పారాచూట్‌తో ప్లేన్ జంప్ చేసింది..!
విమానం ఇంజిన్ ఫెయిలైంది. అందులో ఉండేవారు ఏం చేస్తారు.. పారాచూట్ వేసుకుని జంప్ చేస్తారు. కానీ ఇక్కడ ఏకంగా ప్లేనే.. పారాచూట్ వేసుకుని.. జంప్ చేసింది. ఇక్కడ మీరు చూస్తున్న సీన్ ఇదే. ఇటీవల ఆస్ట్రేలియాలోని లాసన్ పట్టణంలో జనమంతా ఈ ఘటనను నోరెళ్లబెట్టి చూశారు. సైర్రస్ అనే ఈ తేలికపాటి విమానం భూమికి 4 వేల అడుగుల ఎత్తులో విహరిస్తున్నప్పుడు ఇంజిన్ చెడిపోయింది.
దీంతో విమానంలో ఉండే పారాచూట్ వ్యవస్థను పైలట్ వినియోగించుకున్నాడు. ఇందులో ప్రయాణిస్తున్న నలుగురిని సురక్షితంగా కిందకు దించాడు. తమ విమానంలో ఉన్న ఈ పారాచూట్ వ్యవస్థ ద్వారా చాలా మంది ప్రాణాలు దక్కించుకున్నారని సైర్రస్ కంపెనీ ప్రతినిధి తెలిపారు.