సొంత కుంపటి పెట్టిన సుచ్చా సింగ్
న్యూఢిల్లీ : అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసిన సుచ్చాసింగ్ చోటేపూర్ సొంత కుంపటి ఏర్పాటు చేసుకున్నారు. ఆయన శనివారం అప్నా పంజాబ్ పార్టీ (ఏపీపీ) పేరిట కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. ఏడుగురు ఆప్ కార్యకర్తలు ఈ కొత్త పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రానున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అప్నా పంజాబ్ పార్టీ బరిలోకి దిగనుంది.
ఓ కార్యకర్తకు టికెట్ ఇప్పిస్తానంటూ అతని నుంచి డబ్బులు తీసుకుంటూ సుచ్చా సింగ్ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఈ వ్యవహారం రచ్చ రచ్చ కావడంతో ఆప్ పంజాబ్ నేతలు అప్రమత్తమయ్యారు. సుచ్చా సింగ్‌ను బహిష్కరించాలంటూ దాదాపు 25 మంది నేతలు పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌కు లేఖ రాశారు. దీంతో ఈ వ్యవహారం కాస్తా ఆప్ క్రమశిక్షణ సంఘంకు చేరింది. విచారణ అనంతరం సుచ్చా సింగ్ పదవిపై వేటు పడింది. అనంతరం సుచ్చాసింగ్ ఆప్‌కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.