పంటకాలువలో పడి చిన్నారి మృతి
కర్నూలు: ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు పంట కాలువలో పడి చిన్నారి మృతి చెందిన ఘటన శుక్రవారం కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. జూపాడుబంగ్లా మండలం తాటిపాడు గ్రామానికి చెందిన కురుమయ్య, కృష్ణవేణి దంపతుల కుమార్తె రుషిత(3)ను బంధువుల వద్ద ఉంచి పొలానికి వెళ్లారు.
సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన దంపతులు కూతురు కోసం బంధువుల ఇంటికి వెళ్లి చూసింది. అక్కడ కనిపించకపోయే సరికి చుట్టుపక్కల వెదికారు. చివరికి సమీపంలోని పంట కాలువలో శవమై ఉండగా స్థానికులు గుర్తించారు. ఆడుకుంటూ వెళ్లి నీళ్లలో పడి చనిపోయి ఉంటుందని భావిస్తున్నారు. చిన్నారి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.