వీధి బడి ఏళ్లుగా తల వంచుకునే బతికేస్తోంది. ప్రైవేటు స్కూళ్ల వేగం అందుకోలేక కన్నీరు పెడుతూనే ఉంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల పరిస్థితి కూడా అంతే. ఇంటర్వ్యూలలో, గ్రూప్ డిస్కషన్లలో, పోటీ పరీక్షల సమయంలో ‘కార్పొరేట్’ పిల్లలతో పోటీ పడలేక చతికిలపడుతూనే ఉన్నారు. ఎంత మేధస్సు ఉన్నా ఆంగ్లంలో సంభాషించలేక అవమానాలు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇన్నాళ్లకు ప్రాథమిక స్థాయిలో ఇంగ్లిష్ బోధించాలని సర్కారు సంకలి్పంచింది. అయితే దీనిపై ప్రతిపక్షాల నుంచి ఊహించని ఎదురుదాడి కనిపిస్తోంది. వాస్తవానికి విమర్శించే వారి పిల్లలంతా ఇంగ్లిష్ మీడియంలోనే చదువుతుండడం గమనార్హం. ఇంటిలో పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చదివిస్తూ సామాన్యుల పిల్లల విషయంలో మాత్రం కొత్త భాష్యాలు పలుకుతున్నారు. వీరి ద్వంద్వ నీతి రాజకీయాలపై జనంలో అసహనం వ్యక్తమవుతోంది.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ఏ తల్లిదండ్రులైనా పిల్లలు ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటారు. వారు జీవి తంలో స్థిరపడాలని కలలు కంటారు. దాని కోసం కష్టనష్టాలను భరించి పిల్లల్ని చదివిస్తుంటారు. స్థోమత ఉన్నోళ్లు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో చదివిస్తుండగా, పేదవారు సర్కారు బడుల్లో చదువుతున్నారు. కాకపోతే మాధ్యమం సమస్యతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు పోటీ ప్రపంచంలో నెట్టుకురాలేకపోతున్నారు. కంప్యూటర్ యు గంలో ఇంగ్లిష్ రాకపోతే ఉపాధి, ఉన్నతి రెండూ లేవన్నది జగమెరిగిన సత్యం. ఎక్కడకు వెళ్లి రాణించాలన్నా ఇంగ్లిష్ లో ప్రావీణ్యం తప్పనిసరిగా మారుతోంది. ఇంతటి ప్రాధాన్యత గల విద్యను నాణ్యతతో పేదలందరికీ ఉచితంగా అందించేందుకు సర్కార్ సంకల్పిస్తుంటే ప్రతిపక్ష నాయకులు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. అభ్యుదయవాదులు, విద్యార్థుల తల్లిదండ్రులు సర్కారు నిర్ణయాన్ని స్వాగతిస్తుంటే అపోజిషన్ లీడర్లు మాత్రం అక్కసు వెళ్లగక్కుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఓ వైపు వ్యతిరేకిస్తూనే తమ పిల్లలను మాత్రం ఆంగ్ల మాధ్యమంలో చదివిస్తున్నారు. నాయకులు ప్రదర్శిస్తున్న ద్వంద్వ నీతి జనాలకు తెలిసి ఛీ కొడుతున్నారు.
నిగ్గుదీయండి..
పోటీ ప్రపంచంలో ఆంగ్ల మాధ్యమం ఆవశ్యకత ఎక్కువైంది. ఉన్నత అవకాశాలను పొందాలంటే ఆంగ్లం తప్పనిసరి. దాన్ని గుర్తించిన తల్లిదండ్రులు ఆంగ్ల మాధ్యమంలో తమ పిల్లల్ని చదివించుకోవాలని ఆరాటపడుతున్నారు. కానీ స్థోమత లేక ఆలోచన దగ్గరే ఆగిపోతున్నారు. విద్యార్థులు పోటీ పరీక్షల వరకు కాస్తో కూస్తో నెట్టుకొస్తున్నా ఇంటర్వ్యూలకొచ్చే సరికి కమ్యూనికేషన్ స్కిల్స్ లోపంతో విఫలమవుతున్నారు. దగ్గరగా వచ్చి ఉద్యోగాలను పొందలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో పేదవాళ్ల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సర్కారు ప్రాథమిక స్థాయి నుంచి ఆంగ్లంలో బోధించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం వెలువడినప్పటి నుంచి టీడీపీ, జనసేన నాయకులు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. కానీ అచ్చె న్న వంటి వారంతా పిల్లలను మాత్రం ఎంచక్కా కార్పొరేట్ స్కూళ్లలో, ఇంగ్లిష్ మీడియంలో చదివించుకుంటున్నారు. దీనిపై ప్రజలే నాయకులను నిగ్గదీసి అడగాలని అభ్యుదయవాదులు చెబుతున్నారు.
టీడీపీ నేతల పిల్లలు చదువుతున్నదిక్కడే..
