papularity
-
కన్నులతో చెప్పావె.....
తొలి సినిమాతో కావచ్చు...కాలం కలిసిరాక అది ఆడకపోతే...మరో రెండు సినిమాల తరువాతనైనా కావచ్చు... బ్రహ్మాండమైన గుర్తింపు వస్తుంది. కానీ కేరళ కుట్టి ప్రియా వారియర్... తొలి సినిమా విడుదల కాకముందే కన్నుగీటే దృశ్యంతో స్టార్డమ్ తెచ్చుకుంది. గూగుల్ సెర్చ్‌లో టాప్‌లో నిలిచింది. ‘ఎవరీ అమ్మాయి?’ అని దేశమంతా ఆరా తీసింది. ‘లవర్స్ డే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రియా ప్రకాష్ వారియర్ గురించి కొన్ని ముచ్చట్లు... అదేమిటో మరి... కేవలం ఒకేఒక సినిమాలో ఒకేఒక దృశ్యం తనకు బోలెడు గుర్తింపు తీసుకువస్తుందని కలలో కూడా అనుకోలేదు ప్రియా. తొలిచిత్రం ‘ఒరు ఆడార్ లవ్’లో చిలిపిగా కన్నుగీటే సీన్ చేసింది ప్రియా. ఈ సీన్ సోషల్‌మీడియాను కుదిపేసింది. ‘‘నిజానికి నాకంటే అందంగా కన్నుగీటే వాళ్లు చాలామంది ఉన్నారు. నాకు మాత్రం బాగా గుర్తింపు వచ్చింది’’ అని నవ్వుతుంది ప్రియా. కన్నుకొట్టే సన్నివేశం సంచలనం కావడంతో ‘ఒరు ఆడార్ లవ్’ సినిమాలో ప్రియా పాత్ర నిడివిని పెంచడం కోసం డైరెక్టర్ ఒమర్ స్క్రిప్ట్ కూడా మార్చవలసివచ్చిందట! ‘‘ప్రేక్షకులు నన్ను పెద్ద పాత్రలో చూడాలనుకుంటున్నారు’’ అంటుంది ప్రియా. ఇలా కూడా! పార్లమెంట్లో ప్రధాని మోదీని చూసి రాహుల్‌గాంధీ కన్నుగీటిన దృశ్యం టీవీలో కనిపించిందో లేదో...దీనిపై కామెంట్ తీసుకోవడానికి మీడియా మొత్తం ఆమె ఇంటి దగ్గరే ఉందట! ప్రియాను ఆకాశానికెత్తే కామెంట్లే కాదు, ‘పెద్ద అందగత్తేమీ కాదు... మేకప్‌తో మ్యానేజ్ చేస్తుంది’ అంటూ విమర్శించే కామెంట్లు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. వివాదాలు కూడా అప్పుడే లైన్ కట్టాయి. ‘మాణిక్య మలరాయ పూవి’ పాటపై, ‘శ్రీదేవి బంగ్లా’ సినిమా టీజర్‌పై వివాదాలు లేచాయి.. ఇలాంటివి పెద్దగా పట్టించుకోకుండా నటన మీదే శ్రద్ధ పెడుతుంది ప్రియా. ‘‘నన్ను నేను నిరూపించుకోవాల్సి ఉంది’’ అంటోంది ఆత్మవిశ్వాసంతో. పాడుతా తీయగా! కేరళలలోని త్రిసూరు విమల కాలేజీలో బీకాం చదివిన ప్రియాకు చిన్నప్పటి నుంచి నటన అంటే ఇష్టం. నటి కావాలనేది తన కోరిక. తల్లిదండ్రులు ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. శాస్త్రీయ నృత్యంలో ప్రవేశం ఉన్న ప్రియా వారియర్ చక్కగా పాడుతుంది. భవిష్యత్‌లో సినిమాల్లో పాడే అవకాశం వస్తే సంతోషంగా పాడుతాను అంటుంది. ‘‘గుర్తింపు తాలూకు గర్వాన్ని తలకెక్కించుకోవద్దు’’ అని తల్లి చెప్పిన మంచిమాటను ఎప్పుడూ గుర్తుంచుకుంటుందట ప్రియా ప్రకాష్ వారియర్. -
లయన్స్ సేవలు వెలకట్టలేనివి
సమాజ సేవలో పేరు ప్రతిష్ఠలు తెచ్చుకోవాలి, ఎమ్మెల్యే హన్మంత్ సింధే పిట్లం : లయన్స్ క్లబ్ చేస్తున్న సేవలు ప్రశంసనీయంగా, మరువలేనివిగా ఉన్నాయని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ సింధేlఅన్నారు. ఈ సందర్భంగా ఆయన శనివారం రాత్రి మండల కేంద్రంలోని సాయి గార్డెన్లో ఏర్పాటు చేసిన 11వ ఇన్స్టాలేషన్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ముందుగా జ్యోతి ప్రజ్వళన చేపట్టి అనంతరం మాట్లాడారు. లయన్స్ క్లబ్ చేపడుతున్న కార్యక్రమాలు చాలా బాగున్నాయని, అనాథ పిల్లల కోసం పిట్లంలో ఏర్పాటు చేసిన అనాథ శరణాలయం ప్రశంసనీయమన్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం పిలుపు మేరకు హరితహారం కార్యక్రమం చేపట్టడం, పేద పిల్లలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం లాంటిSకార్యక్రమాలు చేపడుతుండడం అభినంధనీయమన్నారు. కొత్తగా ఏర్పాౖటెన కమిటీ సభ్యులకు అభినంధనలు తెలిపారు. సమాజ సేవలో మంచి పేరు ప్రతిష్ఠలు తెచ్చుకోవాలని సూచించారు. కొత్త అధ్యక్షుల ప్రమాణ స్వీకారం పిట్లం లయన్స్ క్లబ్ కొత్త అధ్యక్షునిగా కంబాపూర్ గ్రామానికి చెందిన సంగప్ప శనివారం ప్రమాణస్వీకారం చేశారు. కార్యదర్శిగా బాలయ్య, ట్రెజరర్‌గా శ్రీనివాస్‌లు బాధ్యతలు చేపట్టారు. నారాయణఖేడ్ క్లబ్ అధ్యక్షునిగా డాక్టర్ శివకుమార్ బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన లయన్స్ మల్టిబుల్ కౌన్సిల్ చైర్ పర్సన్ డాక్టర్ బాబురావ్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సభ్యులు సమాజంలో అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. పలు సామాజిక కార్యక్రమాలు చేపట్టేందుకు పిట్లం క్లబ్‌కు రూ. 25 వేల రూపాయల నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ సభ్యులు సంజీవ్ రెడ్డి, వేణుగోపాల్, రాజ్ కుమార్, లక్ష్మీ నారాయణ, చంద్రశేఖర్, సుధాకర్, రమణాగౌడ్, గ్రామ సర్పంచ్ హన్మ గంగారాం, జెడ్పీటీసీ ప్రతాప్ రెడ్డి, వైస్ ఎంపీపీ నర్సాగౌడ్, కో ఆప్్షన్ శేక్ కరీం, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.