Parachutes
-
‘గగన్‌యాన్’లో మరో కీలక పరీక్ష విజయవంతం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్‌యాన్ ప్రయోగానికి సంబంధించి మరో కీలక పరీక్ష విజయవంతమైంది. ఈ నెల 8వ తేదీన డ్రోగ్ ప్యారాచూట్లకు ప్రయోగాత్మక పరీక్షలు విజయవంతంగా నిర్వహించినట్లు ఇస్రో శుక్రవారం తన వెబ్సైట్లో పేర్కొంది. గగన్‌యాన్ మిషన్‌లో వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి సురక్షితంగా భూమికి చేరుకునేందుకు డ్రోగ్ ప్యారాచూట్ విస్తరణ పరీక్షల అవసరం ఉందని తెలిపింది. క్రూ మాడ్యూల్‌ను స్థిరీకరించడానికి, రీ–ఎంట్రీ సమయంలో దాని వేగాన్ని తగ్గించి సురక్షితంగా తీసుకురావడానికి ఈ ప్యారాచూట్ కీలకపాత్ర పోషిస్తుందని వెల్లడించింది. గగన్‌యాన్ క్రూ మాడ్యూల్ మందగింపు వ్యవస్థ కోసం సంక్లిష్టమైన ప్యారాచూట్ స్వీకెన్స్‌లో మొత్తం 10 వరకు ఉంటాయని పేర్కొంది. గగన్‌యాన్ ప్రయోగంలో క్రూ మాడ్యూల్‌ను అంతరిక్షంలోకి పంపించి, దానిని మళ్లీ భూమి మీదకు తీసుకువచ్చేందుకు, సురక్షితంగా ల్యాండింగ్ చేసేందుకు ఈ ప్యారాచూట్లు కీలక పాత్ర పోషిస్తాయని, అందుకు వీటి పనితనాన్ని పరీక్షించుకుని నిర్ధారించుకుంటున్నామని ఇస్రో వివరించింది. -
నేవీ ట్రైనింగ్‌లో ప్రమాదవశాత్తు చందక గోవింద్ మృతి
-
విజయనగరంలో విషాదం.. చందక గోవింద్ మృతి
సాక్షి, హైదరాబాద్: మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్ శిక్షణా కార్యక్రమంలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నేవీ అధికారి చందక గోవింద్(31) మృతిచెందారు. దీంతో, గోవింద్ స్వగ్రామం విజయనగరంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, పారాచ్యూట్ తెరుచుకోకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు నేవీ అధికారులు తెలిపారు. వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌లోని బంకురా జిల్లాలో శిక్షణా కార్యక్రమం జరుగుతోంది. శిక్షణలో భాగంగా ఆయన ఎయిర్‌క్రాఫ్ట్ నుంచి కిందకి దూకగా.. పారాచ్యూట్ పూర్తిగా తెరుచుకోలేదు. దీంతో తీవ్ర గాయాలై మృతి చెందారు. ఇక, బుర్ద్వాన్ జిల్లాలోని పనాగఢ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో పారాట్రూపర్స్ ట్రైనింగ్ టీమ్‌లో కమాండో గోవింద్ విధులు నిర్వహిస్తున్నట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెల్లడించింది. తీవ్ర గాయాలతో ఉన్న కమాండో గోవింద్‌ను వెంటనే బార్జోరా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మరణించారని వైద్యులు ధ్రువీకరించారు. ఇదిలా ఉండగా.. పనాగఢ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ఉన్న వ్యూహాత్మక విమానాల్లో జవాన్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన స్పెషల్ ఫోర్సెస్ యూనిట్లు ఇక్కడ కసరత్తులలో పాల్గొంటాయి. పారాట్రూపర్ల బృందంలో సభ్యులైన గోవింద్.. C130J సూపర్ హెర్క్యులస్ విమానం నుంచి సాధారణ డ్రాప్ సమయంలో అదృశ్యమయ్యారని భారత వైమానిక దళం తెలిపింది. ఇక, ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు నేవీ అధికారులు తెలిపారు. కాగా, చందక గోవింద్ స్వగ్రామం విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పర్ల గ్రామం. మరోవైపు.. రేపు స్వగ్రామానికి చందక గోవింద్ మృతదేహం చేరుకోనుంది. Adm R Hari Kumar #CNS & all personnel of #IndianNavy pay tribute to Chandaka Govind, Petty Officer who lost his life whilst undergoing training exercise at Panagarh on 05 Apr 23 and extend heartfelt condolences to the bereaved family. pic.twitter.com/FRLZ9k5018 — SpokespersonNavy (@indiannavy) April 5, 2023 -
Integrated Main Parachute Airdrop Test: ‘గగన్‌యాన్’లో ముందడుగు...