►ఇచ్ఛాపురం ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్ బాల్యం నుంచి బీడీఎస్ పూర్తి అయ్యేవరకు ఇంగ్లిష్ మీడియం లోనే చదువుకున్నారు. ఆయన ఇద్దరు చెల్లెళ్లు కూడా ఆయనతో పాటుగానే శ్రీకాకుళం జిల్లా పాతపట్నం సెయింట్ ఆన్స్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో చదువులు సాగించారు.
►మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ పిల్లలు నీలి మ, రేష్మ శ్రీకాకుళంలోని సెయింట్ జోసఫ్ స్కూల్‌లో ఇంగ్లిష్ మీడియంలో చదివారు.
►టీడీపీ నేత కోండ్రు మురళీమోహన్‌కు ఇద్దరు కుమార్తెలు. ప్రస్తుతం విశాఖపట్నంలోని ఓ కార్పొరేట్ స్కూల్‌లో ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్నారు. అక్కడే పిల్లల చదువులు కోసం ఉంటూ రా జాం తాత్కాలికంగా వస్తుంటారు. ఇటీవల ఆయన ఓ కార్పొరేట్ ఇంగ్లీషు మీడియం స్కూల్‌ను రణస్థలం హైవే పక్కన పెట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు కూడా.
►టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు కావలి ప్రతిభాభారతి కుమారుడు నానిబాబు, కుమార్తె గ్రీష్మాప్రసాద్ విశాఖపట్నం, హైదరాబాద్‌లలో ఇంగ్లీషు మీడియంలో చదివారు. నానిబాబు పిల్లలు కూడా ప్రస్తుతం ఇంగ్లీషు మీడియంలోనే చదువుతున్నారు.
►మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ కుమార్తె హారిక, కుమారుడు కె.సాగర్, ఇంగ్లిష్ మీడియంలోనే చదివించారు. వారిద్దరూ గుంటూరు, హైదరాబాద్, విశాఖపట్నం, ఢిల్లీలో చదివారు.
►టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు చౌదరి బాబ్జీ కుమారుడు అవినాష్ శ్రీకాకుళంలోని న్యూ సెంట్రల్ స్కూల్‌లో ఇంగ్లిష్ మీడియంలో చదివారు. కుమార్తె చైతన్య కూడా అదే స్కూల్‌లో చదివారు.
►మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ ఇద్దరు పిల్లలు శివగంగాధర్, విశ్వనాథం ఇంగ్లిష్ మీడియంలోనే చదివారు.
►మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఇద్దరు పిల్లలు ఆంగ్ల మాధ్యమంలోనే చదువు సాగించారు.
►మాజీ ఎమ్మెల్యే గౌతు శ్యామ్ సుందర్ శివాజీ ఇద్దరు కుమార్తెలు ఇంగ్లిష్ మీడియంలోనే చదివారు. ప్రస్తుత టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష కూడా ఇంగ్లిష్ మీడియంలోనే విద్యాభ్యాసం చేశారు. వారి ఇద్దరు పిల్లలు విశాఖలో ఇంగ్లిష్ మీడియంలోనే చదువుతున్నారు.
జనసేన నేతల పిల్లలు..
►మొన్నటి ఎన్నికల్లో జనసేన తరఫున ఎంపీగా పోటీ చేసిన మెట్ట రామారావు తన ఇద్దరు పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలోనే చదివించారు. కుమారుడు కళ్యాణ్‌కృష్ణను న్యూఢిల్లీలో ఇంజినీరింగ్ చదివించగా, కుమార్తె వైష్ణవిని ఢిల్లీలోనే ఇంటర్ చదివించారు.
►పలాసలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన కోత పూర్ణచంద్రరావు కూడా తన కుమార్తెను కాశీబుగ్గ లిటిల్ ఏంజిల్ స్కూల్‌లో ఇంగ్లిష్ మీడియం చదివించారు.
►శ్రీకాకుళం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన కోరాడ సర్వేశ్వరరావు కూడా తన కుమారుడ్ని హైదరాబాద్‌లో ఇంగ్లిష్ మీడియంలో చదివిస్తున్నారు.
►ఆమదాలవలసలో పోటీ చేసిన పేడాడ రామమోహన్ తన కుమారుడు చైతన్యస్వా మిని శ్రీకాకుళంలోని ఆక్స్‌ఫర్డ్ స్కూల్‌లో ఇంగ్లిష్ మీడియంలో చదివిస్తున్నారు.
►ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి జనసేన తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసిన బాదాన వెంకట జనార్దనరావు తన ఇద్దరు కుమార్తెలు చాందిని, జాహ్నవిలను శ్రీకాకుళంలోని శ్రీచైతన్యలో ఇంగ్లిష్ మీడియంలో చదివారు.
►రాజాం నియోజకవర్గం నుంచి జనసేన తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసిన మచ్చా శ్రీనివాసరావు తన ఇద్దరు పిల్లల్ని విశాఖపట్నంలో ఇంగ్లిష్ మీడియంలోనే చదివిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment