breaking news
Paravada Pharma City
-
పరవాడ నెహ్రూ ఫార్మాసిటీలో ప్రమాదం.. ముగ్గురికి గాయాలు
సాక్షి,అనకాపల్లి : అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ప్రమాదం జరిగింది. మెట్రో కమ్ కంపెనీలో రియాక్టర్ పేలడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. వారిని గాయపడ్డ క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటల్ని అదుపులోకి తెచ్చారు. -
నాన్న ఎప్పుడొస్తాడు..?
మృతుడు నాగేశ్వరరావు ఇంట్లో విషాదం అనాథలైన భార్య, పిల్లలు నాన్న డ్యూటీకెళ్లాడు.. వచ్చేస్తాడు.. వచ్చినప్పడు రోజూ పప్పలు తెస్తాడు... చిన్నారుల ఎదురుచూపు. అమ్మ హడావిడిగా వెళ్లింది.. అమ్మమ్మ ఏడుస్తోంది.. ఇంటి నిండా జనం..వారికి ఏం జరిగిందో తెలీదు పాపం. నాన్న ఇక రాడని.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని అర్థం చేసుకోలేని వయసు వారిది. అంత చిన్నతనంలోనే ఎంత కష్టమొచ్చిందో అంటూ కుటుంబ సభ్యుల కన్నీరు.. అచ్యుతాపురం: పరవాడ ఫార్మా సిటీలో మంగళవారం జరిగిన ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన అచ్యుతాపురం మండలం ఖాజీపాలేనికి చెందిన పీలా నాగేశ్వరరావు (28) ఇంట్లోని హృదయవిదారక దృశ్యమిది. ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న నాగేశ్వరరావు పరవాడ ఫార్మా సిటీ పరిశ్రమకు పనికి వెళ్లి ప్రమాదవశాత్తు చనిపోవడంతో ఆ కుటుంబం దిక్కులేనిదయింది. నాన్నను కోల్పోయి అనాథలైన ఆ చిన్నారులను చూసి గ్రామస్తులు కంటతడి పెట్టారు. ఖాజీ పాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నాగేశ్వరరావుకు భార్య మంగ, పాప జగదీశ్వరి (5), బాబు సంతోష్‌కుమార్ (3) ఉన్నారు. నాగేశ్వరరావు ఏడవ తరగతి వరకు చదువుకున్నాడు. సొంత భూమి లేకపోవడంతో కౌలు రైతుగా కొన్నాళ్లు వ్యవసాయం చేశాడు. నష్టాలు రావడంతో వ్యవసాయాన్ని విడిచిపెట్టాడు. ఆ తరువాత వ్యవసాయ కూలీగా గ్రామంలో పనులకు వెళ్లేవాడు. ఏడాది పొడవునా గ్రామంలో కూలిపని లభించకపోవడంతో ఫార్మా సిటీలో పనికివెళుతున్నాడు. అతని సంపాదన మీదే కుటుంబం ఆధారపడి ఉంది. ఇంతలో ఘోరం జరిగిపోయింది. తండ్రి కోసం ఎదురుచూపు పిల్లలు ఉదయం నిద్ర లేచేసరికి తండ్రి నాగేశ్వరరావు డ్యూటీకి వెళ్లిపోయాడు. సాయంత్రం నాలుగు గంటలకు తిరిగి వచ్చేస్తాడని ఆ చిన్నారులు ఎదురుచూస్తున్నారు. నాన్న డ్యూటీకి వెళ్లాడు.. వచ్చేస్తాడని ఆ చిన్నారులు చెబుతున్నప్పుడు అక్కడున్నవారు కంటతడిపెట్టారు. ఇక ఆ పిల్లలకు దిక్కెవరని సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.