parents support
-
సంరక్షణ మరిస్తే జీతంలో 15% కోత
సాక్షి, హైదరాబాద్: తల్లిదండ్రుల సంరక్షణకు ప్రభుత్వం చట్టబద్ధత కల్పించింది. ఈ మేరకు సరికొత్తగా రూపొందించిన ‘తెలంగాణ ఉద్యోగుల తల్లిదండ్రుల పోషణ, జవాబుదారీతనం, పర్యవేక్షణ బిల్లు–2026’ను ఆదివారం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ శాసనసభలో ప్రవేశపెట్టారు. బిల్లుకు సభ్యులు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. వృద్ధ తల్లిదండ్రులకు ఆర్థిక భద్రత, గౌరవప్రద జీవనానికి వీలు కల్పించడమే ఈ చట్టం లక్ష్యం. కాగా కుటుంబ వ్యవస్థలో తగ్గుతున్న బాధ్యతలను..ఇకపై తప్పనిసరిగా నెరవేర్చేలా చేసేందుకు ప్రభుత్వం ఈ చట్టానికి రూపకల్పన చేసింది. కేంద్రం 2007లో ఇలాంటి ఓ చట్టం అమల్లోకి తీసుకొచ్చినప్పటికీ..అంతకంటే కఠినమైన నిబంధనలతో రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది. చట్టంలో ఏముంది..ఈ చట్టం కట్టుదిట్టంగా అమలయ్యేలా ప్రభుత్వం ఓ ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇది కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న వారితో పాటు జీతభత్యాలు పొందే ప్రతి ఒక్కరికీ (ప్రజాప్రతినిధులకు కూడా) వర్తిస్తుంది. అతి ముఖ్యమైన అంశం ఏమిటంటే..పిల్లలు తమ తల్లిదండ్రుల సంరక్షణను బాధ్యతగా నిర్వహించకుంటే వారి వేతనంలో 15% లేదా రూ.10 వేలు (ఏది తక్కువైతే అది) కోత విధించి తల్లిదండ్రుల ఖాతాలో జమ చేస్తారు. ఇందుకోసం పిల్లలు పనిచేస్తున్న ప్రభుత్వ శాఖలు లేదా యాజమాన్యాలకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలను జారీ చేస్తుంది. నిరాదరణకు గురైన తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్‌కు నేరుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ దరఖాస్తుపై జిల్లా కలెక్టర్ లేదా కలెక్టర్ నియమించిన అధికారి ఇరువర్గాలను పిలిచి విచారణ జరుపుతారు. తర్వాత ఉద్యోగి జీతం నుంచి నిర్దేశించిన మొత్తాన్ని మినహాయిస్తూ ఆదేశాలిస్తారు. దరఖాస్తును అది అందిన 60 రోజుల్లోగా తప్పకుండా పరిష్కరించాలిఒకవేళ అధికారి ఆదేశాలపై దరఖాస్తు దారులు సంతృప్తి చెందకున్నా, గడువులోగా పరిష్కారం చేయకున్నా రాష్ట్ర స్థాయిలో ఫిర్యాదు చేయవచ్చు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వయోవృద్ధుల కమిషన్ ఏర్పాటు చేస్తుంది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి లేదా ప్రభుత్వం ఎంపిక చేసిన వ్యక్తి ప్రధాన కమిషనర్‌గా వ్యవహరిస్తారు. జిల్లా స్థాయి నుంచి దరఖాస్తుదారుడు నేరుగా వయోవృద్ధుల కమిషన్‌లో అప్పీలు చేసుకున్న తర్వాత నెలరోజుల్లోగాతప్పకుండా పరిష్కరించాలి. -
విద్వేషంపై ఉక్కుపాదం!
