భరద్వాజ్‌ల పేర్లు జాబితాలో ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికలలో పశ్చిమ ఢిల్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన తిలక్‌నగర్ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్‌ను మళ్లీ అదే అసెంబ్లీ నియోకవర్గం నుంచి నిలబెట్టనున్నట్లు ఆప్ ప్రకటించింది.
ఆప్ ప్రకటించిన 22 మంది అభ్యర్థులలో కొందరు గత అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయారు. కొందరైతే మూడవ స్థానంలో నిలిచారు. పార్టీ అభ్యర్థులపై ఏవైనా అవినీతి ఆరోపణలు వచ్చి ఉంటే, వాటిపై దర్యాప్తు చేసేందుకు సీనియర్ నాయకుడు ఆనంద్‌కుమార్‌తో ఒక కమిటీ వేసిన సంగతి తెల్సిందే. ఈ కమిటీ విచారణలో ఎవరైనా అవినీతికి పాల్పడినట్టు వెల్లడైతే చివరి నిమిషంలో కూడా అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తామని ఆప్ నాయకుడు సంజయ్ సింగ్ చెప్పారు.
ఆప్ అభ్యర్థులు:
మనోజ్‌కుమార్ (కోండ్లీ), జగ్‌దీప్ సింగ్ (హరినగర్), జర్నైల్ సింగ్ (తిలక్‌నగర్), గిరీష్ సోనీ (మాదీపుర్), విశేష్వ్రి (కరోల్‌బాగ్), సోమ్‌నాథ్ భారతీ (మాలవీయనగర్), సౌరభ్ భరద్వాజ్ (గ్రేటర్ కైలాష్), సంజీవ్ ఝా (బురాడీ), వందనా కుమారీ (షాలిమార్ బాగ్), సత్యేంద్ర జైన్ (షాకూర్‌బస్తీ), సోమ్ దత్ (సదర్‌బజా ర్), కమాండో సురేందర్ (ఢిల్లీ కంటోన్మెంట్) సందీప్ (సుల్తాన్‌పురి మాజ్రా), అనిల్ బాజ్‌పాయ్ (గాంధీనగర్), అతుల్ గుప్తా (విశ్వాస్‌నగర్), రాజేష్ రిషి (జనక్‌పురి), గులాబ్‌సింగ్ (మతియాలా), విజేందర్ గర్గ్(రాజేందర్‌నగర్), కపిల్ మిశ్రా (కరావల్‌నగర్), జితేందర్ తోమర్ (త్రినగర్), ఎన్‌డి శర్మ- బదర్‌పుర్, భావనాగౌర్ (పాలం)
వీరిలో రాజేష్ రిషీ జనక్‌పురిలో బీజేపీ సీనియ్ నేత జగ్‌దీశ్ ముఖి చేతిలో, ఎన్‌డీ శర్మ బదర్‌పుర్‌లో రామ్‌బీర్ సింగ్ బిధూడీ చేతిలో, అనిల్ బాజ్‌పేయి గాంధీనగర్‌లో అర్విందర్ సింగ్ లవ్లీ చేతిలో, కపిల్ మిశ్రా కరావల్ నగర్‌లో మోహన్ సింగ్ బిష్త్ చేతిలో, గులాబ్ సింగ్ మటియాలాలో జేడీయూ నేత షోయబ్ ఇక్బాల్ చేతిలో, జితేందర్ తోమర్ త్రినగర్‌లో నంద్ కిషోర్ గర్గ్ చేతిలో, సందీప్ సుల్తాన్‌పురి మాజ్రీలో కాంగ్రెస్ నేత జైకిషన్ చేతిలో, అతుల్ గుప్తా విశ్వాస నగర్‌లో బీజేపీకి చెందిన ఓమ్ ప్రకాశ్‌శర్మ చేతిలో, విజేందర్ గర్గ్ రాజేందర్‌నగ ర్‌లో ఆర్‌పీ సింగ్ చేతిలో, భావనా గౌర్ పాలంలో ధరం దేవ్ సోలంకీ చేతిలో ఓటమిపాలయ్యారు.