అశ్విన్ సంచలన ట్వీట్స్
చెన్నై: టీమిండియా స్పిన్నర్, తమిళనాడుకు చెందిన రవిచంద్రన్ అశ్విన్ క్రికెట్ తప్ప మిగతా విషయాల గురించి పెద్దగా స్పందించడు. అలాంటి అశ్విన్ తమిళనాడు రాజకీయాలను ఉద్దేశించేలా సంచలన ట్వీట్స్ చేశాడు. కాసేపటి తర్వాత తూచ్ తన ఉద్దేశం అది కాదంటూ మరో ట్వీట్ చేసి తేలికపరిచే ప్రయత్నం చేశాడు.
త్వరలో 234 ఉద్యోగ అవకాశాలు ఏర్పడుతాయని, తమిళనాడులోని యువకులందరూ సిద్ధంగా ఉండాలని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్లో చాలా అర్థాలున్నాయి. 234 ఉద్యోగాలు అంటే తమిళనాడు శాసన సభలో ఎమ్మెల్యేల సంఖ్య. త్వరలో ఉద్యోగావకాశాలు వస్తాయంటే తమిళనాడు శాసనసభ రద్దయి ఎన్నికలు వస్తాయా అని అతని ఫోలోవర్లు తికమకపడ్డారు. తమిళనాడులో అన్నాడీఎంకే ప్రభుత్వం ఏర్పడి ఏడాది కూడా కాలేదు. ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల సమయం ఉంది. జయలలిత మరణం, తాజాగా ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం రాజీనామా, అన్నా డీఎంకే చీఫ్ శశికళ ముఖ్యమంత్రి కాబోతున్న తరుణంలో అశ్విన్ ట్వీట్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అన్నా డీఎంకేలో అసమ్మతి ఏర్పడి ప్రభుత్వం కూలిపోతుందని అశ్విన్ భావించడా అని నెటిజెన్లు మెదడుకు పదును పెట్టారు. రెండు గంటల తర్వాత అశ్విన్ మరో ట్వీట్ చేశాడు. 'యువకులారా కూల్‌గా ఉండండి. ఈ ట్వీట్‌కు రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేదు, కేవలం ఉద్యోగ ప్రకటనకు సంబంధించినది' అంటూ జోక్ చేశాడు.
To all the youngsters in TN, 234 job opportunities to open up shortly.
— Ashwin Ravichandran (@ashwinravi99) 6 February 2017
Guys please cool it down, it is a job creation drive.Nothing to do with Politics.#howmuchtwisting