Paper companies
-
మార్కెట్లు వీక్- పేపర్ షేర్లు గెలాప్
డీమార్ట్ స్టోర్ల ప్రమోటర్ కంపెనీ వాటా కొనుగోలు చేసిన వార్తలతో ఆంధ్రా పేపర్ కౌంటర్‌కు ఉన్నట్టుండి డిమాండ్ పెరిగింది. మరోపక్క గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో వెస్ట్ కోస్ట్ పేపర్ మిల్స్ కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. ఆంధ్రా పేపర్ లిమిటెడ్ ప్రమోటర్ కంపెనీలలో వెస్ట్ కోస్ట్ పేపర్ మిల్స్ ఒకటి కావడం గమనార్హం! వెరసి ఈ రెండు కౌంటర్లూ పతన మార్కెట్లోనూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. ఆంధ్రా పేపర్ లిమిటెడ్ ఓపెన్ మార్కెట్ ద్వారా వారాంతాన రాధాకిషన్ దమానీ కంపెనీ బ్రైట్ స్టార్ ఇన్వెస్ట్మెంట్స్ 1.26 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు ఎక్స్ఛేంజీల డేటా వెల్లడించింది. షేరుకి రూ. 206.23 సగటు ధరలో ఆంధ్రా పేపర్లో 5 లక్షల ఈక్విటీ షేర్లను బ్రైట్ స్టార్ సొంతం చేసుకుంది. నిమి ఎంటర్ప్రైజెస్ తదితర సంస్థలు వాటాను విక్రయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఆంధ్రా పేపర్ షేరు 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. అమ్మేవాళ్లు కరువుకాగా.. కొనేవాళ్లు అధికంకావడంతో రూ. 42.5 ఎగసి రూ. 255 సమీపంలో ఫ్రీజయ్యింది. కాగా.. గత వారం ఆంధ్రా పేపర్ ప్రమోటర్ కంపెనీలలో ఒకటైన ఇంటర్నేషనల్ పేపర్ ఆఫర్ ఫర్ సేల్ విధానంలో 10 శాతం వాటాను విక్రయించింది. 2020 మార్చికల్లా ఆంధ్రా పేపర్లో 20 శాతం వాటాను ఇంటర్నేషనల్ పేపర్ కలిగి ఉంది. వెస్ట్ కోస్ట్ పేపర్ మిల్స్ గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో వెస్ట్ కోస్ట్ పేపర్ నికర లాభం 157 శాతం జంప్‌చేసి రూ. 146 కోట్లను అధిగమించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 28 శాతం పెరిగి రూ. 743 కోట్లకు చేరింది. రూ. 48 కోట్లమేర పన్ను లాభం జమకావడం లాభదాయకతకు బలం చేకూర్చింది. గత (2018-19) క్యూ4లో రూ. 42 కోట్ల పన్ను వ్యయాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో వెస్ట్ కోస్ట్ పేపర్ షేరు 14 శాతం దూసుకెళ్లింది. రూ. 25 ఎగసి రూ. 205 సమీపంలో ట్రేడవుతోంది. ఇతర కౌంటర్లూ పేపర్ తయారీ కౌంటర్లలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో స్టార్ పేపర్ 12 శాతం దూసుకెళ్లి రూ. 118 వద్ద, శేష సాయి 6.3 శాతం జంప్‌చేసి రూ. 166 వద్ద ట్రేడవుతున్నాయి. ఈ బాటలో ఇమామీ పేపర్ దాదాపు 4 శాతం ఎగసి రూ. 84కు చేరగా.. జేకే పేపర్ 4 శాతం పెరిగి రూ. 105ను తాకింది. ఇక టీఎన్ పేపర్ 3.5 శాతం బలపడి రూ. 121 వద్ద, బాలకృష్ణ పేపర్ 5 శాతం పుంజుకుని రూ. 20 వద్ద, బల్లార్పూర్ 3.7 శాతం లాభంతో రూ. 1.40 వద్ద వద్ద ట్రేడవుతున్నాయి. -
సుబాబుల్ ధర తగ్గించేది లేదు
కంపెనీల ముక్కు పిండి రైతులకు చెల్లించాల్సిన బకాయిలు వసూలు చేయాలి అధికారులను ఆదేశించిన మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమా గాంధీనగర్ : తమకు నష్టాలు వస్తున్నందున సుబాబుల్ కొనుగోలు ఒప్పంద ధర తగ్గించాలని పేపర్ కంపెనీలు చేసుకున్న అభ్యర్థనను అంగీకరించేది లేదని రాష్ట్ర మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశపు హాలులో కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల సుబాబుల్ రైతులతో మార్కెటింగ్ శాఖ సమీక్ష సమావేశం బుధవారం జరిగింది. గత ఏడాది ఫిబ్రవరిలో పేపర్ కంపెనీలు టన్ను సుబాబుల్‌ను రూ.4400 ధరకు కొనుగోలు చేసేందుకు అంగీకరించాయని మంత్రి ప్రత్తిపాటి తెలిపారు. తాము నష్టాబాట పట్టినందున రూ.700 తగ్గించి ధర నిర్ణయించాలని మార్కెటింగ్ శాఖకు లేఖ రాశాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రైతుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు సమీక్ష సమావేశం ఏర్పాటుచేశామని చెప్పారు. సుబాబుల్ మార్కెటింగ్, తూకం, రవాణాలో ఎదురయ్యే ఇబ్బందులు తెలియజేయాలని రైతులకు సూచించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడారు. పేపర్ కంపెనీలకు ఎటువంటి నష్టాలూ లేవని, నిర్ణయించిన ధరకు కొనాల్సిందేనని స్పష్టంచేశారు. జిల్లాకో రేట నిర్ణయించడాన్ని నియంత్రించాలని, అనధికార రవాణాను నిలుపుదల చేయాలని కోరారు. ఎస్పీఎం కంపెనీ రైతులకు బకాయిలు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని, మూడు జిల్లాల రైతులకు రూ.20 కోట్లు చెల్లించాలని తెలిపారు. అనంతరం మంత్రులు మాట్లాడుతూ ఎస్పీఎం కంపెనీపై కేసులు వేసి అరెస్ట్ వారెంట్ తీసుకోవాలని, అవసరమైతే ఆర్ఆర్ యాక్ట్ కింద నోటీసుల జారీ చేయాలని ఆదేశించారు. ఈ మేరకు మూడు జిల్లాల కలెక్టర్లకు సమాచారం ఇవ్వాలని మార్కెటింగ్ కమిషనర్‌కు సూచించారు. ఫిబ్రవరి 18తో కంపెనీలు, రైతుల ఒప్పందం ముగుస్తున్నందును ఈ దఫా రేటు పెంచేలా ఒత్తిడి చేస్తామన్నారు. కలెక్టర్ బాబు.ఎ, మార్కెటింగ్ శాఖ కమిషనర్ కిషోర్, సలహాదారు కృష్ణారావు, డెరైక్టర్ అహ్మద్, జేడీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. జేడీ శ్రీనివాసరావుపై రైతుల ఆగ్రహం మార్కెటింగ్ శాఖ జాయింట్ డెరెక్టర్ జి.శ్రీనివాసరావు వ్యవహార శైలిపై సుబాబుల్ రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన పేపర్ కంపెనీలతో లాలూచీ పడ్డారని ఆరోపించారు. ఒంగోలుకు చెందిన రైతు మాట్లాడుతూ ఎస్పీఎం కంపెనీతో జేడీ లాలూచీ పడ్డారని ఆరోపించారు.