parents consent
-
ప్రేమ పెళ్లిళ్లకు పెద్దల అనుమతి తప్పనిసరి చేస్తే?
గాంధీనగర్: ప్రేమ వివాహాలపై గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రేమ వివాహాలకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరిగా ఉండేలా సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు వ్యాఖ్యానించారాయన. ప్రేమ వివాహాల విషయంలో తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరిగా ఉంటే ఎలా ఉంటుంది?. ఈ విషయంపై మా ప్రభుత్వం అధ్యయనం జరపాలనుకుంటోంది. అది రాజ్యాంగబద్ధంగా సాధ్యమవుతుందా? అనే కోణంలో పరిశీలించాకే ముందుకెళ్లాలనుకుంటున్నాం అని వ్యాఖ్యానించారాయన. పటీదార్ లాంటి కమ్యూనిటీల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇలాంటి డిమాండ్లు వినిపిస్తున్నాయని ఆదివారం మెహసనాలో జరిగిన ఓ కార్యక్రమంలో చెప్పారాయన. ఆరోగ్య శాఖ మంత్రి రుషికేష్ పటేల్ ఈ విషయంలో సలహా ఇచ్చారు. ఇంట్లోంచి పారిపోయి పెళ్లిళ్లు చేసుకున్న ఘటనలపై అధ్యయనం చేపట్టాలని కోరారు. వాటి ఆధారంగా ఇక నుంచి ప్రేమ వివాహాలకు పెద్దల అంగీకారం ఉండేలా విధివిధానాలు రూపకల్పన చేయాలని సూచించారు అని సీఎం భూపేంద్ర పటేల్ తెలిపారు. రాజ్యాంగం గనుక అందుకు అనుమతిస్తే.. అధ్యయనం కొనసాగించి మంచి ఫలితం సాధిస్తాం అని తెలిపారాయన. ఈ విషయంలో ఓ ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యే సైతం అలాంటి చట్టమేదైనా తెస్తే.. తాను ప్రభుత్వానికి మద్దతు ఇస్తానంటూ తనతో అన్నారాని సీఎం భూపేంద్ర వ్యాఖ్యానించారు. ఆయన పేరు ఇమ్రాన్ ఖేదావాలా. ‘‘ప్రమే వివాహాల విషయంలో తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా ఉన్నా.. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆలోచన చేయాలని కోరుతున్నా. ఒకవేళ అసెంబ్లీలో చట్టం లాంటిది తెస్తే.. దానికి నా మద్దతు ఉంటుంది’’ అని ప్రకటించారాయన. ఇదిలా ఉంటే.. గుజరాత్ ఫ్రీడమ్ ఆఫ్ రెలిజియన్ యాక్ట్ 2021(సవరణ) ప్రకారం వివాహం వంకతో బలవంతంగా మతం మార్చడం లాంటివి చేస్తే కఠిన శిక్షలు ఉంటాయి. దోషిగా తేలితే పదేళ్ల దాకా శిక్ష పడుతుంది. అయితే గుజరాత్ హైకోర్టు ఈ చట్టంపై స్టే విధించగా.. ప్రస్తుతం ఆ పిటిషన్ పెండింగ్‌లో ఉంది. -
ప్రేమికుల రోజున.. వెరైటీ పెళ్లి ప్రమాణం
గాంధీనగర్ : గురువారం ప్రేమికుల రోజు. ప్రేమించిన వారికి మనసులో మాట చెప్పడానికి ఉవ్విళ్లూరే వారు ఓ పక్క.. జంటగా కనిపిస్తే చాలు పెళ్లి చేస్తామని బెదిరించే గుంపులు మరోపక్క. ప్రేమికుల రోజున సర్వసాధరణంగా కనిపించే దృశ్యాలు ఇవి. కానీ వీటన్నింటికి భిన్నమైన ప్రదర్శన ఒకటి సూరత్‌లో జరగనుంది. దాదాపు 10 వేల మంది విద్యార్థుల చేత ‘పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకోము’ అని ప్రమాణం చేయించే కార్యక్రమం ఒకటి జరగనుంది. హస్యమేవ జయతే అనే స్వచ్ఛంద సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. సంస్థ సభ్యుడొకరు దీని గురించి మాట్లాడుతూ.. ‘ప్రేమించడం, పెద్దలను ఎదిరించడం, పారిపోయి పెళ్లి చేసుకోవడం ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయాయి. పెళ్లి చేసుకున్న వారు సంతోషంగా ఉంటే ఏ సమస్య లేదు. కానీ కొందరు పెళ్లైన ఆర్నెల్లలోపే విడాకుల తీసుకుంటున్నారు. లేదంటే ఎదిరించి చేసుకున్నందుకు పెద్దలే వారి మీద దాడి చేయడం వంటి సంఘటనలను నిత్యం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సమస్యలు తలెత్తకూడదనే ఉద్దేశంతోనే విద్యార్థుల చేత ‘తల్లిదండ్రుల అనుమతి లేకుండా ప్రేమ వివాహం చేసుకోమ’ని ప్రతిజ్ఞ చేయిస్తున్నాం. 12 పాఠశాలల నుంచి దాదాపు 10 వేలకు పైగా విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు’ అని తెలిపారు. -
తల్లిదండ్రుల అంగీకారం లేని పెళ్లిళ్లకు నో..ముంబై హైకోర్టు సంచలన తీర్పు
మదురై: తల్లిదండ్రుల సంఘీభావం లేకుండా, వారి సమక్షంలో జరగని పెళ్లిళ్లు చెల్లవని మద్రాస్ హైకోర్టులో దాఖలైన పిటిషన్ ను తోసిపుచ్చింది. వాలంటైన్స్ డేకి వారం రోజుల ముందు ఈ తీర్పు రావడం ఓ విశేషం. వరుని, వధువు తల్లిదండ్రులు లేకుండా పోలీస్ స్టేషన్లలో గానీ, రిజిస్ట్రార్ ఆఫీసుల్లోగానీ పెళ్లి నమోదు చేయకూడదని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు కోర్టు తమిళనాడు ప్రభుత్వానికి సూచించింది. ఈ కేసు ఒక కొత్త చట్టానికి నాంది పలుకుతోందని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎస్ తమిళ్ వన్నన్ లతో కూడిన ధర్మాసనం తెలిపింది. అయితే మేజర్లైన అమ్మాయి, అబ్బాయికి తమ భాగస్వాములను ఎన్నుకునే స్వేచ్ఛ ఉందన్నారు. ముంబై హైకోర్టుదీ అదే తీర్పు... అయితే ఇదే కేసులో ముంబై హైకోర్టూ ఇదే తీర్పును వెలువరించింది. తల్లిదండ్రుల సమక్షంలో జరగని పెళ్లిళ్లు చెల్లవని కోర్టు తెలిపింది. ప్రేమ వివాహాలు చేసుకున్న వారిలో ఆత్మహత్యలు, విడాకుల కేసులు, కిడ్నాప్ లు, కుల గొడవలు ఎక్కువవుతున్నాయని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వివాహాల సమయంలో తల్లిదండ్రులు వారివెంటే ఉన్నట్లైతే ఇలాంటి ఘటనలను సాధ్యమైనంత వరకు నిరోధించవచ్చని కోర్టు అభిప్రాయపడింది.