న్యూఢిల్లీ: ఇస్రో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మానవసహిత అంతరిక్ష కార్యక్రమం ’గగన్‌యాన్’కు ఏర్పాట్లన్నీ చకచకా జరుగుతున్నాయి. మిషన్‌లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లే మన ఆస్ట్రొనాట్లను సురక్షితంగా భూమ్మీదికి తిరిగి తీసుకొచ్చేందుకు వాడబోయే పారాచూట్లను విజయవంతంగా పరీక్షించారు. ఇంటిగ్రేటెడ్ మెయిన్పారాచూట్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ (ఐఎంఏటీ)గా పిలిచే ఈ పరీక్షను ఉత్తరప్రదేశ్‌లో ఝాన్సీ జిల్లాలోని బబీనా ఫీల్డ్ ఫైర్ రేంజ్ (బీఎఫ్ఎఫ్ఆర్) నుంచి విక్రం సారాబాయి స్పేస్ సెంటర్ పర్యవేక్షణలో శనివారం నిర్వహించారు. పరీక్షలో భాగంగా ఐదు వేల కిలోలున్న డమ్మీ పేలోడ్‌ను 2.5 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి భారత వైమానిక దళానికి చెందిన ఐఎల్–76 విమానం ద్వారా జారవిడిచారు. తర్వాత ప్రధాన పారాచూట్లను తెరిచారు. ‘‘పేలోడ్ వేగాన్ని అవి సురక్షిత వేగానికి తగ్గించాయి. మూడు నిమిషాల్లోపే దాన్ని భూమిపై సురక్షితంగా లాండ్ చేశాయి. నిజానికి ప్రధాన పారాచూట్లలో ఒకటి సకాలంలో తెరుచుకోలేదు. ఇది కూడా మంచి ఫలితమేనని చెప్పాలి. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడే అంతిమంగా పూర్తిగా లోపరహితమైన పారాచూట్లను గగన్‌యాన్ కోసం సిద్ధం చేయగలుగుతాం’’ అని సారాబాయ్ సెంటర్ పేర్కొంది. ‘‘గగన్‌యాన్ క్రూ మాడ్యూల్ వ్యవస్థలో మొత్తం 10 పారాచూట్లుంటాయి. ముందుగా అపెక్స్ కవర్ సపరేషన్ పారాచూట్లు రంగంలోకి దిగుతాయి. తర్వాత రాకెట్ వేగాన్ని బాగా తగ్గించడంతో పాటు దాని దిశను స్థిరీకరించే డ్రాగ్ పారాచూట్లు విచ్చుకుంటాయి. నిజానికి ఆస్ట్రొనాట్లు సురక్షితంగా దిగేందుకు రెండు ప్రధాన పారాచూట్లు చాలు. ముందు జాగ్రత్తగా మూడోదాన్ని కూడా సిద్ధంగా ఉంచనున్నాం’’ అని ఇస్రో వివరించింది. డీఆర్డీఓతో కలిసి ఈ పారాచూట్లను రూపొందించారు. -
పిచ్చి పట్టిందా.., పారాచుట్ లేకుండా విమానం నుంచి దూకేశాడు..
వాషింగ్టన్ డిసి : పారా చుట్ లేకుండా సరదాగా విమానం నుంచి దూకితే ఎలా ఉంటుంది? అని ఎవరితోనైనా చెబితే ఏం ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తుందా?. వెళ్లి డాక్టర్ కి చూయించుకోమని సలహా ఇస్తారు. సరిగ్గా ఇలాగే ఓ వ్యక్తి తన స్నేహితులతో అలాగే చెప్పాడు. చెప్పడమే కాదు పారా చుట్ లేకుండా విమానం నుంచి దూకి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ను సొంతం చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని టెక్సాక్ కు చెంది ఐకిన్స్ వృత్తి రిత్యా పైలెట్. స్కై డ్రైవర్ కూడా. ఇటీవల ఐకిన్స్ పారాచుట్ లేకుండా విమానం నుంచి కిందకి దూకాడు. దీంతో ఆయన అభిమానులు, సన్నిహితులు సంతోషం వ్యక్తం చేశారు. అయినా ఇలాంటి ప్రమాదకరమైన విన్యాసాలు చేయడం ఐకిన్స్ కు కొత్తేమి కాదు. 