సాక్షి, హైదరాబాద్: సమాజంలో మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. తెలంగాణ విద్వేష పూరిత ప్రసంగాలు, విద్వేష పూరిత నేరాల నిరోధక బిల్లు (తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ ప్రివెన్షన్ బిల్లు, 2026)కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సామాజిక మాధ్యమాల్లో మత సామరస్యానికి భంగం కలిగించేలా చేసే పోస్టులు, అల్లర్లు.. ఘర్షణలను ప్రేరేపించేలా చేసే ప్రసంగాలను కట్టడి చేసేందుకు ఈ బిల్లును రూపొందించారు.కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కారు సైతం ఇదే తరహా బిల్లును శాసనసభలో ఆమోదించి గవర్నర్ ఆమోదం కోసం పంపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ బిల్లును బీజేపీ వ్యతిరేకించింది. దీంతో గవర్నర్ దాన్ని రాష్ట్రపతి పరిశీలనకు పంపించారు. హేట్ స్పీచ్ బిల్లుకు ఆమోదం తెలపడంతో పాటు.. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం సాయంత్రం శాసనసభ కమిటీ హాల్లో సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.వర్సిటీల్లో కుల వివక్ష నియంత్రణకు..విద్యాలయాల్లో కుల వివక్షను నియంత్రించేందుకు ఉద్దేశించిన రోహిత్ వేముల చట్టం విధివిధానాల రూపకల్పనకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మంత్రులు దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా వ్యవహరించనున్నారు. గిగ్ వర్కర్స్కు భద్రత గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికుల సంక్షేమం, భద్రత కోసం రూపొందించిన ‘తెలంగాణ ప్లాట్‌ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ (రిజిస్ట్రేషన్, సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్) యాక్ట్ – 2026’ బిల్లును కూడా మంత్రివర్గం ఆమోదించింది. ఈ బిల్లు అమల్లోకి వస్తే రాష్ట్రంలోని దాదాపు 4.2 లక్షల మంది గిగ్ వర్కర్స్, ప్లాట్‌ఫామ్ బేస్డ్ వర్కర్లకు ప్రయోజనం కలగనుంది. కొత్త బిల్లు ప్రకారం వర్కర్స్ రిజిస్ట్రేషన్‌తో పాటు సంక్షేమ బోర్డు, నిధి ఏర్పాటు చేస్తారు. గిగ్ వర్కర్లకు చట్టబద్ధమైన గుర్తింపు, సామాజిక భద్రత లభించడంతో పాటు బోర్డు ఏర్పాటు ద్వారా వారి హక్కులకు రక్షణ లభిస్తుంది. గతంలో మంత్రివర్గం ఆమోదించిన బిల్లును ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన సోషల్ సెక్యూరిటీ కోడ్‌కు అనుగుణంగా స్వల్ప మార్పులతో కేబినెట్ ఆమోదించింది.మెట్రో స్వాధీనం చర్యలు వేగవంతంహైదరాబాద్ నగరంలో ప్రస్తుతమున్న 69 కిలోమీటర్ల మెట్రో రైలు వ్యవస్థను ఎల్ అండ్ టీ కంపెనీ నుంచి స్వాధీనం చేసుకునే చర్యలు వేగవంతం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రభుత్వం తరఫున నిధుల చెల్లింపులు, లావాదేవీలు నిర్వర్తించే బాధ్యతను హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్‌కు అప్పగించింది. హెచ్ఎంఆర్ఎల్ను నోడల్ ఏజెన్సీగా నియమించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టంతెలంగాణ అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. న్యాయవాదులపై జరుగుతున్న దాడుల ఘటనలను కట్టడి చేసేందుకు, వారికి రక్షణ కల్పించేందుకు ఈ బిల్లు రూపొందించారు. గతంలో అడ్వకేట్ వామనరావు దంపతుల హత్య నేపథ్యంలో న్యాయవాదులకు రక్షణ, తగిన భద్రత కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది.కులగణనపై కమిటీ నివేదికకు ఆమోదంరాష్ట్రంలో చేపట్టిన కులగణనను అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన స్వతంత్ర నిపుణుల కమిటీ నివేదికను మంత్రివర్గం ఆమోదించింది. ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ వర్కింగ్ గ్రూప్ చైర్మన్ జస్టిస్ సుదర్శన్‌రెడ్డి అధ్వర్యంలోని నిపుణుల కమిటీ ఈ నివేదిక తయారు చేసింది. సామాజిక న్యాయం, అన్ని వర్గాల సాధికారత లక్ష్యంగా దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. 2024 నవంబర్ 6వ తేదీ నుంచి డిసెంబర్ 25వ తేదీ వరకు సామాజిక, ఆర్థిక, కుల సర్వేను నిర్వహించింది. కాగా నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించే బాధ్యతను కేబినెట్ సబ్ కమిటీకి ప్రభుత్వం అప్పగించింది.తల్లిదండ్రులకు భరోసా..వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ఆదరించని ప్రజా ప్రతి నిధులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల వేతనాల నుంచి 15 శాతం లేదా రూ.10 వేలు.. ఏది తక్కువైతే ఆ మొత్తం వేత నాల నుంచి పరిహరించి తల్లిదండ్రులకు అందజేసే తల్లిదండ్రులకు మద్దతు బిల్లును మంత్రివర్గం ఆమోదించింది. -
ఇంగ్లీష్ మీడియానికి పేరెంట్స్ సపోర్ట్
-
నాయకులకేనా ఇంగ్లిష్ చదువులు..
వీధి బడి ఏళ్లుగా తల వంచుకునే బతికేస్తోంది. ప్రైవేటు స్కూళ్ల వేగం అందుకోలేక కన్నీరు పెడుతూనే ఉంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల పరిస్థితి కూడా అంతే. ఇంటర్వ్యూలలో, గ్రూప్ డిస్కషన్లలో, పోటీ పరీక్షల సమయంలో ‘కార్పొరేట్’ పిల్లలతో పోటీ పడలేక చతికిలపడుతూనే ఉన్నారు. ఎంత మేధస్సు ఉన్నా ఆంగ్లంలో సంభాషించలేక అవమానాలు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇన్నాళ్లకు ప్రాథమిక స్థాయిలో ఇంగ్లిష్ బోధించాలని సర్కారు సంకలి్పంచింది. అయితే దీనిపై ప్రతిపక్షాల నుంచి ఊహించని ఎదురుదాడి కనిపిస్తోంది. వాస్తవానికి విమర్శించే వారి పిల్లలంతా ఇంగ్లిష్ మీడియంలోనే చదువుతుండడం గమనార్హం. ఇంటిలో పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చదివిస్తూ సామాన్యుల పిల్లల విషయంలో మాత్రం కొత్త భాష్యాలు పలుకుతున్నారు. వీరి ద్వంద్వ నీతి రాజకీయాలపై జనంలో అసహనం వ్యక్తమవుతోంది. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ఏ తల్లిదండ్రులైనా పిల్లలు ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటారు. వారు జీవి తంలో స్థిరపడాలని కలలు కంటారు. దాని కోసం కష్టనష్టాలను భరించి పిల్లల్ని చదివిస్తుంటారు. స్థోమత ఉన్నోళ్లు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో చదివిస్తుండగా, పేదవారు సర్కారు బడుల్లో చదువుతున్నారు. కాకపోతే మాధ్యమం సమస్యతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు పోటీ ప్రపంచంలో నెట్టుకురాలేకపోతున్నారు. కంప్యూటర్ యు గంలో ఇంగ్లిష్ రాకపోతే ఉపాధి, ఉన్నతి రెండూ లేవన్నది జగమెరిగిన సత్యం. ఎక్కడకు వెళ్లి రాణించాలన్నా ఇంగ్లిష్ లో ప్రావీణ్యం తప్పనిసరిగా మారుతోంది. ఇంతటి ప్రాధాన్యత గల విద్యను నాణ్యతతో పేదలందరికీ ఉచితంగా అందించేందుకు సర్కార్ సంకల్పిస్తుంటే ప్రతిపక్ష నాయకులు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. అభ్యుదయవాదులు, విద్యార్థుల తల్లిదండ్రులు సర్కారు నిర్ణయాన్ని స్వాగతిస్తుంటే అపోజిషన్ లీడర్లు మాత్రం అక్కసు వెళ్లగక్కుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఓ వైపు వ్యతిరేకిస్తూనే తమ పిల్లలను మాత్రం ఆంగ్ల మాధ్యమంలో చదివిస్తున్నారు. నాయకులు ప్రదర్శిస్తున్న ద్వంద్వ నీతి జనాలకు తెలిసి ఛీ కొడుతున్నారు. నిగ్గుదీయండి.. పోటీ ప్రపంచంలో ఆంగ్ల మాధ్యమం ఆవశ్యకత ఎక్కువైంది. ఉన్నత అవకాశాలను పొందాలంటే ఆంగ్లం తప్పనిసరి. దాన్ని గుర్తించిన తల్లిదండ్రులు ఆంగ్ల మాధ్యమంలో తమ పిల్లల్ని చదివించుకోవాలని ఆరాటపడుతున్నారు. కానీ స్థోమత లేక ఆలోచన దగ్గరే ఆగిపోతున్నారు. విద్యార్థులు పోటీ పరీక్షల వరకు కాస్తో కూస్తో నెట్టుకొస్తున్నా ఇంటర్వ్యూలకొచ్చే సరికి కమ్యూనికేషన్ స్కిల్స్ లోపంతో విఫలమవుతున్నారు. దగ్గరగా వచ్చి ఉద్యోగాలను పొందలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో పేదవాళ్ల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సర్కారు ప్రాథమిక స్థాయి నుంచి ఆంగ్లంలో బోధించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం వెలువడినప్పటి నుంచి టీడీపీ, జనసేన నాయకులు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. కానీ అచ్చె న్న వంటి వారంతా పిల్లలను మాత్రం ఎంచక్కా కార్పొరేట్ స్కూళ్లలో, ఇంగ్లిష్ మీడియంలో చదివించుకుంటున్నారు. దీనిపై ప్రజలే నాయకులను నిగ్గదీసి అడగాలని అభ్యుదయవాదులు చెబుతున్నారు. టీడీపీ నేతల పిల్లలు చదువుతున్నదిక్కడే.. ►ఇచ్ఛాపురం ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్ బాల్యం నుంచి బీడీఎస్ పూర్తి అయ్యేవరకు ఇంగ్లిష్ మీడియం లోనే చదువుకున్నారు. ఆయన ఇద్దరు చెల్లెళ్లు కూడా ఆయనతో పాటుగానే శ్రీకాకుళం జిల్లా పాతపట్నం సెయింట్ ఆన్స్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో చదువులు సాగించారు. ►మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ పిల్లలు నీలి మ, రేష్మ శ్రీకాకుళంలోని సెయింట్ జోసఫ్ స్కూల్లో ఇంగ్లిష్ మీడియంలో చదివారు. ►టీడీపీ నేత కోండ్రు మురళీమోహన్‌కు ఇద్దరు కుమార్తెలు. ప్రస్తుతం విశాఖపట్నంలోని ఓ కార్పొరేట్ స్కూల్లో ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్నారు. అక్కడే పిల్లల చదువులు కోసం ఉంటూ రా జాం తాత్కాలికంగా వస్తుంటారు. ఇటీవల ఆయన ఓ కార్పొరేట్ ఇంగ్లీషు మీడియం స్కూల్‌ను రణస్థలం హైవే పక్కన పెట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు కూడా. ►టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు కావలి ప్రతిభాభారతి కుమారుడు నానిబాబు, కుమార్తె గ్రీష్మాప్రసాద్ విశాఖపట్నం, హైదరాబాద్‌లలో ఇంగ్లీషు మీడియంలో చదివారు. నానిబాబు పిల్లలు కూడా ప్రస్తుతం ఇంగ్లీషు మీడియంలోనే చదువుతున్నారు. ►మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ కుమార్తె హారిక, కుమారుడు కె.సాగర్, ఇంగ్లిష్ మీడియంలోనే చదివించారు. వారిద్దరూ గుంటూరు, హైదరాబాద్, విశాఖపట్నం, ఢిల్లీలో చదివారు. ►టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు చౌదరి బాబ్జీ కుమారుడు అవినాష్ శ్రీకాకుళంలోని న్యూ సెంట్రల్ స్కూల్లో ఇంగ్లిష్ మీడియంలో చదివారు. కుమార్తె చైతన్య కూడా అదే స్కూల్లో చదివారు. ►మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ ఇద్దరు పిల్లలు శివగంగాధర్, విశ్వనాథం ఇంగ్లిష్ మీడియంలోనే చదివారు. ►మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఇద్దరు పిల్లలు ఆంగ్ల మాధ్యమంలోనే చదువు సాగించారు. ►మాజీ ఎమ్మెల్యే గౌతు శ్యామ్ సుందర్ శివాజీ ఇద్దరు కుమార్తెలు ఇంగ్లిష్ మీడియంలోనే చదివారు. ప్రస్తుత టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష కూడా ఇంగ్లిష్ మీడియంలోనే విద్యాభ్యాసం చేశారు. వారి ఇద్దరు పిల్లలు విశాఖలో ఇంగ్లిష్ మీడియంలోనే చదువుతున్నారు. జనసేన నేతల పిల్లలు.. ►మొన్నటి ఎన్నికల్లో జనసేన తరఫున ఎంపీగా పోటీ చేసిన మెట్ట రామారావు తన ఇద్దరు పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలోనే చదివించారు. కుమారుడు కళ్యాణ్‌కృష్ణను న్యూఢిల్లీలో ఇంజినీరింగ్ చదివించగా, కుమార్తె వైష్ణవిని ఢిల్లీలోనే ఇంటర్ చదివించారు. ►పలాసలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన కోత పూర్ణచంద్రరావు కూడా తన కుమార్తెను కాశీబుగ్గ లిటిల్ ఏంజిల్ స్కూల్లో ఇంగ్లిష్ మీడియం చదివించారు. ►శ్రీకాకుళం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన కోరాడ సర్వేశ్వరరావు కూడా తన కుమారుడ్ని హైదరాబాద్‌లో ఇంగ్లిష్ మీడియంలో చదివిస్తున్నారు. ►ఆమదాలవలసలో పోటీ చేసిన పేడాడ రామమోహన్ తన కుమారుడు చైతన్యస్వా మిని శ్రీకాకుళంలోని ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఇంగ్లిష్ మీడియంలో చదివిస్తున్నారు. ►ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి జనసేన తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసిన బాదాన వెంకట జనార్దనరావు తన ఇద్దరు కుమార్తెలు చాందిని, జాహ్నవిలను శ్రీకాకుళంలోని శ్రీచైతన్యలో ఇంగ్లిష్ మీడియంలో చదివారు. ►రాజాం నియోజకవర్గం నుంచి జనసేన తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసిన మచ్చా శ్రీనివాసరావు తన ఇద్దరు పిల్లల్ని విశాఖపట్నంలో ఇంగ్లిష్ మీడియంలోనే చదివిస్తున్నారు. -
విలువల రాపిడితోనే ఈ వజ్రకాంతి
సమకాలీనం: అపరిమిత జనాభా, అరకొర వనరులున్న దేశం అయినందున బయటి అవకాశాల్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరం దశాబ్దాల కిందటే ఏర్పడింది. ఇది గ్రహించిన ఈ దేశ యువత, శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం వాకిళ్లు తెరచిన విశ్వవీధుల్లోకి పరుగులు తీసింది. బాగా చదువుకోవడం, నైపుణ్యంతో రాణించడం ద్వారా ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్లి విజయవంతం కావచ్చని ధ్రువపడ్డ నమూనాని అందిపుచ్చుకుంది. వారి ఉత్సాహానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం తోడయింది. ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీల పగ్గాలు ఒకటొకటిగా భారతీయ మేధోనా యకుల చేతుల్లోకి రావడం ఇప్పుడు అంతటా ఓ ముచ్చటయింది. ముఖ్యంగా మొన్న సత్య నాదెళ్ల (మైక్రోసాఫ్ట్), నిన్న సుందర్ పిచయ్ (గూగుల్) సీఈవోలయ్యాక ఈ చర్చ పెరిగింది. డజన్ వరకు ప్రథమశ్రేణి వివిధ గ్లోబల్ సంస్థలకు భారతీయులు ఈ రోజున సీఈఓలుగా ఉన్నారు. ఇక కింద, వివిధ స్థాయిల్లోకి ఎదిగి-ఒదిగిన వారిది పెద్ద లెక్కే ఉంది. ఇదేలా సాధ్యమైంది...? అన్నపుడు, సాక్షి జర్నలిజం విద్యార్థులు తమకు తోచిన కారణాలు చెబుతూ వచ్చారు. కొందరు ఇది కష్టపడే తత్వం వల్ల అని, నిబద్ధత కారణంగా అని, అంకితభావమని, ఎదగాలనే తపన ఉండడమని, భిన్నంగా-వినూత్నంగా ఆలోచించడం వల్లేనని, మధ్య తర గతి నేపథ్యం కావడంతో అని... ఇలా డజన్‌కు పైగా వేర్వేరు కారణాలు చెప్పారు. ఎక్కడో ఓ మూల నుంచి సన్నని స్వరం 'తల్లిదండ్రుల వల్ల' అన్న మాట వినిపించింది. నిజమే! భారత సమాజంలో తమ పిల్లల ఎదు గుదలకు తల్లిదండ్రులు చేసే కృషి, జరిపే త్యాగాలు అసమానమైనవి. అందరూ తమ పిల్లల్ని వివిధ కంపెనీలకు సీఈవోల్ని చేయలేక పోవచ్చు. కానీ, తామున్న పరిస్థితి కన్నా మెరుగైన స్థితిలో పిల్లలుండాలనే తపన లేని తల్లిదండ్రులు మన దేశంలో ఉండరేమో! కేవలం ఆలోచనా పరమైన తపన మాత్రమే కాక అందుకోసం అత్యధికులు చిత్తశుద్ధితో కృషి చేస్తారు. ఆరుగాలం శ్రమిస్తారు. ఈ క్రమంలో... తమకున్నా, లేకున్నా పిల్లల్ని వృద్ధిలోకి తేవాలనే బలమైన భావన వారిని ముందుకు నడుపుతుంది. చిన్న చిన్న సౌఖ్యాలు, ముచ్చట్లు, అవసరాలు.... అన్నీ వదులుకొని కూడా పిల్లల్ని పెంచే తల్లిదండ్రులకీ దేశంలో కొదవలేదు. 'అంతా పిల్లల కోసం కరిగేస్తే... మరి, రేపేంటి?' అన్న చిన్న సందేహం, ఆలోచనక్కూడా తావివ్వకుండా, సర్వస్వం వారి చదువుల కోసం, ఉన్నతి కోసం హారతి కర్పూరంలా కరిగించే తల్లిదండ్రులెందరో! ఇది అంతో ఇంతో ఉన్న వాళ్ల పరిస్థితి. ఇక ఏమీ లేని నిరుపేదలు, దిన కూలీలు, పెద్దగా రాబడిలేని అల్పాదాయ వర్గాల వారు కూడా తమ స్తోమతకు మించి డబ్బును పిల్లల కోసం వెచ్చిస్తారు. ఖర్చు అనివార్యమైనపుడు కూడా వెనుకాడరు. కష్ట మైతే తమ అవసరాల విషయంలో రాజీపడతారు, లేకపోయినా సరేనని సరిపెట్టుకుంటారు. ప్రపంచంలో మరే దేశంలోనూ ఇంతటి తల్లిదండ్రుల త్యాగాలు ఉండవేమో అనిపిస్తుంది. ఒక వైపు విలువల సమాజం, మరో వైపు తల్లిదండ్రుల ప్రోత్సాహం భారత యువతరాన్ని ఎదుగుదల వైపు పరుగులు తీయిస్తోంది. ఇది ఇవాళ్టిది కాదు... పిల్లలే తమ సర్వస్వం అనే తల్లిదండ్రుల భావన ఇవాళ్టిది కాదు. భార తీయ జీవన విధానంలోనే ఉంది. మహాభారతంలో మంచి పేరున్న పాండురాజు, కుంతి మాత్రమే కాదు, స్వార్థపరులని కాసింత చెడ్డపేరున్న ధృతరాష్ట్ర-గాంధారీలు కూడా తమ పిల్లల ఉన్నతి కోసం తపించిన వారే! వీర శివాజీని మరాఠా యోధునిగా తీర్చిదిద్దిన జిజియాబాయి, గాంధీజీని జాతిపితగా మలచిన పుత్లీబాయి... ఇలా ఎందరెందరో! పితృవాక్య పాలన అని శ్రీరాముడు అడవులకెళితే తట్టుకోలేక చనిపోయిన తండ్రి దశరథుని పుత్రప్రేమ కంటే, జనవాక్యపాలన అని తనను రాముడే అడవు లకంపినా.... కుశ, లవుల్ని కని-పెంచి, విద్యాబుద్ధులతో తీర్చిదిద్దిన సీత పుత్ర వాత్సల్యమే గొప్పది. అది మన వారసత్వ సంపదయింది. పిల్లల చదువుల కోసం, ఇవాళ్టికీ వేలాది మంది తల్లులు స్వచ్ఛంద సాంసారిక వియోగాన్ని భరిస్తున్న సీతలు. ఉపాధి, జరుగుబాటు కోసం భర్తలెక్కడో ఊళ్లల్లో వ్యవసాయమో, పట్టణాల్లో వ్యాపారమో చేస్తుంటే... నగరాలు, మహా నగరాల్లో అద్దె ఇళ్లల్లో ఉంటూ పిల్లల్ని చదివిస్తుంటారు తల్లులు. అహర్నిశలు వారి బాగోగుల ఆలోచనలే! అక్కడ తండ్రులదీ అదే బలవం తపు ఒంటరి బతుకు. కష్టపడుతూ పిల్లల చదువుల కోసం డబ్బులు పం పిస్తూ ఉంటారు. అది హైదరాబాద్‌లో విద్యానగర్, అమీర్‌పేట, కూకట్ పల్లి కావచ్చు; గుంటూరు, విజయవాడలలో వేరేవేవో బస్తీలు కావచ్చు, ఇంకే ఇతర జిల్లా కేంద్రాలో, ముఖ్య పట్టణాలో కూడా కావచ్చు, విషయ మొకటే! అంటే, పిల్లల చదువుకోసమే... సొంత ఇంటిని-ఊరునీ వీడి, అష్టకష్టాలు పడీ, ఆస్తులు అమ్ముకునీ, తీర్చలేని ప్రయివేటు అప్పులు చేసీ, బ్యాంకుల్లో విద్యారుణాలు పొందీ పీకల్లోతుగా రుణగ్రస్తులవుతుం టారు. వాటిని తీర్చేక్రమంలో... సరళ జీవితాల్ని సంక్లిష్టం చేసుకునే కుటుంబాలెన్నో! భారత యువతకు సలామ్! అపరిమిత జనాభా, అరకొర వనరులున్న దేశం అయినందున బయటి అవకాశాల్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరం దశాబ్దాల కిందటే ఏర్ప డింది. ఇది గ్రహించిన ఈ దేశ యువత, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వాకిళ్లు తెరచిన విశ్వవీధుల్లోకి పరుగులు తీసింది. బాగా చదువుకోవడం, నైపు ణ్యంతో రాణించడం ద్వారా ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్లి విజయ వంతం కావచ్చని ధ్రువపడ్డ నమూనాని అందిపుచ్చుకుంది. వారి ఉత్సా హానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం తోడయింది. ఇంకేం! ప్రపంచం, ముఖ్యంగా ఐటీ ప్రపంచం మనవాళ్ల పాదాక్రాంతమైంది. అజీం ప్రేమ్‌జీ, నారాయణమూర్తి, శివనాడార్, రామలింగరాజు, నందన్ నీలేకనీ వంటి తొలితరం నేతలు వేసిన బీజాలు మంచి భూమికనేర్పాటు చేశాయి. ఈ దేశానికి చెందిన ఐఐటీలు, ఎన్ఐటీలు, ఇతర ముఖ్య విద్యా సంస్థల కృషి తల్లిదండ్రుల త్యాగాలకు తోడయి ఆడా మగ తేడా లేకుండా యువత సాఫ్ట్వేర్ గుర్రమెక్కింది. ఐటీ ప్రపంచ పథాన ఇప్పుడు దౌడు జోరందు కుంది. బ్రెయిన్ డ్రెయిన్ అని మొదట్లో కొందరు ఆందోళన చెందినా, అది సరైన ఆలోచన కాదని తేలిపోయింది. పోటీ యుగంలో... వీలయినన్ని అవకాశాల్ని అందిపుచ్చుకోవడం, సమస్త ప్రపంచాన్ని దున్నేయడం. వీలైతే వెనక్కివచ్చి స్వదేశాన్నీ శక్తిమంతం చేయడంలో చేదోడు వాదోడు గానిలవడం, ఇదే ఇప్పుడు జరగాల్సింది. తొలితరం విదేశాలకి వెళ్లి విజ యవంతమైన కొంతమంది ఈ పని చేస్తున్నారు. ఇక్కడి పరిపాలన, రాజకీయ వాతావరణంలో కూడా మార్పు రావాలి. ప్రపంచానికి నేర్పిన విలు వల్ని మన వాళ్లే మరచిపోతున్నారు. మన పార్లమెంటు ఉభయ సభల్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, 'విలువలతో కూడిన జీవన శైలి... భారతదేశం ప్రపంచానికిచ్చిన గొప్ప కానుక'ని కితా బిచ్చారు. ఆ విలువల జీవనశైలి, తల్లిదండ్రుల త్యాగాలు, సుదీర్ఘంగా సాగే కృతజ్ఞతా భావమే మన యువతరాన్ని విశ్వవేదికపై నాయకత్వ స్థానాల్లోకి తీసుకువస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్య సమా చార కమిషనర్‌గా పనిచేసి రిటైరయిన సి.డి.అర్హ డెబ్బై ఏళ్ల వయసులో ఇప్పుడు 'ఇండస్'అనే ఓ పెద్ద విద్యాపీఠం ఛైర్మన్‌గా సేవలందిస్తున్నారు. ఆయన కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నత చదువులతో విశ్వ నిపుణులుగా ఎదిగి అత్యున్నత హోదాల్లో ఉన్నారు. ఆరున్నర దశాబ్దాల కింద, అర్హ తండ్రి రెవెన్యూ ఉద్యోగిగా తనకొచ్చే నెల జీతం 75 రూపా యల్లో 55 రూపాయల నెలసరి ఫీజు కట్టి సెయింట్ జేవియర్ అనే గొప్ప పాఠశాలలో కొడుకును చదివించారు. మిగతా కుటుంబ పోషణకు నెలకు 20 రూపాయలే వెచ్చించారు. ఇలాంటి