సొంత కుంపటి పెట్టిన సుచ్చా సింగ్ | Sucha Singh Chhotepur resigns from AAP, launches new political outfit 'Apna Punjab Party' | Sakshi
Sakshi News home page

సొంత కుంపటి పెట్టిన సుచ్చా సింగ్

Published Sat, Oct 1 2016 6:01 PM | Last Updated on Mon, Sep 4 2017 3:48 PM

సొంత కుంపటి పెట్టిన సుచ్చా సింగ్

సొంత కుంపటి పెట్టిన సుచ్చా సింగ్

న్యూఢిల్లీ : అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసిన సుచ్చాసింగ్ చోటేపూర్ సొంత కుంపటి ఏర్పాటు చేసుకున్నారు. ఆయన శనివారం అప్నా పంజాబ్ పార్టీ (ఏపీపీ) పేరిట కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. ఏడుగురు ఆప్ కార్యకర్తలు ఈ కొత్త పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రానున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అప్నా పంజాబ్ పార్టీ బరిలోకి దిగనుంది.

ఓ కార్యకర్తకు టికెట్ ఇప్పిస్తానంటూ అతని నుంచి డబ్బులు తీసుకుంటూ  సుచ్చా సింగ్ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఈ వ్యవహారం రచ్చ రచ్చ కావడంతో ఆప్ పంజాబ్ నేతలు అప్రమత్తమయ్యారు. సుచ్చా సింగ్ను బహిష్కరించాలంటూ దాదాపు 25 మంది నేతలు పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌కు లేఖ రాశారు. దీంతో ఈ వ‍్యవహారం కాస్తా ఆప్ క్రమశిక్షణ సంఘంకు చేరింది. విచారణ అనంతరం సుచ్చా సింగ్ పదవిపై వేటు పడింది. అనంతరం సుచ్చాసింగ్ ఆప్కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement