తల్లిదండ్రుల అంగీకారం లేని పెళ్లిళ్లకు నో..ముంబై హైకోర్టు సంచలన తీర్పు
మదురై: తల్లిదండ్రుల సంఘీభావం లేకుండా, వారి సమక్షంలో జరగని పెళ్లిళ్లు చెల్లవని మద్రాస్ హైకోర్టులో దాఖలైన పిటిషన్ ను తోసిపుచ్చింది. వాలంటైన్స్ డేకి వారం రోజుల ముందు ఈ తీర్పు రావడం ఓ విశేషం. వరుని, వధువు తల్లిదండ్రులు లేకుండా పోలీస్ స్టేషన్లలో గానీ, రిజిస్ట్రార్ ఆఫీసుల్లోగానీ పెళ్లి నమోదు చేయకూడదని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు కోర్టు తమిళనాడు ప్రభుత్వానికి సూచించింది. ఈ కేసు ఒక కొత్త చట్టానికి నాంది పలుకుతోందని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎస్ తమిళ్ వన్నన్ లతో కూడిన ధర్మాసనం తెలిపింది. అయితే మేజర్లైన అమ్మాయి, అబ్బాయికి తమ భాగస్వాములను ఎన్నుకునే స్వేచ్ఛ ఉందన్నారు.
ముంబై హైకోర్టుదీ అదే తీర్పు...
అయితే ఇదే కేసులో ముంబై హైకోర్టూ ఇదే తీర్పును వెలువరించింది. తల్లిదండ్రుల సమక్షంలో జరగని పెళ్లిళ్లు చెల్లవని కోర్టు తెలిపింది. ప్రేమ వివాహాలు చేసుకున్న వారిలో ఆత్మహత్యలు, విడాకుల కేసులు, కిడ్నాప్ లు, కుల గొడవలు ఎక్కువవుతున్నాయని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వివాహాల సమయంలో తల్లిదండ్రులు వారివెంటే ఉన్నట్లైతే ఇలాంటి ఘటనలను సాధ్యమైనంత వరకు నిరోధించవచ్చని కోర్టు అభిప్రాయపడింది.