హ్యాపీ బర్త్ డే- 29-05-15 | Happy birthday | Sakshi
Sakshi News home page

హ్యాపీ బర్త్ డే- 29-05-15

Published Thu, May 28 2015 11:16 PM | Last Updated on Sun, Sep 3 2017 2:50 AM

హ్యాపీ బర్త్ డే- 29-05-15

హ్యాపీ బర్త్ డే- 29-05-15

ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: పంకజ్ కపూర్ (ప్రముఖ రంగస్థల నటుడు, దర్శకుడు), సుబ్రతాసేన్ (బెంగాలీ దర్శకుడు)
 
 ఈ రోజు పుట్టిన రోజుజరుపుకుంటున్న వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 6. వీరికి ఈ సంవత్సరం కొద్దిపాటి ఒడుదొడుకులు ఉన్నప్పటికీ, అంతిమంగా మంచి ఫలితాలే ఉంటాయి కాబట్టి ఆందోళన పడనక్కరలేదు. అవివాహితులకు వివాహమవుతుంది. మనస్పర్ధలతో దూరంగా ఉన్న దంపతులు తిరిగి కలుస్తారు. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. చిన్ననాటి బంధువులు, స్నేహితులతో బంధం బలపడుతుంది.
 
 విలాస వస్తువులు కొంటారు. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ, ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించకపోతే అప్పులు తప్పవు. విద్యార్థులు ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. సినిమా, మీడియా రంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. అవార్డులు, రివార్డులు లభిస్తాయి. వ్యాపారులు మంచి లాభాలు కళ్లజూస్తారు.
 
 ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. లక్కీ నంబర్లు: 2,6,7,9, లక్కీ కలర్స్: వైట్, బ్లూ, సిల్వర్, రెడ్, లక్కీ డేస్: సోమ, బుధ, శుక్రవారాలు సూచనలు: నవగ్రహాలకు అభిషేకం, భృగుపాశుపత హోమం చేయించుకోవడం, గోవులకు దాణా తినిపించడం, వితంతు సోదరీమణులను ఆదుకోవడం
 - డాక్టర్ మహమ్మద్ దావూద్, సంఖ్య, జ్యోతిష శాస్త్ర నిపుణులు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement