Parasailing
-
పారా సెయిలింగ్ మళ్లీ ఫెయిల్ !... ఇద్దరు మహిళలకు చేదు అనుభవం!!
ఇటివల కాలంలో పారాసెయిలింగ్ చేయడానికి యువత తహతహాలాడుతున్నారు. పైగా ఆకాశంలో పక్షుల మాదిరి విహరిస్తుంటే ఆ అనుభవమే వేరు. అంతేకాదు యువత అడ్వెంచర్స్ చేయడానికే మొగ్గు చూపుతుంది. అందుకోసం ఎంత రిస్క్ అయిన చేస్తున్నారు. అయితే ఎందుకనో ఇటీవల కాలంలో అవి ఫెయిల్ అవుతున్నాయనే చెప్పాలి. ఈ మధ్య ఒక జంట పారాసెయిలింగ్ చేస్తుండగా తాడు తెగి కింద పడిపోయిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయ్యింది. అచ్చం అలానే ముంబైలోని ఇద్దరు మహిళలు సముద్రంపై పారాసెయిలింగ్ చేయాలని సన్నద్ధమయ్యారు. కానీ వారికి కూడా చేదు అనుభవం ఎదురైంది. (చదవండి: ఢిల్లీలో 125కి చేరిన ఒమిక్రాన్ కేసులు.. న్యూయర్, క్రిస్మస్ వేడుకలు బ్యాన్) అసలు విషయంలో కెళ్లితే..ముంబైలోని సాకినాకాకు చెందిన ఇద్దరు మహిళలకు సముద్రం వద్ద పారా సెయిలింగ్‌కు సిద్ధమయ్యారు. అయితే వారు పడవ మీద నుంచి పారాసెయిలింగ్ చేస్తున్నప్పుడు అనుకోకుండా ఒక మోస్తారు ఎత్తుకు చేరుకున్నాక తాడు తెగిపోతుంది. దీంతో వాళ్లు ఒక్కసారిగా సముద్రంలో పడిపోతారు. అయితే అదృష్టవశాత్తు లైఫ్ జాకెట్లు ఉండటంతో సురక్షితంగా బయటపడ్డారు. ఈ మేరకు ఆ మహిళలు తాము తాడు కొంత భాగంలో నలిగి తెగిపోయే విధంగా ఉండటం గమినించాం అన్నారు. పైగా రైడ్ నిర్వహిస్తున్న వ్యక్తులు తాడు దెబ్బతిన్న భాగం గాలిలోకి వెళ్లదని హామీ కూడా ఇచ్చారని అన్నారు. దీంతో పలువురు భారతదేశంలో సాహస క్రీడల భద్రతా ప్రమాణాల గురించి మరోసారి తీవ్రస్థాయితో విమర్శలు లెవనెత్తారు. (చదవండి: ఆరేళ్ల చిన్నారి.. రూ.3.6 కోట్ల విలువైన ఇల్లు.. ఎలా కొనుగోలు చేసిందో తెలుసా?) -
వైరల్: ఆకాశంలో క్రేజీ కపుల్స్.. అంతలో అనుకోకుండా ..
ప్రస్తుత బిజీ లైఫ్‌లో తీరిక దొరికినప్పుడో, లేదా తీరిక చేసుకుని చాలా మంది విహారయాత్రకు వెళ్తుంటారు. అయితే కొందరు పర్యాటక ప్రాంతాల్లో అడ్వెంచర్స్ చేయాలని ప్రయత్నిస్తుంటారు. ఎందుకంటే టూర్‌కి వెళ్లడం సరదానిస్తే, అలాంటివి కిక్కునిస్తాయి. అయితే సాహసాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి లేదంటే ప్రమాదాలను కోరి తెచ్చుకన్నట్లే. తాజాగా ఓ జంట ఇలాంటి సాహసమే చేస్తూ ప్రమాదం బారిన పడ్డారు. ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. కేంద్ర పాలిత ప్రాంతం డయ్యూలో గుజరాత్‌కు చెందిన ఓ జంట విహారయాత్రకని వెళ్లారు. దీవి కావడంతో సముద్రం, బోటింగ్, పారాసెయిలింగ్ సహజమే. ఆదివారం ఆ జంట ఉనా తీరం బీచ్‌లో పారాసెయిలింగ్ చేశారు. పడవలో ఉన్న మరో వ్యక్తి దీన్ని వీడియో తీశారు. అయితే ఆ దంపతులు చాలా ఎత్తుకు ఎగిరిన తర్వాత పడవ, పారాసెయిలింగ్ మధ్య ఉన్న తాడు తెగిపోయింది. దీంతో ఆ జంట సముద్రంలో పడిపోయింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో వారికి ఎలాంటి గాయాలు కాలేదు. ముందస్తు జాగ్రత్తగా ఆ జంట లైఫ్ జాకెట్లు ధరించడంతో సముద్రంలో మునిగిపోకుండా నీటిపై తేలారు. తక్షణమే స్పందించిన బీచ్‌రెస్క్యూ సిబ్బంది జంటను కాపాడారు. పారాసెయిలింగ్ బోటు సిబ్బంది తమను పట్టించుకోలేదని, కొంత సేపటి తర్వాత రెస్క్యూ సిబ్బంది వచ్చి తమను కాపాడినట్లు వాళ్లుతెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన బోటు సిబ్బందిపై అధికారులు చర్యలు తీసుకోవాలని దంపతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు బోటు సిబ్బంది నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు. @VisitDiu @DiuTourismUT @DiuDistrict @VisitDNHandDD Parasailing Accident, Safety measures in India, and they said very rudely that this is not our responsibility. Such things happens. Their response was absolutely pathetic.#safety #diu #fun #diutourism #accident pic.twitter.com/doN4vRNdO8 — Rahul Dharecha (@RahulDharecha) November 14, 2021 చదవండి: Umngot River In Meghalaya: ఇదేం వింత.. పడవ గాల్లో ఎగరడం ఏంటి..!? -
పారా సెయిలింగ్ చేస్తుండగా తాడు తెగి..
