Pankaj Kapur
-
‘తనే విడాకులు కోరుకున్నాడు’
విడాకుల ఆలోచన నాది కాదు.. తనదే అంటున్నారు నటి, షాహీద్ కపూర్ తల్లి నీలిమ అజీమ్. బాలీవుడ్ యాక్టర్, డైరెక్టర్ పంకజ్ కపూర్ - నీలీమలకు 1975లో వివాహం అయ్యింది. అయితే అభిప్రాయబేధాలు రావడంతో 1984లో విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలో నీలిమ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వూలో విడాకుల విషయంపై స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘నేను విడాకులు కోరుకోలేదు. ఇది నిజం. తనే విడిపోవాలనుకున్నాడు. ఈ నిర్ణయం నన్ను ఎంతో బాధించింది. కానీ తన కారణాలు తనకున్నాయి. నా 15వ ఏట తొలిసారి నాకు పంకజ్‌తో పరిచయం ఏర్పడింది. మాది సుదీర్ఘమైన స్నేహ బంధం. తను విడాకులు అడిగినప్పుడు నేను చాలా బాధ పడ్డాను’ అన్నారు. అంతేకాక ‘ఇద్దరు వ్యక్తులు విడిపోయినప్పుడు.. అది కూడా విడాకుల వల్ల అయితే దాని ఫలితం ఇద్దరికి చాలా బాధాకరంగా ఉంటుంది. ఇద్దరి మధ్య ఎంతో అనుబంధం, స్నేహం ఉంటాయి. కానీ తప్పదు. జరిగిందేదో జరిగింది. తను తన కుటుంబంతో బాగా స్థిరపడ్డాడు. తను బాగుండాలని కోరుకుంటున్నాను’ అన్నారు నీలిమ. (నా పని గిన్నెలు కడగటం: షాహిద్) బాలీవుడ్ యాక్టర్, డైరెక్టర్ పంకజ్ కపూర్, నీలిమ అజీమ్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత కొన్నాళ్లకు విడిపోయిన విషయం తెలిసిందే. వీరిద్దరు విడిపోయేనాటికి షాహీద్ వయసు మూడున్నర ఏళ్లు మాత్రమే. విడాకుల అనంతరం పంకజ్ కపూర్ సుప్రియా పఠాక్‌ను వివాహం చేసుకున్నాడు. (‘అందుకే హిందీ ‘జెర్సీ’ని వద్దనుకున్నా’) -
గురుశిష్యులు
సాధారణంగా అందరికీ లైఫ్‌లో గురువు పాత్రను ఎక్కువగా తండ్రే పోషిస్తారు. బాలీవుడ్ నటుడు షాహిదీ కపూర్‌కు వాళ్ల నాన్న పంకజ్ కపూరే గురువు. ఇప్పుడు ఆన్‌స్క్రీన్ కూడా తనయుడికి గురువు పాత్రలో కనిపించబోతున్నారు. తెలుగు సూపర్‌హిట్ సినిమా ‘జెర్సీ’ హిందీ రీమేక్‌లో నటించనున్నారు షాహిద్. తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి హిందీ రీమేక్‌ను డైరెక్ట్ చేయనున్నారు. అల్లు అరవింద్, ‘దిల్’ రాజు, అమన్ గిల్ నిర్మించనున్నారు. ఈ సినిమాలో షాహిద్ మెంటర్‌గా (తెలుగులో సత్యరాజ్ పోషించిన పాత్ర) ఆయన తండ్రి పంకజ్ కపూర్ నటించనున్నారని తెలిసింది. ఈ నెలాఖారున షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్ట్ 28న రిలీజ్ కానుంది. -
హ్యాపీ బర్త్ డే- 29-05-15
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: పంకజ్ కపూర్ (ప్రముఖ రంగస్థల నటుడు, దర్శకుడు), సుబ్రతాసేన్ (బెంగాలీ దర్శకుడు) ఈ రోజు పుట్టిన రోజుజరుపుకుంటున్న వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 6. వీరికి ఈ సంవత్సరం కొద్దిపాటి ఒడుదొడుకులు ఉన్నప్పటికీ, అంతిమంగా మంచి ఫలితాలే ఉంటాయి కాబట్టి ఆందోళన పడనక్కరలేదు. అవివాహితులకు వివాహమవుతుంది. మనస్పర్ధలతో దూరంగా ఉన్న దంపతులు తిరిగి కలుస్తారు. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. చిన్ననాటి బంధువులు, స్నేహితులతో బంధం బలపడుతుంది. విలాస వస్తువులు కొంటారు. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ, ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించకపోతే అప్పులు తప్పవు. విద్యార్థులు ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. సినిమా, మీడియా రంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. అవార్డులు, రివార్డులు లభిస్తాయి. వ్యాపారులు మంచి లాభాలు కళ్లజూస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. లక్కీ నంబర్లు: 2,6,7,9, లక్కీ కలర్స్: వైట్, బ్లూ, సిల్వర్, రెడ్, లక్కీ డేస్: సోమ, బుధ, శుక్రవారాలు సూచనలు: నవగ్రహాలకు అభిషేకం, భృగుపాశుపత హోమం చేయించుకోవడం, గోవులకు దాణా తినిపించడం, వితంతు సోదరీమణులను ఆదుకోవడం - డాక్టర్ మహమ్మద్ దావూద్, సంఖ్య, జ్యోతిష శాస్త్ర నిపుణులు -
'ఫైండింగ్ ఫెనీ' చిత్రం ప్రమోషన్లో దీపికా
-
తెలుగు హీరోల్లో మహేశ్ బాబు అంటే ఇష్టం: దీపిక
తెలుగులో నటించాలని ఎదురు చూసినపుడు అవకాశాలు రాలేదు. అవకాశం వచ్చిన సమయం చిక్కలేదు అని బాలీవుడ్ తార దీపికా పదుకోనే అన్నారు. హిందీ చిత్రం 'ఫైండింగ్ ఫెనీ' చిత్రం ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దీపికా మాట్లాడుతూ 'తెలుగులో తనకు ఇష్టమైన హీరో మహేశ్ బాబు' ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. మహేశ్ అంటే తనకు కూడా ఇష్టమని హీరో అర్జున్ కపూర్ తెలిపారు. కళాకారులకు భాషతో సంబంధమేమి లేదని...మంచి అవకాశం వస్తే ఏ భాషలోనైనా నటిస్తానని దీపికా తెలిపారు. హోమీ అదాజానియా దర్వకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అర్జున్ కపూర్ సరసన దీపికా పదుకోనే నటించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 12 తేదిన విడుదల కానుంది.