2016 లో పారాచూట్ లేకుండా విమానం నుండి దూకి గిన్నిస్ వరల్డ్ రికార్డును బద్దలుకొట్టాడు. తాజాగా 25,000వేల అడుగుల ఎత్తులో ఉన్న విమానం నుంచి కిందకి దూకాడు. కింద పడే సమయంలో 150 చదరపు అడుగుల పరిమాణంలో ఉన్న నెట్ లోకి జారేలా ప్లాన్ చేశాడు. అతనికి ఐరన్ మ్యాన్ చిత్రానికి స్టంట్‌గా పనిచేసిన ప్రొఫెషనల్ స్కైడ్రైవర్ ఫెలిక్స్ సాయం చేయడంతో గాల్లో నుంచి సునాయాశంగా కిందకి దూకాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలపై పలువురు నెటిజన్లు అతని సాహసానికి ఫిదా అవుతుంటే, చిప్ దొబ్బినట్లుంది అందుకే ఇలాంటి సాహసం చేస్తున్నాడంటూ మరికొంతమంది సెటైర్లు వేస్తున్నారు. చదవండి : Corona: వేపచెట్ల కిందే చికిత్స... ప్రాణం నిలుస్తోంది! -
ముఖ్యమైన వాళ్లు
మీకు తెలిసిన కథే. ఒక వైద్యుడు, ఒక న్యాయవాది, ఒక మతబోధకుడు, ఒక చిన్నపిల్లవాడు ఓ చిన్న విమానంలో ప్రయాణిస్తున్నారు. అనూహ్యంగా విమానంలో ఏదో లోపం తలెత్తింది. లోపల ఉండే నిపుణులు ప్రయత్నించారు కానీ మరమ్మతు చేయలేకపోయారు. చివరికి పైలట్ నుంచి ప్రకటన వెలువడింది. ‘‘నన్ను క్షమించండి. నా చేతుల్లో ఏమీ లేకుండా పోయింది’’ అని చెప్తూనే ప్యారాచ్యూట్ నుంచి కిందికి దూకేశాడు. దురదృష్టవశాత్తూ విమానంలో ఇంకా మూడు మాత్రమే ప్యారాచ్యూట్లు మిగిలి ఉన్నాయి. వెంటనే వైద్యుడు ఒక ప్యారాచ్యూట్ అందుకున్నాడు. ‘‘నా జీవితం చాలా ముఖ్యమైనది. నేను బతికి ఉండడం చాలా ముఖ్యం. నేను బతికి ఉంటే నా జీవితకాలంలో అనేకమందిని నా వైద్యంతో బతికించవచ్చు’’ అని చెప్పి విమానం నుంచి కింది దూకేశాడు. రెండో ప్యారాచ్యూట్ను న్యాయవాది లాగేసుకున్నాడు. ‘‘నేను తెలివైన వాడిని. నా వంటి తెలివైన వాడు లోకానికి అవసరం’’ అని నిముషం కూడా ఆలస్యం చేయకుండా దడేల్మని కింది దూకేశాడు. ఇక మిగిలింది ఒకటే ప్యారాచ్యూట్. మిగిలినవారు ఆ పిల్లవాడు, ఆ మత బోధకుడు. ‘‘త్వరగా ఆ ప్యారాచ్యూట్ తీసుకుని కిందికి దూకెయ్. నేను ఎంతో జీవితాన్ని గడిపాను. నువ్వు చిన్నపిల్లవాడివి నీకింకా చాలా జీవితం ఉంది. నువ్వు బతకాలి, దూకెయ్’’ అని తొందరపెట్టాడు మతబోధకుడు. ఆ బాలుడు మత బోధకునికి ప్యారాచ్యూట్ ఇచ్చి, ‘‘మీరూ దూకేయొచ్చు ఫాదర్. ఇంతక్రితం ఆ న్యాయవాది తీసుకెళ్లింది ప్యారాచ్యూట్ కాదు, నా లెదర్ బ్యాగ్’’ అని చెప్పాడు. తెలివైనవాళ్లమని, ప్రపంచానికి ముఖ్యులం అని అనుకుంటూ తిరిగేవాళ్లు చాలాసార్లు తమను తాము తెలుసుకోవడంలో తప్పటడుగు వేస్తారు. (కథ కోసం ఇందులో కొన్ని వృత్తులను పేర్కొడం జరిగింది తప్ప, ఎవరినీ వేలెత్తి చూపాలన్న ఉద్దేశం లేదు) -
పారాచూట్‌తో ప్లేన్ జంప్ చేసింది..!
విమానం ఇంజిన్ ఫెయిలైంది. అందులో ఉండేవారు ఏం చేస్తారు.. పారాచూట్ వేసుకుని జంప్ చేస్తారు. కానీ ఇక్కడ ఏకంగా ప్లేనే.. పారాచూట్ వేసుకుని.. జంప్ చేసింది. ఇక్కడ మీరు చూస్తున్న సీన్ ఇదే. ఇటీవల ఆస్ట్రేలియాలోని లాసన్ పట్టణంలో జనమంతా ఈ ఘటనను నోరెళ్లబెట్టి చూశారు. సైర్రస్ అనే ఈ తేలికపాటి విమానం భూమికి 4 వేల అడుగుల ఎత్తులో విహరిస్తున్నప్పుడు ఇంజిన్ చెడిపోయింది. దీంతో విమానంలో ఉండే పారాచూట్ వ్యవస్థను పైలట్ వినియోగించుకున్నాడు. ఇందులో ప్రయాణిస్తున్న నలుగురిని సురక్షితంగా కిందకు దించాడు. తమ విమానంలో ఉన్న ఈ పారాచూట్ వ్యవస్థ ద్వారా చాలా మంది ప్రాణాలు దక్కించుకున్నారని సైర్రస్ కంపెనీ ప్రతినిధి తెలిపారు.