సాక్షి ముంబై : ముంబైలోని మురూడ్‌లో పారా సెయిలింగ్ చేస్తుండగా తాడు తెగి ఓ 15 ఏళ్ల బాలుడు మరణించాడు. మరోవైపు ఆ బాలుని తండ్రికి గాయాలయ్యాయి. మురూడ్ సముద్ర తీరంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పుణే కసబారోడ్డుపై నివసించే గణేష్ పవార్ కుటుంబీకులు అలీబాగ్‌కు విహారయాత్రకు వెళ్లారు. సమీపంలో మురూడ్ తీరంలో పారా సేలింగ్ చేసేందుకు సిద్దమయ్యారు. పారాచూట్ పైకి వెళ్లిన అనంతరం దాని తాడు తెగిపోవడంతో ఒక్కసారిగా గణేష్ పవార్‌తోపాటు ఆయన కుమారుడు వేదాంత్ పవార్ (15) ఇద్దరు చాలా ఎత్తు నుంచి కిందపడిపోయారు. దీంతో ఘటన స్థలంలోనే వేదాంత్ దుర్మరణం చెందాడు. మరోవైపు గణేష్ పవార్‌కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించారు. -
కోయంబత్తూరు పారాసెయిలర్ మృతి: షాకింగ్ వీడియో
కోయంబత్తూరు: సాహసక్రీడలో పాల్గొన్న వ్యక్తి అనూహ్యంగా మృత్యువాతపడిన సంఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో సంచలనం రేపింది. పారాసెయిలింగ్ చేయబోయి.. ఆకాశం నుంచి అమాంతం పడిపోయిన దృశ్యాలను అక్కడే ఉన్న కొందరు చిత్రీకరించారు. వివరాల్లోకి వెళితే.. కోయంబత్తూరు మెడికల్ కళాశాల ఆవరణలో ఆదివారం నిర్వహించిన పారాస్లైడింగ్ ఈవెంట్ లో, అదే నగరానికి చెందిన వ్యాపారవేత్త మల్లేశ్వర రావు (53) పాల్గొన్నాడు. పారాచూట్ సాయంతో గాలిలోకి ఎగిరిన ఆయన.. క్షణాల్లోనే ప్రమాదానికి గురయ్యాడు. పారాచూట్ ను పట్టిఉంచే బెల్టును సరిగా పెట్టుకోకపోవడంతో మల్లేశ్వరరావు అటు పైకి ఎగరలేక, ఇటు కింది రాలేక సుమారు నాలుగు అంతస్థుల ఎత్తులో గాల్లోనే ఊగిసలాడాడు. ఇది గమనించిన నిర్వాహకులు అతన్ని కాపాడేందుకు పరుగెత్తేలోగా అమాంతం కిందపడిపోయాడు. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు మెడికల్ కాలేజీ మైదానానికి చేరుకుని నిర్వాహకులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే వారు పరారయ్యారు. పారాసెయిలింగ్ ఈవెంట్ కు పోలీసుల అనుమతి లేదని, రక్షణ ఏర్పాట్లు లేకుండా ఎగరడం వల్లే మల్లేశ్వరరావు చనిపోయి ఉంటాడని భావిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు ఈవెంట్ నిర్వహకులపై కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
కోయంబత్తూరు పారాసెయిలర్ మృతి