parakala prabhakar comments
-
నిర్మలా సీతారామన్ భర్త సంచలన వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థిక రంగ సంక్షోభంపై కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్ పూర్తి భరోసా ఇస్తోంటే..ఆమె భర్త, ఆర్థికవేత్త పరకాల ప్రభాకర్ ఇందుకు భిన్నంగా స్పందించారు. ప్రస్తుత ఆర్థిక మాంద్య పరిస్థితులపై మండిపడిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఆర్థిక మాంద్య పరిస్థితిని ప్రభుత్వం అంగీకరించే పరిస్థితిలో లేదని వ్యాఖ్యానించారు. ఆర్ధిక వ్యవస్థ బాగాలేదనే వాదన ఒప్పుకోవడానికి విముఖత చూపుతోందంటూ ‘ ది హిందూ’లో ప్రచురించిన ఒక కాలమ్‌లో ఆయన బీజేపీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు గుప్పించడం గమనార్హం.. ఒకదాని తరువాత ఒకటి పలు సెక్టార్లు తీవ్రమైన సవాళ్లును ఎదుర్కొంటుండగా, బీజేపీ ఆర్ధికవ్యవస్థను దెబ్బతీస్తున్న కారణాలను విశ్లేషించలేకపోతోందన్నారు. దీనికి సంబంధించి ఎలాంటి వ్యూహాత్మక దృష్టి ప్రభుత్వానికి లేదన్నారు. ఈ విషయంలో పార్టీ థింక్ ట్యాంక్ కూడా విఫలమైందని పేర్కొన్నారు. సంక్షోభాన్ని పరిష్కరించే ఒక చిన్న మార్గాన్ని కూడా ప్రభుత్వం చూపలేకపోతోందని ఆయన విమర్శించారు. ఆర్థిక మందగమనంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఆయన ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం కొత్త విధానాలను రూపొందించడానికి సుముఖంగా లేదన్నారు. ప్రభుత్వం తిరస్కరణ మోడ్‌లో ఉందంటూ ఆయన ధ్వజమెత్తారు. అంతేకాదు "నెహ్రూ సోషలిజాన్ని విమర్శించటానికి" బదులుగా, ఆర్థిక వ్యవస్థ సరళీకరణకు మార్గం సుగమం చేసిన రావు-సింగ్ ఆర్థిక నమూనాను బీజేపీ అవలంబించాలని సూచించారు. ఆ ఇద్దరు ప్రధానులూ (పీవీ నరసింహారావు, మన్ మోహన్ సింగ్) పాటించిన విధానాలు ఆర్ధిక సరళీకరణకు దోహదం చేశాయనీ, ఈ విషయాన్ని గుర్తించి వాటిని పాటించడం మంచిదని పరకాల ప్రభాకర్ అన్నారు. సీతారామన్ స్పందన దీనిపై ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ప్రశ్నించినప్పుడు 2014 నుండి 2019 వరకు ప్రాథమిక సంస్కరణలు అనేకం చేసామని జవాబిచ్చారు. జీఎస్టీ, ఆధార్, గ్యాస్ పంపిణీ లాంటి ఇతర ప్రజా ప్రయోజన పథకాలను ఏకరువు పెట్టారు. ఈ కార్యక్రమాలు ఎకానమీ వృద్దికి దోహదపడడం లేదా అని ఆమె ప్రశ్నించారు. దీంతోపాటు ఆర్ధిక వృద్ధిరేటును పెంచేందుకు కేంద్రం ఇప్పటికే కార్పొరేట్ పన్నును తగ్గించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. -
‘భయం పుట్టిస్తున్న విజయవాడ నేరాలు’
-
‘భయం పుట్టిస్తున్న విజయవాడ నేరాలు’
విజయవాడ: టీడీపీ ప్రభుత్వం దివాళాకోరుతనంతో పనిచేస్తోందని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి కె. పార్థసారధి విమర్శించారు. నేరాలను చంద్రబాబు సర్కారు వ్యవస్థీకృతం చేస్తోందని ఆరోపించారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... తన కుమారుడు నారా లోకేశ్ అసమర్థను కప్పిపుచ్చకునేందుకే సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యనేత సూచన మేరకే టీడీపీ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తమది రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వమని చెప్పుకుంటున్న చంద్రబాబు.. అధికారులపై దాడులు చేసిన టీడీపీ నాయకులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. విజయవాడలో జరుగుతున్న దౌర్జన్యాలను ఎందుకు అరికట్టలేక పోతున్నారని సూటిగా అడిగారు. విజయవాడలో నేరాలు చూసి రాష్ట్రం భయపడుతోందన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ఏపీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా పనిచేస్తోందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కాట్జూ పేర్కొన్నారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మోదీలకు ఆయన లేఖ రాశారు. కాట్జూతో జగనే లేఖ రాయించారని టీడీపీ ఆరోపించనందుకు సంతోషిస్తున్నాం మొన్న ఢిల్లీ వెళ్లినప్పుడు లేఖ రాయమని కాట్జూను జగన్ కోరారని టీడీపీ నాయకులు అన్నాఅనొచ్చు అప్పుడప్పుడు తళుక్కుమని మెరిసే ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ ఎవరికీ తెలియని విషయం ఒకటి చెప్పారు తమది రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వమని ప్రకటించారు అనేక విషయాల్లో రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేసినప్పుడు ఆయన ఎందుకు నోరు విప్పలేదు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టడం రాజ్యాంగబద్ధమా? ఆ రోజు గుర్తుకు రాలేదేమో రాజ్యాంగ బద్దంగా పనిచేస్తుందని కాట్జూ కుటుంబ సభ్యుల ఫొటోలను మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పెడితే ఊరుకుంటారా అని పరకాల అడిగారు ఎన్నికలకు ముందు జగన్ కుటుంబ సభ్యుల ఫొటోలను మార్ఫింగ్ చేసి పోస్టు చేసినప్పుడు పరకాల ఎక్కడున్నారు? ఇవన్నీ బయట పెడితే సిగ్గుతో మీ కళ్లు చెవులు ముక్కు అన్ని మూసుకుపోతాయి తన కుమారుడి అసమర్థను కప్పిపుచ్చకునేందుకే సోషల్ మీడియా కార్యకర్తలపై సీఎం కేసులు పెట్టిస్తున్నారు సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెట్టి వేధించడం తగదు విజయవాడలో జరుగుతున్న దౌర్జన్యాలను ఎందుకు అరికట్డలేక పోతున్నారు? పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నది వాస్తవం కాదా? ఓ వ్యక్తి ని కిడ్నాప్ చేసి, చిత్రహింసలకు గురి చేస్తే.. టీడీపీ ముఖ్యనేతలే నిందితులకు కొమ్ముకాస్తున్నారు అధికారులపై దౌర్జన్యం చేసిన టీడీపీ నాయకులపై ఎటువంటి చర్యలు ఉండవు గదిలో కూర్చొబెట్టి సీఎం పంచాయతీ చేయడం రాజ్యాంగబద్ధమా అక్రమాలకు పాల్పడిన అధికార పార్టీ నేతలపై రాజ్యాంగబద్ధంగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? హవాలా కార్యకలాపాల్లోనూ టీడీపీ మంత్రుల హస్తముందన్న ఆరోపణలు వస్తున్నాయి ముఖ్యనేత సూచన మేరకే టీడీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారు నేరాలను టీడీపీ ప్రభుత్వం వ్యవస్థీకృతం చేస్తోంది అక్రమార్కులను పుచ్చొంకాయలు ఏరిపారేసినట్టు ఏరేయకపోతే ప్రజలు ఇబ్బందులు పడతారు