ఏ తల్లిదండ్రుల త్యాగాలూ వృథా పోకూడదు. తీసుకున్న చోట... తిరిగి ఇచ్చేయాలి! పిల్లలెంత ఎత్తు ఎదిగినా కన్నవారిని నిర్లక్ష్యం చేయకూడదు. కొంత డబ్బు వెచ్చించి ‘వృద్ధాశ్రమాల్లో వేశాం కదా! ఇంకేంటి’ అనేపాటి కృతజ్ఞత చాలదు. వారి త్యాగాల క్రమంలో మరుగున పడ్డ నెరవేరని కలల సాకారా నికి సహకరించాలి. మాతృదేశాన్నీ విస్మరించొద్దు. ఏపీజే అబ్దుల్‌కలాం తన స్వీయకథ 'వింగ్స్ ఆఫ్ ఫైర్'లో తన తల్లి సంస్కారాన్ని స్మరిస్తూ రాసుకున్న కథలు ఒక్క కలాం కథలు మాత్రమే కావు. కుటుంబం పేదరి కం అనుభవిస్తుంటుంది. తల్లి రాత్రివేళ రొట్టెలు కాల్చి చదువుకునే పిల్ల లకు పెడుతుంది. తండ్రికి మాడిపోయిన రొట్టె దొరుకుతుంది. చిన్న పిల్లాడైన కలాం ఈ సన్నివేశాన్నంతా చూస్తుంటాడు. కుటుంబ సంబంధాల మధ్య, సభ్యుల మధ్య కోపతాపాలూ, సహజ భావావేశాలను ప్రేమ ఎలా అధిగమిస్తుందో జాగ్రత్తగా గమనిస్తుంటాడు. మాడిపోయిన రొట్టెను కంచంలో పెట్టుకున్న నాన్నను అడుగుతాడు. 'మాకందరికీ మం చి రొట్టెలు వేసి, చివర్లో నీకు మాడిపోయిన రొట్టెను పెట్టినందుకు నీకు అమ్మపై కోపంగా లేదా?'అని. అందుకా తండ్రి ప్రేమతో 'పొద్దుట్నుం చీ ఆమె పని చేస్తూనే ఉంది. పైగా మాడిపోయిందేదో నాకు పెట్టింది. కానీ ఆమె ఇంకా తినలేదు చూశావా?'అంటాడు. దాంతో మళ్లీ తల్లి దగ్గరకు వెళ్లి 'అమ్మా నువ్వు ఇంకా తినలేదు. మాకు మాత్రమే పెట్టావు. నువ్వూ తినమ్మా'అంటాడు కలాం. దానికా తల్లి చిర్నవ్వుతో. 'నాన్నా... నువ్వు 'చదువుకునే' పిల్లాడివి. నీకు చదువుకునేందుకు శక్తి కావాలి. నీకు చదువు కునేందుకు మేధస్సు పెరగాలి. అందుకే నీకీ రొట్టెలు. తిని బాగా చదు వుకో' అని స్పందిస్తుంది. అంతే... ఈ కష్టాలన్నీ ఎరిగిన కలాం బాగా చదువుకున్నాడు. ఆ తర్వాత తన తల్లి గురించి మాట్లాడుతూ భావో ద్వేగంతో రాసుకున్న మాటలు అందరినీ కదిలిస్తాయి. 'ఆరోజున నాకు నువ్వు పెట్టిన రొట్టెలతో పెరిగిన మెదడు మేధస్సూ, తనువు తేజస్సూ ఇవ్వాళ్ల నాతోనే ఉన్నాయి. కానీ నాకోసం నువ్వు చేసిన త్యాగం నాకు గుర్తుంది. ఇవ్వాళ నీకు పాదాభివందనం చేద్దామంటే నువ్వు లేవు. అలాగే నేను కూడా లేని స్థితి ఒకటి వస్తుంది. నువ్వు ఈ లోకాన్ని వీడిపోయిన రోజున ఏ దివ్య శరీరాన్ని ధరించావో, నేనూ ఈ లోకాన్ని వీడిన రోజున అదే దివ్య శరీరాన్ని ధరిస్తా. నువ్వు చేరిన లోకాలకే నేనూ చేరుతా. నా రొట్టెల కృతజ్ఞత తీర్చేందుకు నువ్వే రూపంలో ఉన్నావో, అదే రూపంలో నేనూ నీ దగ్గరకు చేరి నీ పాదాలను... నువ్వు పెట్టిన రొట్టె తిన్న ఈ చేతులతో స్పర్శిస్తా' అని రాసుకున్నాడు. కలాం ఒక గొప్ప వ్యక్తిగా ఎదిగినందున్నే ఈ చరిత్రను మనం తెలుసుకోగలిగాం. కానీ ఇలాంటి దివ్యానుభవాలు చవిచూసే కుటుంబాలు మన సమాజంలో, మనకు తెలియకుండా.... ప్రతి ఐదింటిలో కనీసం మూడైనా ఉంటాయేమో! తీసుకున్న చోటే ఎంతోకొంత తిరిగి ఇచ్చేయాలి. ఇచ్చేయాలి. ఇచ్చేయాలి. ఆర్. దిలీప్ రెడ్డి సాక్షి, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఈమెయిల్: dileepreddy@sakshi.com


