pappula chalapati rao
-
టీడీపీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా అసమ్మతినేతల సమావేశం
విశాఖపట్నం(పాయకరావుపేట): పాయకరావుపేట ఎమ్మెల్యే వి. అనితకు వ్యతిరేకంగా మంగళవారం అసమ్మతి నేతలు సమావేవం ఏర్పాటు చేశారు. పాయకరావుపేట నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ నాయకులను, కార్యకర్తలను పట్టించుకోవడంలేదని, కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన వలస నాయకులకు నామినేటెడ్ పదవులు ఇచ్చి ఎప్పటి నుంచో ఉన్న టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారని ఆమెకు వ్యతిరేకంగా అసమ్మతినేతలు పాయకరావుపేటలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ విషయం గురించి పార్టీ జిల్లా అధ్యక్షుడు పప్పల చలపతిరావుని సుమారు 150 అసమ్మతి నాయకులు, కార్యకర్తలు కలిశారు. ఈ నెల 14న ఏపీ సీఎం టీడీపీ అధినేతను చంద్రబాబును కలిసి తాడోపేడో తేల్చుకుంటామని వారు చెబుతున్నారు. -
వంగలపూడి అనిత తీరుపై అసమ్మతి
పాయకరావుపేట(విశాఖపట్టణం జిల్లా): విశాఖ జిల్లా పాయకరావుపేట టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత తీరుపై నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన నాయకులు అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు మంగళవారం నియోజకవర్గంలోని సుమారు 200మంది ముఖ్యనాయకులు పాయకరావుపేటలో సమావేశమాయ్యారు. పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడి పని చేసిన వారిని ఆమె గుర్తించడంలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారికే పెద్ద పీట వేస్తున్నారని..వారికే పదవులు కట్టబెడుతున్నారని.. ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవడంతో ఎమ్మెల్యే పూర్తిగా విఫలమైందని వారు ఆరోపించారు. ఈ మేరకు ఎమ్మెల్యే పని తీరును ముందుగా ఎమ్మెల్సీ పప్పుల చలపతిరావు దృష్టికి తీసుకువెళ్లి.. ఆయన ద్వారా ఈ నెల 14న ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు నియోజకవర్గంలోని ముఖ్యనాయకులు తెలిపారు.